మానవులు పుడతారు ... చనిపోతారు . కొంతమంది మాత్రమే తమ జీవితం లో ప్రజలకు ఉపయోగపడే సేవాకార్యక్రమాలు చేసి తమ జీవితాన్నే ఫణం గా పెట్టి మానవ జాతిలో చిరస్థాయిగా తరతరాలుగా నిలిచిపోతారు ... వీరిని "మృతంజీవులు" అని అంటారు . కోటాను కోట్ల జనం లో బహు కొద్ది మంది మాత్రమే ఇలాంటివారు ఉంటారు . ప్రపంచము లో ప్రతి జాతి లోనూ ఈ తరహా మహానుభావులు పుట్టి తమ సేవలతో పుణీతులయ్యారు . భారత జాతికి మణిపూసలైన కొందరి మహానుభావులను తెలుసుకునే ప్రయత్నం లో ఇక్కడ -Periyar,పెరియార్- గురించి తెలుసుకొని మన జీవితాన్ని చక్కని మార్గములో ప్రయాణించే ప్రయత్నం చేద్దాము ....
దేశంలో అంటరానితనం, కులవివక్ష లకు వ్యతిరేకంగా బహుజనులను ఉద్య మబాట పట్టించిన నిత్య చైతన్యమూర్తి పెరియార్. దేశంలో మనువాదుల వికృ తాలకు వ్యతిరేకంగా పెరియార్ సాంఘి క విప్లవోద్యమానికి నాంది పలికారు. గృహహింసను అరికట్టేందుకు మహిళలతో కలిసి మద్యపాన వ్యతిరేక ఉద్యమాన్ని ప్రారంభించి వారితోపాటు జైలుకు వెళ్లారు. కులాంతర, మతాంతర వివాహాలను ప్రోత్సహిస్తూ సమసమాజం స్థాపన లక్ష్యంగా అహరహం పోరాడిన సంఘ సంస్కర్త పెరియార్. హిందూ సంప్రదాయాలకు వ్యతిరేకంగా నవదంపతులతో బహిరంగ ప్రమాణాల ద్వారా వివాహాలు చేయించిన స్త్రీ విముక్తి ప్రదాత.
పెరియార్ 1879, సెప్టెంబర్ 17న తమిళనాడులోని ఈరోడ్ పట్టణంలో జన్మించాడు. ఆయన పేరు ఈ.వి.రామస్వామి నాయకర్. ‘పెరియార్’ బిరుదును 1938 సంవత్సరంలో మహిళలు ఆయనకు ప్రదానం చేశారు. పెరియార్ అనగా ‘మహానుభావుడు’. సమాజంలో చోటుచేసుకున్న దుష్ట సంప్రదాయాలు, మూఢాచారాలకు వ్యతిరేకంగా 1925లో ‘స్వయం గౌరవం’ పేరుతో సాంస్కృతిక, సామాజిక విప్లవాన్ని ప్రారంభించి పెరియార్ నవసమాజా నికి దారులు వేశారు. పురుషుని స్వాధీనంలో ఉన్న వస్తుసంపద, వనరులు, ఆస్తులు స్త్రీలను కట్టు బానిసలుగా మార్చిన తీరును చారిత్రక దృష్టి కోణం నుంచి అవగాహన చేసుకున్న తొలి స్త్రీవాది పెరియార్. బలహీన వర్గాల ప్రజలకు విద్య, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్ల కోసం ప్రభుత్వం చేత కమ్యూనల్ జీవో 1926ను జారీ చేయించి, అమలు చేయించిన సామాజిక న్యాయ కోవిదుడు. అడుగంటిపోతున్న ‘ద్రవిడ సంస్కృతి’ని పరిరక్షించేందుకు దక్షిణ భారతాన్ని ‘ద్రవిడనాడు’గా ప్రకటించాలని ఎలుగెత్తి చాటిన ఆత్మగౌరవ పతాక!
రాజకీయ రంగంలో అన్ని కులాలకు వారి జనాభా దామాషా ప్రకారం సీట్ల కేటాయింపు జరిగినప్పుడే ప్రజాస్వామ్యం ఫలప్రదమవుతుందని నాడే చాటి చెప్పిన పెరియార్ మార్గం విలక్షణమైనది. 1919లో కాంగ్రెస్ పార్టీలో చేరిన పెరియార్ బహుజనుల పట్ల ఆ పార్టీ ప్రదర్శిస్తున్న వివక్షను ప్రశ్నిస్తూ, అందుకు నిరసనగా 1925లో రాజీనామా చేశారు. బహుజ నుల సమస్యలపై గాంధీ వంటి నాయకులు ప్రదర్శిస్తున్న వివక్షకు వ్యతిరేకంగా వారితో చర్చలకు, సంవాదాలకూ ఆయన ఏ మాత్రం వెనుకాడలేదు. పెరియార్ 1939లో ‘జస్టిస్ పార్టీ’లో చేరి కీలక బాధ్యతలు నిర్వహించారు. అనంతరం ‘ద్రవిడ కజగమ్’ నెలకొల్పి అన్నా దురైతో కలిసి పనిచేశారు. ‘నవయుగ ప్రవక్తగా’, ‘ఆసియా సోక్రటిస్’గా యునెస్కో 1970లో పెరియార్‌ను గౌరవించింది. దాక్షిణాత్యుల ఆభిజాత్యానికి, ఆత్మగౌరవానికి నిలువెత్తు నిదర్శ నంగా నిలిచిన పోరాటయోధుడు పెరియార్. 1973, డిసెంబర్ 24న పెరియార్ తుదిశ్వాస విడిచారు. ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికకు జనాభా దామాషా ప్రాతిపదిక కావాలని పెరియార్ ప్రవచించిన ప్రజాస్వామ్య సూత్రం వాస్తవ రూపం దాల్చేందుకు కృషి చేయాల్సిన కర్తవ్యం నేటి బహుజనులపై ఉంది.
బట్టు వెంకయ్య బహుజన టీచర్స్ అసోసియేషన్, తెనాలి, గుంటూరు జిల్లా
(రేపు పెరియార్ 39వ వర్ధంతి)-@http://www.sakshi.com/main/
- ==========================
No comments:
Post a Comment
Thanks for your comment & feedback.