Wednesday, January 26, 2011

హరగోవింద్ ఖొరానా, HARGOBIND KHORANA


హరగోవింద్ ఖొరానా భారతీయ సంతతికి చెందిన, నోబెల్ బహుమతి పొందిన ప్రఖ్యాత జీవ శాస్త్రజ్ఞుడు. జనవరి 9, 1922న అవిభక్త భారత దేశములోని పంజాబ్ రాష్ట్రమునకు చెందిన రాయపూరు అను గ్రామములో జన్మించాడు (ప్రస్తుతం పాకిస్తాన్ లో ఉన్నది).ప్రస్తుతం (2007) ఆయన మస్సాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో ప్రొఫెసర్‌గా సేవలందిస్తున్నారు.


మరింత సమాచారము కోసం : తెలుగు వికిపిడియాను చూడండి ->హరగోవింద్ ఖొరానా
  • ========================================
Visit my website - > Dr.seshagirirao.com

స్వామి వివేకానంద, Swami Vivekananda


స్వామి వివేకానంద జయంతి : జనవరి 12, 1863వ సంవత్సరంలో కలకత్తాలో జన్మిం చారు స్వామి వివేకానంద. వీరి అసలుపేరు నరేంద్రనాథ్‌ దత్‌. తల్లిదండ్రులు భువనేశ్వరీ దేవి, విశ్వనాథ్‌ దత్‌. వివిధ మత సిద్ధాంతా లను ఆకలింపు చేసుకున్న ఆయన కొంత కాలం బ్రహ్మసమాజం ప్రభావంలో గడిపాడు. రామకృష్ణ పరమహంస మరణానంతరం సన్యాసం స్వీకరించి వివేకానందుడయ్యాడు. హిమాలయాలకు వెళ్ళి ఆరేళ్ళపాటు ధ్యానం లో గడిపాడు. 1893లో చికాగోలో జరిగిన సర్వమత సమ్మేళనానికి హిందూమత ప్రతినిధి గా హాజరయ్యాడు. ఆ తరువాత ఇంగ్లాండ్‌, శ్రీలంక, స్టిట్జర్లాండ్‌ మొదలైన దేశాలు పర్య టించి ఉపన్యసించాడు. ఇంగ్లాండ్‌లో ఆమె శిష్యురాలిగా మారి ఇండియాకు వచ్చిన మార్గ రెట్‌ నోబుల్‌ ఆ తరువాత సిస్టర్‌ నివేదితగా మారింది. రామకృష్ణమిషన్‌ అనే సంస్థను స్థాపించాడు. ‘రాజయోగం’ మొదలైన గ్రంథా లను రచించాడు. కలకత్తా సమీపంలోని బేలూరులో జులై 4, 1902వ సంవత్సరంలో మరణించాడు.

For details about Swami Vivekananda in Telugu --> Swami Vivekananda స్వామి వివేకానంద
  • ========================================
Visit my website - > Dr.seshagirirao.com

Tuesday, January 25, 2011

నేతాజీ సుభాష్‌ చంద్ర బోస్, Netaji Subhas Chandra Bose

నేతాజీ సుభాష్‌ చంద్ర బోస్‌ జయంతి: 24-01-1897.

ప్రభావతి, జనకీనాథ్‌ బోస్‌ దంపతులకు తేదీ 24-01-1897వ సంవత్సరంలో ఒరిస్సాలో ని కట్‌ లో జన్మించాడు నేతాజీ సుభాష్‌ చం ద్రబోస్‌ 1920 లండన్‌లో ఇండియన్‌ సివిల్‌ సర్వీస్‌ పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడు. చిత్తరంజన్‌ దాస్‌ ఈయనకు మార్గదర్శి. స్వాతంత్య్రోద్య మంలో పాల్గొని 1921లో అరెస్టయ్యాడు. కాంగ్రెస్‌లో కొంతకాలం కొనసాగిన తరువాత ఫార్వర్డ్‌ బ్లాక్‌ అనే పార్టీని స్థాపించాడు. 1941 లో బ్రిటీష్‌ పోలీసుల కన్నుగప్పి ఇంటి నుంచి అదృశ్యమయ్యాడు.

జర్మనీలోని ఒక జలాంత ర్గామిలో 90 రోజులు ప్రయాణించి ఆఫ్రికాను ప్రదక్షిణం చేసి హందూ మహాసముద్రం మీ దుగా జపాన్‌ చేరుకున్నాడు. 1943లో ఇండి యన్‌ నేషనల్‌ ఆర్మీ (ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌) కి సర్వసైన్యాధిపతిగా నాయక త్వం వహించాడు. ‘యాన్‌ ఇండియన్‌ పిలిగ్రిమ్‌’ పేరుతో ఆత్మక థను రాశాడు. ఈయన ఫార్మోసా వెళుతున్న సమయంలో విమానం కూలిపోవటంతో మర ణించాడని అంటారు. ఆ ప్రమాదంలో వీరు మరణించి ఉండకపో వచ్చునని కొందరి అభిప్రాయం.

మరికొంత సమాచారము కోసం - > వికీపిడియాలో నేతాజీ సుబాష్ చంద్రబోస్

  • ========================================
Visit my website - > Dr.seshagirirao.com