Thursday, March 14, 2013

Madapati Hanumantharao,మాడపాటి హనుమంతరావు


  •  
మానవులు పుడతారు ... చనిపోతారు . కొంతమంది మాత్రమే తమ జీవితం లో ప్రజలకు ఉపయోగపడే సేవాకార్యక్రమాలు చేసి తమ జీవితాన్నే ఫణం గా పెట్టి మానవ జాతిలో చిరస్థాయిగా తరతరాలుగా నిలిచిపోతారు ... వీరిని "మృతంజీవులు" అని అంటారు . కోటాను కోట్ల జనం లో బహు కొద్ది మంది మాత్రమే ఇలాంటివారు ఉంటారు . ప్రపంచము లో ప్రతి జాతి లోనూ ఈ తరహా మహానుభావులు పుట్టి తమ సేవలతో పుణీతులయ్యారు . భారత జాతికి మణిపూసలైన కొందరి మహానుభావులను తెలుసుకునే ప్రయత్నం లో ఇక్కడ - Madapati Hanumantharao,మాడపాటి హనుమంతరావు- గురించి తెలుసుకొని మన జీవితాన్ని చక్కని మార్గములో ప్రయాణించే ప్రయత్నం చేద్దాము ....
             
రైతాంగ జీవితంపై 1912లో తొలి కథానిక ‘ఎవరికి?’ రచించిన మాడపాటి హనుమంతరావు జీవితం కేవలం సాహిత్యరంగానికే పరిమితం కాలేదు. తెలుగువారి సాంస్కృతిక, సాంఘిక, రాజకీయ జీవనాన్ని ఆయన తన ఆచరణతో గాఢంగా ప్రభావితం చేశారు. కృష్ణాజిల్లా ఒక్కనూరు గ్రామం లో 1885, జనవరి 22న జన్మించిన మాడపాటి ఆంధ్రమహాసభ నేతృత్వంలో సాగిన ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. మాడపాటి గ్రంథాలయోద్యమంలో నిర్వహిం చిన భూమిక ఎన్నదగినది.

పాత్రికేయునిగా కూడా ఆయన తనదైన ముద్ర వేశారు. బాలికల కోసం ఆయన ఎన్నో పాఠశాలలను నెలకొల్పారు. ఆయన పేర ఈనాటికీ హైదరాబాద్ నగరంలోని నారాయణగూడలో ప్రసిద్ధ పాఠశాల మనుగడలో ఉంది. హైదరాబాద్‌లోని శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయం, హన్మకొండలోని రాజరాజనరేంద్ర ఆంధ్ర గ్రంథాల యం మాడపాటి చల్లని నీడన ఎదిగినవే. 1951లో ఆయన హైదరాబాద్ నగర మేయర్‌గా ఎన్నికయ్యారు. 1958లో శాసనమండలి తొలి అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వహించారు. మాడపాటి 1970, నవంబర్ 11న 85వ ఏట కన్నుమూశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆయనను గౌరవ డాక్టరేట్‌తో, భారత ప్రభుత్వం ‘పద్మ భూషణ్’ బిరుదుతో గౌరవించాయి. ‘ఆంధ్ర పితామహ’గా ఖ్యాతినొందిన మాడపాటి తెలుగువారందరికీ ప్రాతఃస్మరణీయుడు.
వంకాయలపాటి రవి కూకట్‌పల్లి, హైదరాబాద్

(నేడు ‘ఆంధ్రపితామహ’ మాడపాటి 42వ వర్ధంతి)- @ http://www.sakshi.com/
  • ==========================
Visit my website - > Dr.seshagirirao.com/

No comments:

Post a Comment

Thanks for your comment & feedback.