Sunday, March 18, 2012

అరబిందో,Aravindo,అరవిందో



మానవులు పుడతారు ... చనిపోతారు . కొంతమంది మాత్రమే తమ జీవితం లో ప్రజలకు ఉపయోగపడే సేవాకార్యక్రమాలు చేసి తమ జీవితాన్నే ఫణం గా పెట్టి మానవ జాతిలో చిరస్థాయిగా తరతరాలుగా నిలిచిపోతారు ... వీరిని "మృతంజీవులు" అని అంటారు . కోటాను కోట్ల జనం లో బహు కొద్ది మంది మాత్రమే ఇలాంటివారు ఉంటారు . ప్రపంచము లో ప్రతి జాతి లోనూ ఈ తరహా మహానుభావులు పుట్టి తమ సేవలతో పుణీతులయ్యారు . తెలుగు జాతికి మణిపూసలైన కొందరి మహానుభావులను తెలుసుకునే ప్రయత్నం లో ఇక్కడ -అరబిందో- గురించి తెలుసుకొని మన జీవితాన్ని చక్కని మార్గములో ప్రయాణించే ప్రయత్నం చేద్దాము ....

అరబిందో(Aravindo,అరవిందో) సుప్రసిద్ధ బెంగాలీ పండితుడు, కవి, జాతీయ వాది, యోగి, మరియు గురువు. ఆధ్యాత్మిక సాధనవల్ల అత్యుత్తమ స్థాయికి ఎదిగిన మహనీయుల్లో శ్రీ అరవిందో ఒకరు .
  • జనము : ఆగస్టు 15, 1872,
  • మరణము : డిసెంబరు 5, 1950,
  • భార్య : మృణాళిని ,
  • తోబుట్టువులు : మూడో కుమారుడు , (ఒక సోదరి +4 సోదరులు )
  • చదువు : అద్భుతమైన మేధాశక్తి తో గీకు , లాటిన్‌ లాంటి విదేశీ భాషలలో ప్రావీణ్యము , ఐ.సి.యస్ . మొదటి స్థానము లో పాసయ్యారు . ఇంగ్లిష్ లో మంచి పావీణ్యము ఉంది .
బాల్యము : అరబిందో ఆగస్టు 15, 1872 న కోల్‌కతా లో జన్మించాడు. ఈయన పూర్తి పేరు అరబిందో ఘోష్. అరవింద అనగా బెంగాలీలో పద్మము అని అర్థం. తల్లి స్వర్ణ లతా దేవి. తండ్రి కె.డి.ఘోష్. తండ్రి వైద్యుడు. ఈయన బ్రిటన్ లో ఉండి అబెర్దీన్ విశ్వ విద్యాలయంలో వైద్య విద్య నభ్యసించాడు.

  • రాజకీయాల్లోంచి ఆధ్యాత్మికత వైపుకు : అరబిందో రాజకీయం నుంచి ఆధ్యాత్మికత వైపుకు క్రమక్రమంగా ప్రవేశించడం జరిగింది. మొదటగా వడోదరలో మహారాష్ట్ర యోగియైన విష్ణు భాస్కర్ లెలె ఉపదేశంతో ఆధ్యాత్మికత వైపుకు ఆకర్షితుడైనాడు. రెండవసారి కోల్‌కతాలోని ఆలీపూర్ కేంద్ర కారాగారం లో శిక్ష అనుభవిస్తున్నపుడు ఆధ్యాత్మికత పట్ల గాఢమైన ఆసక్తి కలిగింది. ఇక్కడ ఆయన చేసిన భగవద్గీత పారాయణం, అనుసరణ ఆయనకు అనేక ఆధ్యాత్మిక అనుభూతుల్ని కలిగించాయి.

తాత్విక మరియు ఆధ్యాత్మిక రచనలు : పుదుచ్చేరిలో నాలుగేళ్ళు ఏకాగ్రతతో యోగాను పాటించి అనంతరం 1914 వ సంవత్సరంలో ఆర్య అనే అరవై నాలుగు పేజీల సమీక్షను మాసపత్రిక రూపంలో వెలువరించాడు. తర్వాత ఆరున్నరేళ్ళ పాటు ఆయన ఈ పత్రిక ద్వారానే తన ముఖ్యమైన ధారావాహికంగా రచనలను ప్రజలకు చేరవేసేవాడు.


  • సత్యన్వేషణకు రహదారి అరబిందో ఆశ్రమం : ప్రపంచాన్ని సత్యమార్గంలో నడిపించేందుకు యోగ సాధనలో చరిత్ర సృష్టించిన భగవాన్ శ్రీ అరవింద శ్రీ అన్నై పవిత్ర సమాధి తమిళనాడులోని పుదుచ్చేరిలో వెలసి ఉండటం ఎంతో భాగ్యమని ఆధ్యాత్మిక పెద్దలంటూ ఉంటున్నారు.

ఆధ్యాత్మికమార్గంలో ప్రపంచంలోని అన్ని వర్గాల ప్రజలను ఒకే త్రాటిపై నడిపించే తరహాలో ఎన్నో శుభకార్యాలు శ్రీ అరవిందర్, అన్నై ఆశీస్సులతో జరిగాయనడంలో ఎలాంటి సంశయం లేదు. పుదుచ్చేరికి వెళ్లి వస్తే.. మలుపులు కలుగుతాయని ఆధ్యాత్మిక గురువులు అంటుంటారు.

  • అలాగే శ్రీ అన్నై మాతను స్మరించుకుని ఎలాంటి కార్యాన్నైనా ప్రారంభించేవారికి ఆటంకాలుండవని భక్తుల విశ్వాసం. అలాగే జీవిత సుఖసంతోషాలు కలుగజేసే ఆ దేవదేవుని లీలలెన్నో ఉన్నాయని పుదుచ్చేరి అన్నై అరబిందో ఆశ్రమ స్థల పురాణాలు చెబుతున్నాయి.

భగవానుని లక్ష్యాన్ని మానవరూపం ధరించి (అరబిందోగా) పరమాత్ముని లక్ష్యాన్ని నెరవేర్చేందుకు జన్మించి, పుదుచ్చేరి ఆశ్రమంలో జీవించారని ఆధ్యాత్మిక గురువులు అంటున్నారు.

ప్రపంచ అభివృద్ధి కోసం అరబిందో స్వామి సేవలందించిన సంస్థల్లో పుదుచ్చేరి అరబిందో ఆశ్రమం కీలక పాత్ర పోషిస్తోంది. అంతేగాకుండా అరవింద భగవానుడు

  • రాసిన లైఫ్‌డివైన్, సింథసిస్ ఆఫ్ యోగా, సావిత్రి అన్నై రాసిన మధర్ అజెండాలతో పాటు పలు ఆధ్మాత్మిక రచనలు మానవమాత్రుని జీవితానికి ఎంతగానో సహకరిస్తున్నాయి. అలాగే మానవాభివృద్ధికి అవసరమైన దైవ, ఆధ్యాత్మిక సూచనలు అందిస్తున్నాయి. అటువంటి మహనీయుని ఆధ్యాత్మిక మార్గములో మానవుడు పయనించేందుకు వీలుగా అరబిందో మహాత్ముని ఉపదేశాలు, ఆధ్యాత్మిక సూచనలు దేశంలోనే గాకుండా.. ప్రపంచవ్యాప్తంగా గల ప్రజలకు మార్గదర్శకం చేసిన శ్రీ అన్నై అరవిందో అన్నై ఆశీస్సులను పొందేందుకు వీలుగా చెన్నై నగరంలోని శ్రీ అరబిందో మదర్స్ సొసైటి తరపున చెన్నై వెస్ట్ మాంబళం, నంగనల్లూరు, అంబత్తూరు అనే మూడు ప్రాంతాల్లో భక్తులకు ఆధ్యాత్మిక సూచనలు అందిస్తోంది.

పుదుచ్చేరిలోని ఆశ్రమ వాతావరణం తరహాలో చెన్నై నగరంలో వందలాది మంది భక్తులు వచ్చి వెళ్లేందుకు వీలుగా, దీంతో పాటు ప్రపంచంలోని ఆధ్యాత్మిక ప్రియుల రాకపోకలకు సత్యజీవియ కేంద్రం ఏర్పాటైంది. ఈ కేంద్రంలో భగవాన్, అన్నై పవిత్ర శక్తితో కూడిన వస్తువులతో సమాధిని ఏర్పాటు చేయడం, భగవాన్ అన్నై అరబిందో అన్నైల నిలువెత్తు విగ్రహాన్ని ఏర్పాటు చేయడం, ధ్యానమందిరాలను ఏర్పాటు చేయనున్నారు
  • ===================================
Visit my website - > Dr.seshagirirao.com/