Monday, November 22, 2010

లాల్ కృష్ణ అద్వానీ, L.K.Advani



లాల్ కృష్ణ అద్వానీ-పార్లమెంటు సభ్యుడు,మాజీ ఉపప్రధాని,మాజీ కేంద్ర హోంశాఖ మంత్రి ,భారతీయ జనతా పార్టీ మాజీ అద్యక్షుడు


భారతదేశపు ప్రముఖ రాజకీయ నాయకులలో ఒకడైన లాల్ కృష్ణ అద్వానీ 1927 నవంబర్ 8న సింధ్ ప్రాంతంలోని కరాచిలో జన్మించాడు. 15 సం.ల వయస్సులోనే ఆర్.ఎస్.ఎస్.లో ప్రవేశించాడు. ఆ తరువాత దేశ రాజకీయాలకే అంకితమయ్యాడు. భారతీయ జనసంఘ్ పార్టీలో చేరి అనతి కాలంలొనే ముఖ్య పదవులు పొందినాడు. 1967లో ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ అధ్యక్షుడైనాడు. 1977లో మురార్జీ దేశాయ్ ప్రభుత్వంలో మంత్రిపదవికి పొందినాడు. 1980లో భాజపా ఏర్పడిన తరువాత దేశ రాజకీయాలలో ప్రముఖ పాత్ర వహించే అవకాశం లభించింది. అటల్ బిహారి వాజపేయి నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో కీలకమైన హోంశాఖ పదవిని నిర్వహించాడు.

For full details - > Advani L.K in Telugu

========================================
Visit my website - > Dr.seshagirirao.com

Saturday, November 20, 2010

ఎన్‌.జి.రంగా , N G Ranga,ఆచార్య ఎన్‌.జి.రంగా


ఆచార్య ఎన్‌.జి.రంగా : దేశంలో సుదీర్ఘకాలం పార్లమెంట్‌ సభ్యునిగా పనిచేసి, ఎటువంటి పదవి ఆశించకుండా రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం తన తుది శ్వాస విడిచేంత వరకు అవిశ్రాంత పోరాటం జరిపిన మహౌన్నతుడు ఆచార్య ఎన్‌.జి.రంగా, రైతుల పక్షాన చట్టసభలలో తన వాణిని వినిపించి, పాలక పక్షాలు వ్యవసాయం యొక్క ప్రాధాన్యతను గుర్తించే విధంగా ఆయన చేసిన కృషి అనిర్వచనీయం. ఆయన చేనేత కార్మికుల, వ్యవసాయ కూలీల జీవితాలలో వెలుగులు నింపడానికి ఆవిరళ కృషి సల్పారు. దేశంలో రైతాంగ ఉద్యమాలకు వెన్నుదన్నుగా నిలిచి, రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారం అయ్యేలా విశేషంగా ప్రయత్నించారు. దేశంలో తొలిసారిగా వ్యవసాయ రుణాలపై మారటోరియం ప్రకటించడానికి ఆద్యుడు ఎన్‌.జి.రంగానే.

ఆయన నిడుబ్రోలులో గోగినేని నాగయ్య, అచ్చమాంబ దంపతులకు 1900 నవంబర్‌ 7వ తేదీన జన్మించారు. ఆయన అసలు పేరు గోగినేని రంగనాయకులు. అనంతరం ఎన్‌.జి.రంగాగా సుప్రసిద్ధులయ్యారు. ఇరవై ఏళ్ళ వయస్సులో ఉన్నత చదువుల కోసం ఇంగ్లాడ్‌ వెళ్ళారు. మూడేళ్ల తర్వాత స్వదేశానికి తిరిగి వచ్చిన రంగా కాంగ్రెసు పార్టీవైపు ఆకర్షితులై ఆ పార్టీ కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారు. 1924లో భారతీదేవితో రంగా వివాహం జరిగింది. ఆనంతరం 1927లో మద్రాసులోని పచ్చయప్ప కళాశాలలో ఆర్ధిక శాస్త్ర అధ్యాపకునిగా, అనంతరం మద్రాసు ప్రభుత్వ ఆర్ధిక సలహాదారునిగా కొంత కాలం పనిచేశారు. 1930లో స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్నారు. జవహర్‌లాల్‌ నెహ్రూ, నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌లతో సన్నిహితంగా మెలుగుతూ స్వాతంత్య్ర సంగ్రామంలో విజృంభించారు. 1931లో భూమి శిస్తుకు వ్యతిరేకంగా ఉద్యమించిన రంగాను బ్రిటీషు ప్రభుత్వం అరెస్టు చేసింది. అరెస్టులకు బెదరని రంగా రైతుల దుర్భర పరిస్ధితులకు వ్యతిరేకంగా రైతు రుణ విముక్తి ఉద్యమాన్ని ప్రారంభించి, జిల్లా కలెక్టర్‌ కార్యాలయాల ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ ఉద్యమ ఫలితంగానే బ్రిటీష్‌ ప్రభుత్వం ఆనాడు రైతుల రుణాలపై మారటోరియంను ప్రకటించింది. అప్పటి నుంచి రైతు సమస్యలు ఎక్కడ ఉంటే అక్కడ రంగా ప్రత్యక్షమై ఉద్యమాలను నిర్వహించేవారు. యువతకు రాజకీయాలు నేర్పడానికి పాఠశాలను స్ధాపించిన ఘనత ఆచార్య ఎన్‌.జి.రంగాకే దక్కింది. దేశంలోనే తొలిసారిగా ఆయన నిడుబ్రోలులో రామనీడు పేరుతో రాజకీయ పాఠశాలను ఏర్పాటు చేసారు. దేశ స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొనడానికి సమర్ధులైన నాయకులను రాజకీయాల్లోకి తేవడమే లక్ష్యంగా 1933వ సం.లో రంగా స్ధాపించిన రాజకీయ విద్యాలయాన్ని మహాత్మాగాంధి ప్రారంభించడం విశేషం. రాష్ట్రం, దేశం నుంచి విద్యాలయానికి విచ్చేసి రాజకీయంగా ఓనమాలు నేర్చుకున్న నాయకులు ఎందరో సమర్ధులైన నాయకులుగా పేరు ప్రఖ్యాతులు గడించారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రులుగా, గవర్నర్లుగా, మంత్రులుగా, ఎమ్మెల్యే పదవులను చేపట్టి రాణించారు. ప్రస్తుత మన రాష్ట్ర ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య కూడా రంగా శిష్యుడే. రంగా స్పూర్తితో ఇతర రాష్ట్రాల్లో కూడా రాజకీయ విద్యాలయాలను నిర్వహించారు. ఈ పాఠశాల స్మృతులకు సజీవ సాక్ష్యంగా నేటికి నిడుబ్రోలులో కొనసాగుతుంది. రంగా రైతుల ప్రతినిధిగా పార్లమెంటులో ప్రవేశించి తమ వాణిని వినిపించారు. అప్పటినుంచి విజయ పరంపర సాగిస్తూ...సుదీర్ఘ కాలం పార్లమెంట్‌ సభ్యునిగా రికార్డు సృష్టించి,గిన్నీస్‌ బుక్‌లోకి ఎక్కారు. చిత్తూరు, శ్రీకాళహస్తి, గుంటూరు లోక్‌సభ నియోజక వర్గాల నుంచి ఎన్నికై ఆయన ప్రాతినిధ్యం వహించారు. 95 సంవత్సరాల వయస్సులో ఆయన అనారోగ్యంతో 1995 జూన్‌ 8వతేదీన నిడుబ్రోలులోని ఆయన స్వగృహమైన గోభూమిలో తుదిశ్వాస విడిచారు. రంగా మరణంతో భారత రాజకీయ వినీలాకాశం నుంచి ఓ ధృవతార రాలిపోయిందని జాతీయ, అంతర్జాతీయ స్ధాయి నాయకులు తమ సందేశాల్లో కొనియాడటం విశేషం.


========================================
Visit my website - > Dr.seshagirirao.com

సి.పి.బ్రౌన్ , C P brown




సి.పి.బ్రౌన్‌ : 10-11-1798వ సంవత్సరంలో కలకత్తా నగరంలో జన్మించారు చార్లెస్‌ ఫిలిప్‌ బ్రౌన్‌. కలెక్టర్‌కు అసిస్టెంట్‌గా 1820లో కడప చేరుకున్నారు. ఉద్యోగబాధ్యతలు నిర్వహిస్తూనే... తెలుగు సాహిత్యసేవ చేశారు. మహాభారతం శుద్ధ ప్రతి తయారీకి 2000 రూపాయలకు పైగా ఖర్చు చేశారు. అప్పటికి ఆయన నెల జీతం 500 మత్రమే. 60 వేల అప్పు తెచ్చి వేలాది తెలుగు గ్రంథాలను సేకరించి పండితులచేత పరిష్కరణలు చేయించి అచ్చుకు ప్రతులను సిద్ధం చేయించాడు. వేమన పద్యాలను ఆంగ్లంలోకి అనువదించాడు. నిఘంటువులను కూర్చాడు. 36 ఏళ్ళు మనదేశంలో ఉద్యోగం చేసి చివరి దశలో లండన్‌ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా పనిచేశాడు.

  • ========================================
Visit my website - > Dr.seshagirirao.com

బిపిన్‌ చంద్రపాల్ , Bipin Chandra Pal




బిపిన్‌ చంద్రపాల్‌ : 07-11-1858వ సంవత్సరంలో నాటి బెంగాల్‌లోని (నేటి బంగ్లాదేశ్‌) సిల్హట్‌లో జన్మించారు. బ్రహ్మసమాజంలో చేరి ఆ సిద్ధాంతాలను ప్రచారం చేశారు. ప్రజలను ఉత్తేజపరిచే ఉపన్యాసకుడిగా పేరొందారు. వందేమాతరం ఉద్యమ వ్యాప్తిలో భాగంగా రాజమండ్రిలో ఈయన ప్రసంగించిన ప్రాంతాన్ని ‘పాల్‌ చౌక్‌’ అని పిలుస్తున్నారు. మచిలీపట్నంలోని ఆంధ్ర జాతీయ కళాశాల ఈయన ఉపన్యాసాల ప్రభావంతోనే ఏర్పాటు చేయబడిందట. ట్రిబ్యూన్‌, న్యూ ఇండియా, వందేమాతరం మొదలైన పత్రికల్లో ఈయన రచనలు ఎన్నో ప్రచురింపబడినాయి. గాంధీజీతో విబేధించిన కారణంగా ఈయనకు తగిన గుర్తింపు రాలేదంటారు. ఆనాటి రాజకీయాల్లో ప్రధాన పాత్రధారులైన లాలా లజపతిరాయ్‌, బాలగంగాధర్‌ తిలక్‌, బిపిన్‌ చంద్రపాల్‌ అనే నాయక త్రయాన్ని ‘లాల్‌, బాల్‌, పాల్‌’ అని సగౌరవంగా పిలిచేవారు.


========================================
Visit my website - > Dr.seshagirirao.com

సర్‌ సి.వి.రామన్‌ , Sir C V Raman




సర్‌ సి.వి.రామన్‌ : తిరుచురాపల్లి సమీపంలో తేది: 07-11-1888వ సంవత్సరంలో జన్మించారు. విశాఖపట్నంలో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తిచేశారు. ఎమ్మే చదివి ఫైనాన్స్‌ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగం చేశారు. 1907లో ఉద్యోగరీత్యా కలకత్తాకు బదిలీ అయ్యారు. అక్కడ ఇండియన్‌ సైన్స్‌ అసోసియేషన్‌కు రోజూ వెళ్ళి పరిశోధనలు చేసుకునేవారు. రామన్‌ ఆసక్తిని గమనించిన కలకత్తా విశ్వవిద్యాలయం ఉపకులపతి అశుతోష్‌ ముఖర్జీ బ్రిటీష్‌ ప్రభుత్వానికి లేఖ రాస్తూ... రామన్‌ సైన్స్‌ పరిశోధనలను పూర్తి కాలానికి వినియోగించుకుంటే బాగుంటుం దని సూచించారు. కానీ, బ్రిటీష్‌ ప్రభుత్వం

అంగీకరించలేదు. ఉద్యోగానికి రాజీనామా చేసి పరిశోధనలు కొనసాగించాడు. రామన్‌ ఎఫెక్ట్‌ను కనిపెట్టాడు. 28-02-1828న తన పరిశోధనా ఫలితాన్ని ధృవపరచుకున్నాడు. ఈ అంశం పై నేచర్‌ పత్రికలో ఆయన ప్రచురించిన వ్యాసాలను చూసి ప్రపంచం ఆశ్చర్యపడింది. 1930 డిసెంబర్‌లో రామన్‌ కు నోబెల్‌ బహుమతి ప్రకటింపబడింది. వీరికి భారతరత్న (1954) బహుకరింపబడింది. ఆయన పరిశోధన ఫలితాన్ని ధృవపరిచిన రోజును (ఫిబ్రవరి 28) నేషనల్‌ సైన్స్‌ డే గా జరుపుకుంటున్నారు.

For some more information -> C.V.Raman (India)

========================================
Visit my website - > Dr.seshagirirao.com

Friday, November 19, 2010

Acharya Vinoba Bhave,ఆచార్య వినోబా భావే




ఆచార్య వినోబా భావే గా ప్రసిద్ధి చెందిన వినాయక్ నరహరి భావే (సెప్టెంబర్ 11, 1895 - నవంబర్ 15, 1982) స్వాతంత్ర్యసమరయోధుడు, గాంధేయవాది, మహాత్మా గాంధీ యొక్క ఆధ్యాత్మిక వారసుడు.

వినోబా, మహారాష్ట్రలోని గగోదేలో 1895, సెప్టెంబర్ 11న ఒక సాంప్రదాయ చిత్‌పవన్ బ్రాహ్మణ కుటుంబములో జన్మించాడు. బాల్యములో ఈయన భగవద్గీత చదివి స్ఫూర్తి పొందాడు.

ఈయన మహాత్మా గాంధీతో పాటు భారత స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొని, బ్రిటీషు ప్రభుత్వానికి వ్యతిరేకముగా చేసిన పోరాటానికి గాను 1932లో జైలు కెళ్ళాడు. జైల్లో సహ ఖైదీలకు, తన మాతృభాషైన మరాఠీలో భగవద్గీతపై కొన్ని ఉపన్యాసాలిచ్చాడు. అత్యంత స్ఫూర్తిదాయకమైన ఈ ఉపన్యాసాలే ఆ తరువాత టాక్స్ ఆన్ ది గీత అన్న పుస్తకంగా వెలువడ్డాయి. ఈ పుస్తకము దేశవిదేశాల్లో అనేక భాషల్లోకి అనువదించబడింది. వినోభా ఈ ఉపన్యాసాలకు ప్రేరణ మానవాతీతమైనదని, తన ఇతర రచనలు సమసిపోయినా ఈ ఉపన్యాసాల ప్రభావం మాత్రం ఎప్పటికీ ఉండిపోతుందని నమ్మాడు.

for some more details ->ఆచార్య వినోబా భావే

========================================
Visit my website - > Dr.seshagirirao.com

డా వి.శాంతారామ్‌ సినీ దర్శకుడు , Dr.V.Shantaram film director



డా వి.శాంతారామ్‌ జయంతి: మహారాష్టల్రోని కొల్హాపూర్‌కు సమీప గ్రామంలో తేదీ-18-11-1901వ సంవత్సరంలో జన్మించారు శాంతారామ్‌. 1921లో నటుడిగా చిత్రరంగప్రవేశం చేసిన ఆయన మూకీ, టాకీలు అన్నీ కలిపి 25 చిత్రాల్లో నటించారు. సుమారు 90 సినిమాలు నిర్మించారు. వీటిలో 55 సినిమాలకు స్వయంగా ఆయనే దర్శకత్వం కూడా వహించారు. కళాత్మక, వ్యాపార దృక్పథాలను మేళవించిన విలక్షణ దర్శకునిగా పేరుగాంచారు. అమరజ్యోతి, ఆద్మీ, దునియా న మానే, పడోసీ, స్ర్తీ, అమర్‌ భూపాలీ, డా కోట్నిస్‌ కీ అమర్‌ కహానీ మొ సినిమాలు శాంతారామ్‌ దర్శకత్వంలో వచ్చిన కొన్ని ఆణిముత్యాలు. నవరంగ్‌, గీత్‌ గాయా పత్థరోంనే, ఝనక్‌ ఝనక్‌ పాయల్‌ బాజే మొ చిత్రాల్లో కళాకారుడి అంతరంగాన్ని, ఆవేదనను ఆవిష్కరించారు. ‘శాంతారామ’ అనే పేరుతో తన ఆత్మకథను రాసుకున్నారు. చిత్రపరిశ్రమకు ఆయన చేసిన సేవలను గుర్తిస్తూ... 1985లో కేంద్ర ప్రభుత్వం ‘దాదాసాహెబ్‌ ఫాల్కే’ అవార్డును బహూకరించింది. అంతేకాక నాగపూర్‌ విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్‌ పొందిన ఆయన అక్టోబర్‌ 18, 1990వ సంవత్సరంలో మరణించారు

========================================
Visit my website - > Dr.seshagirirao.com

ఉస్తాద్‌ బిస్మిల్లాఖాన్ , Ustad Bismillah khan



ఉస్తాద్‌ బిస్మిల్లాఖాన్‌ జయంతి: నవంబర్‌ 16, 1916వ సంవత్సరంలో బీహార్‌లోని ఓ కుగ్రామంలో జన్మించారు బిస్మిల్లాఖాన్‌. అసలు పేరు అమీరుద్దీన్‌ ఖాన్‌. బెనారస్‌లో స్థిరపడ్డ ఈయన భారతీయ సంగీత సంప్రదాయానికి అంతర్జాతీయ ఖ్యాతినార్జించిపెట్టారు. షెహనాయ్‌ వాద్యానికి ప్రపంచంలో గొప్ప స్థానాన్ని కల్పించారు. పూరీ జగన్నాథాలయంలో, కాశీ విశ్వేశ్వరాలయంలో కచేరీలు నిర్వహించి సర్వమత సమభావనను చాటిచెప్పారు. పద్మశ్రీ, పద్మ భూషణ్‌, పద్మ విభూషణ్‌, భారతరత్న వంటి అత్యున్నత పౌరపుర స్కారాలతో పాటు అనేక అవార్డులను అందుకున్నారు.

పూర్తి వివరాలకోసం -- వికీపిడియాలో చూడండి .....ఉస్తాద్‌ బిస్మిల్లాఖాన్ (Ustad Bismillah khan)
  • ========================================
Visit my website - > Dr.seshagirirao.com