Thursday, September 1, 2011

Kalpana chavla , కల్పనా చావ్లా


  • https://6772741428248755133-a-1802744773732722657-s-sites.googlegroups.com/site/seshagirirao2006/home/kalpana-chavla/Kalpana%20chavla-img.jpg?attachauth=ANoY7coT4BZ_gk53JR5AYUv4SIejdwCKwCpu3GuUcokcmqBRaGGCTzgNJRVcCFJLmNkX14XZbx83h3PD0CkPEUjQk8GqPBiAM2PZW7soeLkpsfFKWhQfXWXkTA9mdoR2yl8_hOsjUgVgUlBe3V-2eBDgDUAVqG9g7qvkkfX6eW-wHTXdtpw3w-_Z6fHliFXlh45iXMasrN_iYlqOxmtZbAWFWiEfW5sAiqQ2F8vb0v2M1GpYTqcSVJztS9SG847q8VazUM2QeZ7t&attredirects=0


మానవులు పుడతారు ... చనిపోతారు . కొంతమంది మాత్రమే తమ జీవితం లో ప్రజలకు ఉపయోగపడే సేవాకార్యక్రమాలు చేసి తమ జీవితాన్నే ఫణం గా పెట్టి మానవ జాతిలో చిరస్థాయిగా తరతరాలుగా నిలిచిపోతారు ... వీరిని "మృతంజీవులు" అని అంటారు . కోటాను కోట్ల జనం లో బహు కొద్ది మంది మాత్రమే ఇలాంటివారు ఉంటారు . ప్రపంచము లో ప్రతి జాతి లోనూ ఈ తరహా మహానుభావులు పుట్టి తమ సేవలతో పుణీతులయ్యారు . తెలుగు జాతికి మణిపూసలైన కొందరి మహానుభావులను తెలుసుకునే ప్రయత్నం లో ఇక్కడ -Kalpana chavla , కల్పనా చావ్లా- గురించి తెలుసుకొని మన జీవితాన్ని చక్కని మార్గములో ప్రయాణించే ప్రయత్నం చేద్దాము ....

బనారసి చావ్లా, సనాజ్యోతి దంపతులకు 1961లో కర్నల్ జిల్లాలోని హర్యానాలో కల్పన జన్మించారు. చిన్నతనం నుంచి తనకు ఆదర్శంగా నిలిచిన వ్యక్తి ప్రముఖ పారిశ్రామిక వేత్త జె.ఆర్.డి. టాటా. ఆయనలా గాలిలో ఎగరాలని కలలు కనడం ప్రారంభింది. ఆమె ఆత్మవిశ్వాసమే ఆమె ఆశయ సాధనకు తోడ్పడింది. యువతకు మార్గదర్శిగా మిగిలింది.
కల్పన సంప్రదాయాలను గౌరవించినప్పటికీ మారుతున్న కాలానికి అనుగుణంగా పాతతరం ఆలోచనలకు స్వస్తి పలికింది. మొదటితరం వారసురాలుగా పంజాబ్ ఇంజినీరింగ్ కాలేజీలో తనకు ఇష్టమైన తన చిన్ననాటి కలకు రెక్కలు తొడగాలని ‘ఏరోనాటికల్ ఇంజినీరింగ్’లో చేరిన తొలి మహిళ. కల్పన కట్టుబాట్లు తెంచుకొని ముందడుగు వేయడం తల్లిదండ్రులకు ఏ మాత్రం రుచించలేదు. పిల్లలచేత మనస్సులో నాటుకున్న ఆలోచనలకు అనుగుణంగా పెద్దలు చేయూత అందించాలని కల్పన భావించేది. తల్లిదండ్రులు ఆగ్రహించినప్పటికి తన కోసం ఎదురుచూస్తున్న ఉన్నతశిఖరాలను అధిరోహించాలని ఉన్నత చదువుల కోసం అమెరికా ప్రయాణమైంది. టెక్సాస్, బౌల్డర్, కొలరాడో విశ్వవిద్యాలయాలలో అభ్యసించి డాక్టర్ పట్టాను అందుకుంది.
ఆమె తన విద్యాభ్యాసం అనంతరం ‘నాసా ఎమ్స్ పరిశోధన కేంద్రం’లో పని చేయడం ప్రారంభించింది. తనకు అమెరికా పౌరసత్వం లభించడంతో తనతోటి సహచరుడు, ఫ్లయింగ్ ఇన్‌స్ట్రక్టర్ జీన్ పైరీ హరిసన్‌ను వివాహం చేసుకున్నారు. విమానాలు నడపటంలో శిక్షణ పొంది, వ్యోమగామిగా మారడానికి మార్గం సుగమం చేసుకొన్నారు.

For more details -> Kalpana Chavla
  • ========================================

Visit my website - > Dr.seshagirirao.com/

No comments:

Post a Comment

Thanks for your comment & feedback.