Friday, September 23, 2011

చంద్రశేఖర్ ఆజాద్,చంద్రశేఖర్ సీతారాం తివారీ ,ChandraSekhar Azad



మానవులు పుడతారు ... చనిపోతారు . కొంతమంది మాత్రమే తమ జీవితం లో ప్రజలకు ఉపయోగపడే సేవాకార్యక్రమాలు చేసి తమ జీవితాన్నే ఫణం గా పెట్టి మానవ జాతిలో చిరస్థాయిగా తరతరాలుగా నిలిచిపోతారు ... వీరిని "మృతంజీవులు" అని అంటారు . కోటాను కోట్ల జనం లో బహు కొద్ది మంది మాత్రమే ఇలాంటివారు ఉంటారు . ప్రపంచము లో ప్రతి జాతి లోనూ ఈ తరహా మహానుభావులు పుట్టి తమ సేవలతో పుణీతులయ్యారు . తెలుగు జాతికి మణిపూసలైన కొందరి మహానుభావులను తెలుసుకునే ప్రయత్నం లో ఇక్కడ -చంద్రశేఖర్ ఆజాద్(చంద్రశేఖర్ సీతారాం తివారీ ,ChandraSekhar Azad)- గురించి తెలుసుకొని మన జీవితాన్ని చక్కని మార్గములో ప్రయాణించే ప్రయత్నం చేద్దాము ....


చంద్రశేఖర్ సీతారాం తివారీ (చంద్రశేఖర్ ఆజాద్) జూలై 23, 1906 బాదర్కా, ఉన్నాఒ జిల్లా, ఉత్తరప్రదేశ్ లో జన్మించారు . ఈయన భారతీయ ఉద్యమకారుడు,స్వాతంత్య్ర సమర యోధుడు - చంద్రశేఖర్‌ అజాద్. భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్, పండిత్ రామ్ ప్రసాద్ బిస్మిల్, ఠాకూర్ రోషన్ సింగ్, ప్రేమ్ కిషన్ ఖన్నా మరియు అష్ఫాకుల్లా ఖాన్ ల సహచరుడు. దేశం గర్వించదగ్గ ఉద్యమకారుల్లో ఒకడు...చంద్రశేఖర్ అజాద్.కా.షహీద్ భగత్ సింగ్ కు ముఖ్య అనుచరుడిగా, హిందూస్తాన్ సోషలిస్టు రిపబ్లికన్ అసోసియేషన్ నిర్మాతగా, త్రువు చేత చిక్కక తనను తాను ఆత్మాహుతి చేసుకున్న అమరవీరునిగా భారత ప్రజల గుండెల్లో చిరస్మరణీయుడైన కా.చంద్రశేఖర్ అజాద్ ను మరొకమారు గుర్తుచేసుకొని ఆయన ఆశయాల సాధనలో భాగమవుదాం .

సీతారాం తివారీ, జగరాణి దేవీల ఐదో సంతానంగా జన్మించిన చంద్రశేఖర్‌ అజాద్‌ పేదరికంలో పుట్టినప్పటికీ విద్యార్థి దశ నుంచి ధైర్యసాహసాలు చూపేవారు. ప్రజల నుంచి మహాత్మాగాంధీ వరకు నీరాజనాలు అందుకుంటున్న రోజులవి. 1921లో గాంధీ విదేశీ వస్తు బహిష్కరణకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. చంద్రశేఖర్‌ కూడా జనంతో కలిసి వందేమాతరం విప్లవం వర్ధిల్లాలి అంటూ నినాదాల చేస్తుంటే పోలీసులు కొట్టారు. ఇది సహించలేక రాయిని గురి చూసి పోలీసులను కొట్టి అదృశ్యమయ్యాడు. బ్రిటిష్ దురాక్రమణకు వ్యతిరేకంగా 1857లో స్వాతంత్ర సమరజ్వాలలు ఎగసిపడినాయ. భారతదేశానికి 1947లో స్వాతంత్య్రం సిద్ధించేవరకూ గడచిన 90 ఏళ్లలో దేశ స్వాతంత్య్రం కోసం అనేక ఉద్యమాలు సాగాయి. పంజాబ్‌లో రామసింగ్ కూకా (నాంధారీ ఉద్యమం), మహారాష్టల్రో వాసుదేవ బల్వంత్‌ఫడ్‌కే, ఛపేకర్ సోదరులు, భగత్‌సింగ్, యస్ఫతుల్లాఖాన్, రాజగురు, రాంప్రసాద్, బిస్మిల్, భగవతీచరణ్, అల్లూరి సీతారామరాజు, కుమరంభీం, చంద్రశేఖర్ అజాద్.. ఇంకా అనేకమంది వీరుల బలిదానాలు కొనసాగాయి. 1906 జూలై 23న మధ్యప్రదేశ్‌లోని బావరా గ్రామంలో జగరాణిదేవి, సీతారాం తివారీల కడుపుపంటగా చంద్రశేఖర్ తివారీ జన్మించాడు. ఆయనే చంద్రశేఖర్ అజాద్. 24 ఏళ్ల ప్రాయంలో స్వాతంత్య్ర సమర యజ్ఞంలో ఆహుతయ్యేవరకూ అనితర సాధ్యమైన ధైర్య సాహసాలతో పోరాటం సాగించి చిరస్మరణీయుడైనాడు ఆజాద్.15 ఏళ్లు కూడా నిండని అతి పిన్న వయసులోనే దేశ స్వాతంత్య్రం కోసం సర్వ సమర్పణకు సంసిద్ధమైనవాడు చంద్రశేఖర్ అజాద్.

కోర్టులో

తనను విచారిస్తున్న బ్రిటిష్ న్యాయాధికారి ఖరేఘాట్‌కు ఆ బాలుడిచ్చిన సమాధానంతో మతిపోయింది-
‘‘నీ పేరేమిటి?’’ ‘‘ నా పేరు అజాద్,’’ ‘‘ తండ్రి పేరు’’ ‘‘స్వాధీన్,’’ ‘‘నీ ఇల్లెక్కడ’’ - ‘‘కారాగృహం.’’
ప్రశాంతంగా సమాధానం చెప్తున్నాడు ఆ బాలుడు. కోర్టులో సందర్శకులనుంచి ‘్భరత్ మాతాకీ జై’ నినాదం పిక్కటిల్లింది. మతిపోయిన ఆ న్యాయాధికారి చిదిమితే పాలుగారే ముఖవర్చస్సుకల ఆ బాలుడిని చూస్తూ కూడా అధికార దర్పంతో ‘16 కొరడాల దెబ్బలు’ అంటూ శిక్ష ప్రకటించాడు.నరరూప రాక్షసులు కొరడా ఝళిపిస్తూ ఒక్కొక్క దెబ్బ కొడుతుంటే.. ఆ బాలుని శరీరమంతా కూడా రక్తసిక్తమైపోయింది. అయినా ఆ బాలుడు దెబ్బ పడినపుడు వందేమాతరం, భారత్‌మాతాకీ జై అంటున్నాడు. ఆనాడు కాశీ ప్రజలు ఆ బాలుని ‘అజాద్’ అని పిలిచారు. అదే అతడి సార్ధక నామధేయం అయింది. శిక్షానంతరం , సేద తీర్చుకోమని (ఇది మరో అవమానం!) మూడు అణాలు ఇవ్వడం రివాజు. ఆ మూడు అణాలు విసిరి వారి ముఖాన కొట్టాడు అజాద్. బ్రిటిష్ పాఠశాల చదువు ఇష్టంలేని అజాద్ కాశీలో సంస్కృత విద్యాలయంలో చేరాడు.

ఆరోజుల్లోనే విప్లవ వీరుడు రాంప్రసాద్ బిస్మిల్‌తో పరిచయం ఏర్పడింది. అజాద్ జీవితంలో అదో పెద్ద మలుపు. బిస్మిల్ అడుగుజాడల్లో విప్లవ శంఖం పూరించాడు. ఉద్యమానికి కావలసిన డబ్బు సమకూర్చుకోవడం, బ్రిటిష్ ప్రభుత్వాన్ని పారద్రోలడానికి తిరుగుబాటే మార్గం అవుతుందని సంకేతాలు ప్రజలకు అందించడం- ఆశయంగా పెట్టుకుని 1925లో జరిగిన కాకోరి రైలు దోపిడీలో పాల్గొన్నాడు. ఈ కేసులో బ్రిటిష్ ప్రభుత్వం రాంప్రసాద్ బిస్మిల్‌తో సహా యస్ఫతుల్లాఖాన్, రాజేంద్ర లాహిరి, ఠాకూర్ రోషన్‌సింగ్‌లను, బూటకపు విచారణ జరిపి ఉరితీసింది. మన్మధ దాస్‌గుప్తా, జోగీంద్ర చటర్జీ, ముకుందలాల్, రామకృష్ణ ఖత్రలకు పది పద్నాలుగు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది. అజాద్ మాత్రం తప్పించుకున్నాడు. ఆ తర్వాత అజాద్ మారువేషాలలో అనేక ఊళ్లు తిరిగాడు. వివిధ విప్లవ సంస్థలతో సంపర్కం పెట్టుకున్నాడు. తదుపరి ఫిరోజ్‌షా కోట్లలో భగత్‌సింగ్, భగవతీచరణ్, శివశర్మ, మరికొందరు విప్లవ వీరులతో కలిసి 1928 సెప్టెంబర్ 8న ‘హిందుస్తాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ ఆర్మి’ స్థాపించడం జరిగింది. 1928లో సైమన్ కమిషన్‌కు వ్యతిరేకంగా అనేక నిరసన ప్రదర్శనలు జరిగాయి. 1929లో లాహోర్‌లో జరిగిన ఈ నిరసన ప్రదర్శనలో పాల్గొన్న 64 ఏళ్ల వృద్ధుడు లాలా లజపతిరాయ్‌పై సాండర్స్ అనే బ్రిటిష్ అధికారి పాశవికంగా లాఠీచార్జి జరిపాడు. ఆ దెబ్బలకు తట్టుకోలేక పంజాబ్ కేసరి నేలకొరిగాడు. విప్లవ వీరులు చూస్తూ ఊరుకోలేదు. ఆ తర్వాత కొద్దిరోజులకే ఆగ్రహంతో రగిలిపోతూ సాండర్స్‌ను హతమార్చారు. 1929 జూలై 10న సాండర్స్ హత్యకేసు విచారణ ప్రారంభమైంది. ప్రభుత్వం 32మందిపై నేరం మోపింది. ఆ బూటకపు విచారణానంతరం అజాద్‌తోసహా తొమ్మిదిమందిని పరారీలో వున్నారని ప్రకటించింది. 1931 ఫిబ్రవరి 27 ఉదయం సుఖదేవ్ రాజ్‌తో ఒక ముఖ్య విషయం మాట్లాడుతూ ఆల్‌ఫ్రెడ్ పార్క్‌లో ఓ చెట్టుకింద అజాద్ కూర్చుని ఉన్నాడన్న సంగతి డబ్బుకు గడ్డితిన్న ఓ యువకుడు ఉప్పందించాడు. నాలుగు వ్యాన్‌లలో పోలీసులను ఎక్కించుకుని పోలీసు అధికారులు లార్ట్‌బావర్, విశే్వశ్వర సిన్నాహలు ఆల్‌ఫ్రెడ్ పార్క్‌కు చేరారు. ఒక శక్తివంతమైన బుల్లెట్ అజాద్ తొడ నుండి దూసుకుపోయింది. అయినా, బాధను లెక్కచేయక అజాద్ తన రివాల్వర్‌తో లార్ట్ బావర్‌ను కాల్చాడు. విశే్వశ్వర సిన్హా కాల్పులు జరుపుతుండగా అజాద్ కుడిచేతికి గాయమైంది. వెంటనే పిస్తోల్ ఎడమ చేతికి మారింది. అక్కడ మోహరించి వున్న పోలీసు బలగాలు గుళ్ల వర్షం కురిపిస్తుండగా అజాద్ తన రివాల్వర్‌తో శత్రువులను చెండాడుతూ పోరాటం సాగిస్తున్నాడు. చివరకు రివాల్వర్‌లో ఒక గుండు మాత్రమే మిగిలింది. సుఖదేవ్ రాజ్ సురక్షితంగా అక్కడ నుంచి తప్పించుకు పోయేందుకు సహకరించాడు. ‘నా చావు నా చేతుల్లోనే ఉంది, శత్రువుల చేతుల్లో చావను’ అంటూ చిన్ననాడు చేసిన శపథం నిజంచేస్తూ పిస్తోలు తన కణతకు గురిపెట్టి పేల్చుకున్నాడు. అజాద్ పోరాడిన తీరు భారతదేశ విప్లవ చరిత్రకే వనె్న తెచ్చిన ఘటన. భారతీయ యువత ముందు నిలిచిన ఒక మహోజ్జ్వల ఉదాహరణ.

  • జన్మస్థలం: బాదర్కా, ఉన్నాఒ జిల్లా, ఉత్తరప్రదేశ్, భారతదేశం,
  • నిర్యాణ స్థలం: అలహాబాదు, ఉత్తరప్రదేశ్, భారతదేశం,
  • ఉద్యమము: భారత జాతీయ ఉద్యమం,
  • ప్రధాన సంస్థలు: నౌజవాన్ భారత్ సభ, కీర్తి కిసాన్ పార్టీ మరియు హిందుస్తాన్ సోషియలిస్టు రిపబ్లికన్ అసోసియేషన్,
  • మరణము – ఫిబ్రవరి 27, 1931, అలహాబాదు, ఉత్తరప్రదేశ్
  • ========================================

Visit my website - > Dr.seshagirirao.com/

No comments:

Post a Comment

Thanks for your comment & feedback.