Wednesday, September 21, 2011

గోపాలక్రిష్ణ గోఖలే ,Gopal Krishna Gokhale



మానవులు పుడతారు ... చనిపోతారు . కొంతమంది మాత్రమే తమ జీవితం లో ప్రజలకు ఉపయోగపడే సేవాకార్యక్రమాలు చేసి తమ జీవితాన్నే ఫణం గా పెట్టి మానవ జాతిలో చిరస్థాయిగా తరతరాలుగా నిలిచిపోతారు ... వీరిని "మృతంజీవులు" అని అంటారు . కోటాను కోట్ల జనం లో బహు కొద్ది మంది మాత్రమే ఇలాంటివారు ఉంటారు . ప్రపంచము లో ప్రతి జాతి లోనూ ఈ తరహా మహానుభావులు పుట్టి తమ సేవలతో పుణీతులయ్యారు . తెలుగు జాతికి మణిపూసలైన కొందరి మహానుభావులను తెలుసుకునే ప్రయత్నం లో ఇక్కడ -గోపాలక్రిష్ణ గోఖలే - గురించి తెలుసుకొని మన జీవితాన్ని చక్కని మార్గములో ప్రయాణించే ప్రయత్నం చేద్దాము ....


గోపాల కృష్ణ గోఖలే మే 9, 1866 సంవత్సరంలో బాంబే ప్రెసిడెన్సీ (ప్రస్తుత మహారాష్ట్ర) లోని కొతాలుక్ లో జన్మించాడు. వారిది పేద బ్రాహ్మణుల కుటుంబం. కానీ ఆయన తల్లిదండ్రులు ఆయనకు ఆంగ్ల మాధ్యమంలోనే విద్యను ఏర్పాటు చేశారు. ఆ విద్యతో బ్రిటీష్ ప్రభుత్వంలో ఏదైనా గుమాస్తాగానో , చిరుద్యోగిగానే స్థిరపడతాడని వారి ఆలోచన. కళాశాల విద్యనభ్యసించిన మొదటి తరం భారతీయుల్లో గోఘలే ప్రముఖుడు. 1884లో ఎఫిన్‌స్టోన్ కళాశాల నుంచి విద్యను పూర్తి చేశాడు. ఆంగ్ల మాధ్యమంలో విద్యనభ్యసించడం వలన ఆయన ఆంగ్లంలో నిష్ణాతుడవడమే మాకుండా పాశ్చాత్య రాజకీయాలను అవగాహన చేసుకున్నాడు. పాశ్చాత్య తత్వ శాస్త్రాన్నీ ఆకళింపు చేసుకున్నాడు. జాన్ స్టువార్ట్ మిల్, ఎడ్మండ్ బర్క్ లాంటి తత్వవేత్తల భావనలను అమితంగా అభిమానించేవాడు.

For more details see Wikipedia - Gopalakrishna Gokhale
  • ========================================

Visit my website - > Dr.seshagirirao.com/

No comments:

Post a Comment

Thanks for your comment & feedback.