Monday, September 19, 2011

Jwala Gutta , జ్వాలా గుత్తా



మానవులు పుడతారు ... చనిపోతారు . కొంతమంది మాత్రమే తమ జీవితం లో ప్రజలకు ఉపయోగపడే సేవాకార్యక్రమాలు చేసి తమ జీవితాన్నే ఫణం గా పెట్టి మానవ జాతిలో చిరస్థాయిగా తరతరాలుగా నిలిచిపోతారు ... వీరిని "మృతంజీవులు" అని అంటారు . కోటాను కోట్ల జనం లో బహు కొద్ది మంది మాత్రమే ఇలాంటివారు ఉంటారు . ప్రపంచము లో ప్రతి జాతి లోనూ ఈ తరహా మహానుభావులు పుట్టి తమ సేవలతో పుణీతులయ్యారు . తెలుగు జాతికి మణిపూసలైన కొందరి మహానుభావులను తెలుసుకునే ప్రయత్నం లో ఇక్కడ -Jwala Gutta , జ్వాలా గుత్తా
- గురించి తెలుసుకొని మన జీవితాన్ని చక్కని మార్గములో ప్రయాణించే ప్రయత్నం చేద్దాము ....

గుత్తా జ్వాల ప్రముఖ బాడ్మింటన్ క్రీడాకారిణి. 2010 వరకు పదమూడు సార్లు జాతీయ బాడ్మింటన్ ఛాంపియన్. కేంద్ర ప్రభుత్వము ఆగస్ట్ 18, 2011 న జ్వాలకు అర్జున అవార్డు ప్రకటించింది. క్రాంతి, ఎలెన్ దంపతుల పెద్ద కుమార్తె జ్వాల. హైదరాబాద్ వచ్చే నాటికి ఆమెకు అయిదేళ్లు. బ్యాట్ చేతబట్టిందీ అప్పటినుంచే. చదువు, బ్యాడ్మింటన్ సాధనతో పెరిగిన జ్వాల క్రమంగా జాతీయస్థాయికి ఎదిగారు. సింగిల్స్‌తోపాటు డబుల్స్, మిక్స్‌డ్ డబుల్స్‌లోనూ ఆడడం జ్వాల ప్రత్యేకత!. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో డబుల్స్‌లో కాంస్యం గెలుచుకున్న జ్వాల, కామన్వెల్త్ పోటీల్లో అదే విభాగంలో విన్నర్‌గా నిలిచారు.

జ్వాల సెప్టెంబర్ 7, 1983న మహారాష్ట్ర లోని వార్ధాలో తెలుగు తండ్రి గుత్తా క్రాంతి, చైనా తల్లి ఎలెన్‌ కి జన్మించింది. తాత చెంగ్ వార్ధాలోని సేవాగ్రాం ఆశ్రమములో మహాత్మా గాంధీ శిష్యుడు. గాంధీ ఆత్మకథ, రచనలను ఛైనా భాషలోనికి అనువదించాడు. భట్టిప్రోలు మండలం గుత్తావారిపాలెం జ్వాల పెద్దల స్వస్థలం. జ్వాల తాతయ్య గుత్తా సుబ్రహ్మణ్యం అభ్యుదయవాది, స్వాతంత్య్రయోధుడు. ఏడుగురు అన్నదమ్ముల్లో పెద్దవాడు సుబ్రహ్మణ్యం. చిన్నతనంలోనే సోదరులతో కలిసి వందేమాతరం నినాదాన్ని అందుకున్నారు. ఆగ్రహించిన నాటి బ్రిటిష్ పాలకులు ఈ కుటుంబాన్నీ, వీరి బంధుగణాన్నీ అరెస్టుచేసి జైలుకు పంపారు. ఉద్యమబాటలో వీరి ఆస్తులు కరిగిపోయాయి. సుబ్రహ్మణ్యం పెదనాన్న, పెద్దమ్మ జైల్లోనే ప్రాణాలు విడిచారు. బయటపడ్డాక అప్పులతో కాలం గడుపుతుండగానే వారు కోరుకున్న స్వేచ్ఛాభారతం సిద్ధించింది. మిగిలిన కొద్దిపాటి ఆస్తులు అమ్ముకుని ఏడుగురు అన్నదమ్ముల కుటుంబాలు వలసబాట పట్టాయి. తమిళనాడుకు వెళ్లి పుష్పగిరి గ్రామంలో వ్యవసాయం ఆరంభించి పూలతోటలు సాగుచేశారు. సుబ్రహ్మణ్యం దంపతులకు అరుగురు సంతానం. అందులో క్రాంతి ఒకరు. ఈ కుటుంబానికి మహారాష్ట్రలోని సేవాగ్రామ్‌తో అనుబంధం ఏర్పడింది. మకాం అటు మార్చారు. గాంధీజీ బేసిక్ స్కూలును ఆరంభించారు. తర్వాత నెల్లూరు జిల్లా వాకాడు చేరారు. ఆ క్రమంలో వాకాడు, హైదరాబాద్‌లో ప్రాథమిక విద్య, ఇంటర్మీడియెట్ చదివిన క్రాంతి మహారాష్ట్ర వెళ్లి డిగ్రీ, కెమిస్ట్రీలో పీజీ చేశారు. అప్పుడే సేవాగ్రామ్ వచ్చిన చైనా యువతి ఎలెన్‌తో పరిచయం ప్రేమగా మారింది. వివాహబంధం ముడిపడ్డాక ఆమెకు భారత పౌరసత్వం వచ్చింది. ఆర్‌బీఐ ఉద్యోగిగా మహారాష్ట్రలో అయిదేళ్లు పనిచేసిన క్రాంతి, 1988లో బదిలీపై హైదరాబాద్ చేరుకున్నారు.
  • ========================================

Visit my website - > Dr.seshagirirao.com/

No comments:

Post a Comment

Thanks for your comment & feedback.