సి.పి.బ్రౌన్ : 10-11-1798వ సంవత్సరంలో కలకత్తా నగరంలో జన్మించారు చార్లెస్ ఫిలిప్ బ్రౌన్. కలెక్టర్‌కు అసిస్టెంట్‌గా 1820లో కడప చేరుకున్నారు. ఉద్యోగబాధ్యతలు నిర్వహిస్తూనే... తెలుగు సాహిత్యసేవ చేశారు. మహాభారతం శుద్ధ ప్రతి తయారీకి 2000 రూపాయలకు పైగా ఖర్చు చేశారు. అప్పటికి ఆయన నెల జీతం 500 మత్రమే. 60 వేల అప్పు తెచ్చి వేలాది తెలుగు గ్రంథాలను సేకరించి పండితులచేత పరిష్కరణలు చేయించి అచ్చుకు ప్రతులను సిద్ధం చేయించాడు. వేమన పద్యాలను ఆంగ్లంలోకి అనువదించాడు. నిఘంటువులను కూర్చాడు. 36 ఏళ్ళు మనదేశంలో ఉద్యోగం చేసి చివరి దశలో లండన్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా పనిచేశాడు.
- ========================================
No comments:
Post a Comment
Thanks for your comment & feedback.