బిపిన్ చంద్రపాల్ : 07-11-1858వ సంవత్సరంలో నాటి బెంగాల్‌లోని (నేటి బంగ్లాదేశ్) సిల్హట్‌లో జన్మించారు. బ్రహ్మసమాజంలో చేరి ఆ సిద్ధాంతాలను ప్రచారం చేశారు. ప్రజలను ఉత్తేజపరిచే ఉపన్యాసకుడిగా పేరొందారు. వందేమాతరం ఉద్యమ వ్యాప్తిలో భాగంగా రాజమండ్రిలో ఈయన ప్రసంగించిన ప్రాంతాన్ని ‘పాల్ చౌక్’ అని పిలుస్తున్నారు. మచిలీపట్నంలోని ఆంధ్ర జాతీయ కళాశాల ఈయన ఉపన్యాసాల ప్రభావంతోనే ఏర్పాటు చేయబడిందట. ట్రిబ్యూన్, న్యూ ఇండియా, వందేమాతరం మొదలైన పత్రికల్లో ఈయన రచనలు ఎన్నో ప్రచురింపబడినాయి. గాంధీజీతో విబేధించిన కారణంగా ఈయనకు తగిన గుర్తింపు రాలేదంటారు. ఆనాటి రాజకీయాల్లో ప్రధాన పాత్రధారులైన లాలా లజపతిరాయ్, బాలగంగాధర్ తిలక్, బిపిన్ చంద్రపాల్ అనే నాయక త్రయాన్ని ‘లాల్, బాల్, పాల్’ అని సగౌరవంగా పిలిచేవారు.
========================================
Visit my website - > Dr.seshagirirao.com


No comments:
Post a Comment
Thanks for your comment & feedback.