ఆచార్య వినోబా భావే గా ప్రసిద్ధి చెందిన వినాయక్ నరహరి భావే (సెప్టెంబర్ 11, 1895 - నవంబర్ 15, 1982) స్వాతంత్ర్యసమరయోధుడు, గాంధేయవాది, మహాత్మా గాంధీ యొక్క ఆధ్యాత్మిక వారసుడు.
వినోబా, మహారాష్ట్రలోని గగోదేలో 1895, సెప్టెంబర్ 11న ఒక సాంప్రదాయ చిత్‌పవన్ బ్రాహ్మణ కుటుంబములో జన్మించాడు. బాల్యములో ఈయన భగవద్గీత చదివి స్ఫూర్తి పొందాడు.
ఈయన మహాత్మా గాంధీతో పాటు భారత స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొని, బ్రిటీషు ప్రభుత్వానికి వ్యతిరేకముగా చేసిన పోరాటానికి గాను 1932లో జైలు కెళ్ళాడు. జైల్లో సహ ఖైదీలకు, తన మాతృభాషైన మరాఠీలో భగవద్గీతపై కొన్ని ఉపన్యాసాలిచ్చాడు. అత్యంత స్ఫూర్తిదాయకమైన ఈ ఉపన్యాసాలే ఆ తరువాత టాక్స్ ఆన్ ది గీత అన్న పుస్తకంగా వెలువడ్డాయి. ఈ పుస్తకము దేశవిదేశాల్లో అనేక భాషల్లోకి అనువదించబడింది. వినోభా ఈ ఉపన్యాసాలకు ప్రేరణ మానవాతీతమైనదని, తన ఇతర రచనలు సమసిపోయినా ఈ ఉపన్యాసాల ప్రభావం మాత్రం ఎప్పటికీ ఉండిపోతుందని నమ్మాడు.
for some more details ->ఆచార్య వినోబా భావే
========================================
Visit my website - > Dr.seshagirirao.com
No comments:
Post a Comment
Thanks for your comment & feedback.