మానవులు పుడతారు ... చనిపోతారు . కొంతమంది మాత్రమే తమ జీవితం లో ప్రజలకు ఉపయోగపడే సేవాకార్యక్రమాలు చేసి తమ జీవితాన్నే ఫణం గా పెట్టి మానవ జాతిలో చిరస్థాయిగా తరతరాలుగా నిలిచిపోతారు ... వీరిని "మృతంజీవులు" అని అంటారు . కోటాను కోట్ల జనం లో బహు కొద్ది మంది మాత్రమే ఇలాంటివారు ఉంటారు . ప్రపంచము లో ప్రతి జాతి లోనూ ఈ తరహా మహానుభావులు పుట్టి తమ సేవలతో పుణీతులయ్యారు . భారత జాతికి మణిపూసలైన కొందరి మహానుభావులను తెలుసుకునే ప్రయత్నం లో ఇక్కడ --Anoushka shankar ,అనౌష్క శంకర్ -- గురించి తెలుసుకొని మన జీవితాన్ని చక్కని మార్గములో ప్రయాణించే ప్రయత్నం చేద్దాము ....
ప్రపంచ ప్రఖ్యాత సితార్ కళాకారుడు పండిత్ రవి శంకర్ కుమార్తె అనౌష్క శంకర్. అనౌష్క శంకర్ సైతం సితార్ ప్లేయర్‌గా దేశ, విదేశాల్లో ఎన్నో ప్రదర్శనలిచ్చి మంచి పేరు తెచ్చుకున్నారు. ఆమె సింగర్ నోరా జోన్స్‌తో కలిసి గ్రామీ అవార్డును అందుకొని ఎంతో పాపులారిటీ సంపాదించారు. ఈ ప్రఖ్యాత కళాకారిణి కొందరు ప్రముఖులతో కలిసి పాన్ ఏషియన్ గర్ల్ బ్యాండ్‌ను రూపొందించేందుకు నడుం బిగించారు. ఈ బ్యాండ్‌లో చైనా, జపాన్, కొరియా, ఫిలిప్పీన్స్‌తో పాటు ఇండియా నుంచి ఒక్కొక్క పాప్ ఆర్టిస్ట్‌ను ఎంపికచేయనున్నారు.
గ్రామీ అవార్డు విజేత అనౌష్క శంకర్ 1981 జూన్ 9న జన్మించారు. ఆమె ప్రసిద్ధ సితార్ కళాకారుడు రవి శంకర్, బ్యాంక్ ఉద్యోగిని అయిన సుకన్యా రాజన్ దంపతులకు జన్మించారు. ఆమె లండన్‌లో జన్మిం చగా కొంతకాలం లండన్‌లో, మరికొంతకాలం ఢిల్లీలో ఆమె బాల్యం గడి చింది. టీనేజీ వయస్సులో ఆమె క్యాలిఫోర్నియాలో ఉంటూ సాన్ డిగిటో మ్యూజిక్ అకాడమీలో సంగీతంలో శిక్షణ పొందారు. తండ్రి లక్షణాలను పుణికిపుచ్చుకున్న అనౌష్కకు చిన్నతనం నుంచే సంగీతమంటే ప్రాణం. ఆమె తన తండ్రి పండిత్ రవిశంకర్ వద్ద సితార్ వాయించడాన్ని నేర్చుకు న్నారు. 13 సంవత్సరాల వయస్సులోనే ఆమె మ్యూజిక్ షోలను నిర్వహిం చడం విశేషం.
ఆ తర్వాత 16 సంవత్సరాల వయస్సులో మొదటి రికార్డు కాంట్రాక్ట్‌పై సంతకం చేశారు. 1998లో విడుదలైన తన మొదటి మ్యూ జిక్ ఆల్బమ్ అనౌష్కతో ఆమె ఎంతో పాపులారిటీ సంపాదించారు. అనంతరం 2000 సంవత్సరం ఫిబ్రవరిలో కోల్‌కతాలోని రామకృష్ణ సెంటర్‌లో సంగీత ప్రదర్శనిచ్చిన మొదటి మహిళగా పేరు తెచ్చుకున్నారు. నేడు సంగీత ప్రపంచంలో సితార్ వాయిద్యకారిణిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు అనౌష్క. తండ్రి సంగీత వారసత్వాన్ని పుణికిపుచ్చు కొని సంగీతకారిణిగా పేరుతెచ్చుకున్నారు.
పాప్ మ్యూజిక్‌తో ఒకప్పుడు యూత్‌ను ఉర్రూతలూగించారు సై్పస్ గర్ల్‌స. అనంతరం కొంతకాలానికి విడిపోయిన ఈ గర్ల్‌స బ్యాండ్ తన సాంగ్స్‌తో ఎంతో పాపులారిటీ తెచ్చుకుంది. ఈ బ్యాండ్ ఏర్పాటుకు కృషిచేసిన కొందరు ప్రముఖులతో కలిసి ప్రఖ్యాత సితార్ కళాకారిణి అనౌష్క శంకర్ పాన్ ఏషియన్ గర్ల్ బ్యాండ్ ఏర్పాటుకు కృషిచేస్తుండడం విశేషం. ఆసియా ఖండంలోని ఇండియాతో పాటు చైనా, జపాన్, కొరియా, ఫిలిప్పీన్స్‌ల నుంచి ఒక్కొక్క పాప్ ఆర్టిస్ట్‌ను వారు ఎంపికచేయనున్నారు. ఇక ఇండియా నుంచి టాలెంట్ ఉన్న పాప్ ఆర్టిస్ట్‌ను ఎంపిక చేసే బాధ్యతను అనౌష్క శంకర్‌కు చెందిన సంస్థ ఆల్‌కెమిస్ట్ టాలెంట్ సొల్యూషన్ తీసుకుంది.
16 సంవత్స రాల నుంచి తాను సితార్ ఆర్టిస్ట్‌గా దేశ, విదేశాల్లో సంగీత ప్రదర్శనలిస్తున్నాననీ కానీ తనకు ఎక్కడా పాప్ మ్యూజిక్ రంగంలో పాపులారిటీ సంపాదించుకున్న ఇండియన్ గర్ల్ కనిపించలేంచలేదని అనౌష్క అన్నారు. దీంతో తాను కొందరు ప్రముఖులు కలిసి ఏర్పాటు చేస్తున్న పాన్ ఏషియన్ గర్ల్ బ్యాండ్ ఏర్పాటులో భాగంగా ఇండియా నుంచి పాపులర్ సింగర్‌ను తాను ఎంపికచేయనున్నట్టు చెప్పారు. ఈ బ్యాండ్‌లో సింగర్‌గా ఇండియన్ గర్ల్ ప్రపంచ వ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకునే అవకాశం ఉందని తెలిపారు. ఇండియన్ ఆర్టిస్ట్‌లను ప్రోత్సహించడమే తమ లక్ష్యమన్నారు.
దేశం గర్వించదగ్గ సితార్ విద్వాంసుడు మా నాన్న. అయినా నాకూ వేధింపులు తప్పలేదు. చిన్నప్పుడు ఎన్నోసార్లు శారీరక, మానసిక వేధింపులకు గురయ్యాను. ఎవరికి చెప్పాలో, ఎలా వాటిని ఎదుర్కోవాలో తెలియక మౌనంగా భరించాను. మా కుటుంబానికి ఎంతో సన్నిహితుడైన ఓ పెద్దమనిషే అలా చేసేవాడు' అని పండిట్ రవిశంకర్ కూతురు, సితార్ కళాకారిణి అనౌష్క శంకర్ చెప్పింది. ప్రేమికుల రోజున మహిళలపై హింసకు వ్యతిరేకంగా 'వన్ బిలియన్ రైసింగ్' కార్యక్రమంలో పాల్గొన్న ఆమె 'ఒకటి, రెండుసార్లు కాదు, ఏళ్ల తరబడి ఆ వేధింపులు కొనసాగాయి. రాత్రిళ్లు బయటకు రావాలంటే భయం కలిగేది. బాగా తెలిసిన వాళ్లను కూడా నమ్మలేకపోయేదాన్ని. ఎన్నో ఏళ్లు గడిచినా చిన్నప్పటి చేదు జ్ఞాపకాలు ఇంకా నన్ను వదల్లేదు' అని చెప్పుకొచ్చింది. మహిళలపై హింసకు వ్యతిరేకంగా పోరాడేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలంటోన్న అనౌష్క ఢిల్లీలోని కళాశాలలకు వెళ్లి విద్యార్థులను చైతన్య పరుస్తోంది. మహిళా ట్యాక్సీ డ్రైవర్లు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో పాల్గొంది.
- ================================
Visit my website - > Dr.seshagirirao.com/
No comments:
Post a Comment
Thanks for your comment & feedback.