Tuesday, May 21, 2013

Hagiography statues in Parliament, పార్లమెంట్‌లో మహాత్ముల విగ్రహాలు

  •  

  •  

మానవులు పుడతారు ... చనిపోతారు . కొంతమంది మాత్రమే తమ జీవితం లో ప్రజలకు ఉపయోగపడే సేవాకార్యక్రమాలు చేసి తమ జీవితాన్నే ఫణం గా పెట్టి మానవ జాతిలో చిరస్థాయిగా తరతరాలుగా నిలిచిపోతారు ... వీరిని "మృతంజీవులు" అని అంటారు . కోటాను కోట్ల జనం లో బహు కొద్ది మంది మాత్రమే ఇలాంటివారు ఉంటారు . ప్రపంచము లో ప్రతి జాతి లోనూ ఈ తరహా మహానుభావులు పుట్టి తమ సేవలతో పుణీతులయ్యారు . భారత జాతికి మణిపూసలైన కొందరి మహానుభావులను తెలుసుకునే ప్రయత్నం లో ఇక్కడ -Hagiography statues in Parliament, పార్లమెంట్‌లో మహాత్ముల విగ్రహాలు- గురించి తెలుసుకొని మన జీవితాన్ని చక్కని మార్గములో ప్రయాణించే ప్రయత్నం చేద్దాము ....


1963లో మోతీలాల్‌ నెహ్రూతో ప్రారంభం
1993లో జాతిపిత విగ్రహావిష్కరణ
విశ్వవిఖ్యాత నటనా సార్వభౌముడు ఎన్‌టిఆర్‌
వ్యవసాయ అభివృద్ధికి ఎన్‌.జి.రంగా కృషి
బ్రిటీష్‌వారికి గుండె చూపిన టంగుటూరి
తెలుగు వారిలో ముగ్గురికి చోటు

దేశ స్వాతంత్య్రం కోసం కొందరు, బీసీ, ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతి కోసం మరిందరు. జాతి ఔన్నత్యాన్ని దశ దిశలా వ్యాపింపజేసిన వారు ఇంకొందరు. ఇలా అందరూ ఎంతో ఉన్నతమైన వారే. మన దేశచరిత్రలో ఎందరో మహానుభావులు. వారందరినీ స్మరించుకోవడానికిి, మున్ముందు తరాల కోసం పార్లమెంట్‌లో విగ్రహాలను ఏర్పాటు చేయడం ప్రారంభించారు. మోతీలాల్‌ నెహ్రూతో 1963లో ప్రారంభమైన ఈ ఏర్పాటులో ఇప్పటికీ 49 విగ్రహాలు ఏర్పాటయ్యారుు. నూతనంగా ఆంధ్రుల అభిమాన నటుడు, తెలుగువాడి గౌరవాన్ని ప్రపంచస్థారుులో చాటిచెప్పి ముఖ్యమంత్రిగా సేవలు అందించిన ఎన్‌టిఆర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పార్లమెంట్‌లోని విగ్రహాల విశేషాలు...

పార్లమెంట్‌ను ఇద్దరు అర్కిటెక్‌ నిపుణులు రూపకల్పన చేశారు. సర్‌ ఎడ్విన్‌ లుట్యన్స్‌, సర్‌ హెర్బర్ట్‌ బాకెర్‌లే ప్లానింగ్‌ చేసి నిర్మాణం చేయించారు. 1921 ఫిబ్రవరి 12న నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. ఆరు సంవత్సరాలు అత్యంత జాగ్రత్తగా నిర్మించారు. 18 జనవరి 1927న భవన ప్రారంభం జరిగింది. అప్పటి భారత గవర్నర్‌ జనరల్‌ లార్డ్‌ ఇర్విన్‌ ప్రారంభించారు. నిర్మాణానికి అయిన ఖర్చు ఎంతో తెలుసా అక్షరాల 83లక్షల రూపాయలు. దీనికి 12 గేట్లు ఏర్పాటు చేశారు. గేట్‌ నెం.1 సన్‌సాద్‌ మార్గ్‌ ప్రధాన ద్వారం. దాదాపు ఆరు ఎకరాల విస్తీర్ణంలో పార్లమెంట్‌ ఏర్పాటు చేశారు. జాతి గర్వించదగిన మహానుభావుల విగ్రహాలను పార్లమెంట్‌లో ఏర్పాటు చేశారు. హాల్‌లో, గ్రంథాలయంలో, కోర్డుయార్డులో, బయట కలిపిమొత్తం 49 విగ్రహాలు ఉన్నాయి. కొందరి విగ్రహాలు రెండు ప్రాంతాల్లో కూడా ఏర్పాటు చేశారు. ఎన్‌.జి.రంగా, టంగుటూరి ప్రకాశం, ఎన్‌.టి.రామారావుల విగ్రహాలు తెలుగు వారి ఔన్నత్యాన్ని నిదర్శనంగా ఠీవిగా కనిపిస్తాయి

మహాత్మా గాందీ

16 అడుగుల ఎత్తు కాంస్యంతో తయారైంది మహాత్మా గాంధీ విగ్రహం. ఇది సరిగ్గా గేట్‌ నెం.1కి ఎదురుగా ఉంటుంది. ధ్యానంలో ఉన్న జాతి పితగా ఇది కనిపిస్తుంది. రామ్‌ సుతార్‌ అనే శిల్పి అత్యంత నైపుణ్యంతో దీన్ని తయారు చేశారు. 2 అక్టోబర్‌ 1993న నాటి రాష్టప్రతి శంకర్‌ దయాల్‌ శర్మ ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ విగ్రహాన్ని దానం చేసింది. 1869న జన్మించిన బాపూజీ 1948లో నాధురామ్‌ గాడ్సే చేతితో హత్య చేయబడ్డారు.

బాబూజగ్జీవన్‌రామ్‌

బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహాను భావుడు. ప్రస్తుత స్పీకర్‌ మీరాకుమార్‌కు తండ్రి. లోక్‌ సభ చాంబర్‌ అవుట్‌ లాబీ వద్ద ఈయన విగ్రహం ఉంది. తొమ్మిది అడుగుల ఎత్తులో రామ్‌ సుతార్‌ అనే శిల్పి దీన్ని తయారు చేశారు. 25 ఆగస్టు 1995న శంకర్‌ దయాల్‌ శర్మ విగ్రహావిష్కరణ చేశారు. బాబూ జగ్జీవన్‌ రామ్‌ ఆశ్రమ ట్రస్టు విగ్రహాన్ని పార్లమెంట్‌కు అందజేసింది. 1908లో జన్మించిన జగ్జివన్‌ రామ్‌ 1986లో మృతిచెందారు.

బి.ఆర్‌. అంబేద్కర్‌

పార్లమెంట్‌ బయట ఉన్న ఉద్యానవనంలో 3.66 మీటర్ల ఎత్తులో రాజ్యాంగ నిర్మాత డా.బి. ఆర్‌.అంబేద్కర్‌ విగ్రహం నిలువెత్తుగా దర్శనమిస్తుంది. దీన్ని కాంస్యంతో తయారు చేశారు. బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ మెమోరియల్‌ కమిటీ విగ్రహాన్ని దానం చేయగా బి.వి.వాగ్‌ నైపుణ్యంతో తయారు చేశారు. 2 ఏప్రిల్‌ 1967న నాటి రాష్టప్రతి డా.సర్వేపల్లి రాధాకృష్ణ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఎస్టీ, ఎస్సీ, బిసీల అభివృద్ధికి బాటలు వేసిన జనోద్ధరణ నాయకుడు. 1891లో జన్మించిన అంబేద్కర్‌ 1956లో మృతిచెందారు

ఎన్‌.జి. రంగా

రైతుల ఎన్నో సేవలు చేసిన ప్రొఫెసర్‌ ఎన్‌.జి.రంగా. అందుకే మన రాష్ట్రంలో వ్యవసాయ విశ్వ విద్యాల యానికి ఎన్‌.జి.రంగా పేరు పెట్టుకున్నాం. డి.శంకర్‌ అతని సోదరులు ఈయన విగ్రహాన్ని తయారు చేశారు. ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వం విగ్రహాన్ని దానం చేసింది. నాటి ఉపరాష్టప్రతి కృష్ణకాంత్‌ 27 జులై 1998న విగ్రహావిష్కరణ చేశారు. 1900 సంవత్సరంలో పుట్టిన ఎన్‌.జి.రంగా 1995లో మృతిచెందారు.

టంగుటూరి ప్రకాశం

డి.శంకర్‌ అతని సోదరులు ఎంతో అద్భుతంగా టంగుటూరి ప్రకాశం పంతులు విగ్రహాన్ని తయారు చేశారు. ఆంధ్రకేసరిగా గుర్తింపు పొందారు టంగుటూరి. 5 మే 2000న నాటి రాష్టప్రతి కె.ఆర్‌.నారాయణన్‌ విగ్రహాన్ని ఆవిష్కరించారు. విగ్రహాన్ని దానం చేసింది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం. ‘‘రండి రా.. దమ్ముంటే కాల్చుకోండి అంటూ బ్రిటీష్‌ వారికి గుండెను చూపిన ఆంధ్రుడు’’. 1872లో జన్మించిన టంగుటూరి ప్రకాశం 1957లో మరణించారు.

జయప్రకాశ్‌ నారాయన్‌

జె.పి.విచార్‌ మంచ్‌ విగ్రహాన్ని దానం చేయగా కె.ఆర్‌.నారాయణన్‌ 3 జులై 2002 ఆవిష్కరణ చేశారు. భారత స్వాతంత్య్ర సమర యోధుడు, రాజకీయ నాయకుడు. 1970 వ దశకంలో అప్పటి భారత ప్రధాని ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా ప్రతిపక్షానికి నాయకత్వం వహించి సంపూర్ణ విప్లవానికి పిలుపునివ్వటం ద్వారా జయప్రకాశ్‌ నారాయణ్‌ చిరస్మరణీయుడయ్యాడు. ఈయనను ప్రజలు లోక్‌నాయక్‌ అని సగౌరవంగా పిలుచుకుంటారు. జె.పి.గా సుప్రసిద్దులైన జయప్రకాశ్‌ నారాయణ్‌ 1902 జన్మించి 1979లో మృతిచెందారు.

జ్యోతిరావు ఫూలే

గేట్‌ నెం.3 వద్ద గల ఉద్యానవనంలో మహాత్మా జ్యోతిరావు ఫూలే విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. మహారాష్ట్ర ప్రభుత్వం విగ్రహాన్ని దానం చేయగా 3 డిసెంబర్‌ 2003న నాటి ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి ఆవిష్కరణ చేశారు. బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి కోసం శ్రమించిన నాయకుడు. 12 అడుగుల ఎత్తులో కాంస్యంతో ఈ విగ్రహాన్ని తయారు చేశారు.

  • ఎన్‌.టి. రామారావు

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా, విశ్వ విఖ్యాత నటనా సార్వభౌముడిగా, నిర్మాతగా, దర్శకుడిగా, తెలుగువాడి ఖ్యాతిని దశదిశలా వ్యాపింప జేసిన ధీరుడిగా ఎన్‌.టి.రామారావు ప్రసిద్ధి గాంచారు. పదేళ్లుగా ఈయన విగ్రహం పార్లమెంట్‌లో ఏర్పాటు చేయాలని కుటుంబీకులు పోరాడుతున్నారు. ఎట్టకేలకు ఎన్‌టిఆర్‌ కూతురు, కేంద్ర మంత్రి పురందేశ్వరీ విగ్రహాన్ని దానం చేయడంతో మార్గం సుగమమం అయింది. 7 మే 2013న అంగరంగ వైభవంగా కుటుంబీకులంతా తరలిరాగా స్పీకర్‌ మీరాకుమర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించారు.

  • ================================= 
Visit my website - > Dr.seshagirirao.com/

No comments:

Post a Comment

Thanks for your comment & feedback.