Thursday, April 4, 2013

Sister Niveditha,సిస్టర్ నివేదిత



  •  

మానవులు పుడతారు ... చనిపోతారు . కొంతమంది మాత్రమే తమ జీవితం లో ప్రజలకు ఉపయోగపడే సేవాకార్యక్రమాలు చేసి తమ జీవితాన్నే ఫణం గా పెట్టి మానవ జాతిలో చిరస్థాయిగా తరతరాలుగా నిలిచిపోతారు ... వీరిని "మృతంజీవులు" అని అంటారు . కోటాను కోట్ల జనం లో బహు కొద్ది మంది మాత్రమే ఇలాంటివారు ఉంటారు . ప్రపంచము లో ప్రతి జాతి లోనూ ఈ తరహా మహానుభావులు పుట్టి తమ సేవలతో పుణీతులయ్యారు . భారత జాతికి మణిపూసలైన కొందరి మహానుభావులను తెలుసుకునే ప్రయత్నం లో ఇక్కడ --Sister Niveditha,సిస్టర్ నివేదిత-- గురించి తెలుసుకొని మన జీవితాన్ని చక్కని మార్గములో ప్రయాణించే ప్రయత్నం చేద్దాము ....





మహిళలకు సరైన విద్యావకాశాలు కల్పించి విద్యావంతులను చేసినపుడే దేశం అభివృద్ధి చెందుతుందని ఉద్ఘాటించిన సిస్టర్‌ నివేదిత మహిళావిద్యాభివృద్ధికోసం ఎంతో కృషి చేశారు. వివేకానందుడి బోధనలకు ప్రభావితమై హిందుమతాన్ని స్వీకరించిన మొదటి విదేశీ మహిళగా ఆమె చరిత్రను సృష్టించారు. ఐర్లాండులో 1867 అక్టోబర్‌ 28న జన్మించిన మార్గరెట్‌ ఎలిజబెత్‌ నోబెల్‌ తల్లిదండ్రులు మేరి ఐస్‌బెల్‌, శ్యాముల్‌ రిచ్‌ముడ్‌ నోబుల్‌.నిజమైన తోటి మనుషులను కరుణతో చూడటమే భగవంతునికి నిజమైన సేవ చేయడం అని చిన్నతనంలో తండ్రి చెప్పిన మాటలు ఆమెను ఎంతో ప్రభావితం చేశాయి. తండ్రి స్పూర్తిదాయకమైన మాటలతో ఒక పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా చేరారు. దాదాపు పదిసంవత్సరాలు(1884 నుంచి 1894 వరకు) ఇంగ్లాండులో ఆమె ఉపాధ్యాయురాలిగా పనిచేశారు. 1895లో భారత మహిళా ఔన్నత్యంపై స్వామి వివేకానంద లండన్‌లో చేసిన ప్రసంగాలు మార్గరెట్‌ జీవితాన్ని మార్చాయి. భారతీయ స్త్రీ గొప్పదనం గురించి విన్న ఆమె వివేకానందను కలిసి 1898 జనవరి 28న భారత్‌ చేరింది. అలా ఆమె భారతదేశానికి వచ్చి నేటికి 113 సంవత్సరాలయింది. ఆమెకు వివేకానంద నివేదిత అని నామకరణం చేశారు. నివేదిత అంటే భగవంతునికి సమర్పణ చేయబడినది అని అర్థం. వివేకానంద బోధన గురించి, తనపై వాటి ప్రభావం గురించి తాను రాసిన 'ది మాస్టర్‌ యాజ్‌ ఐ సా హిమ్‌' పుస్తకంలో వివరిం చారు. ఇతరులపై దయ గుణంతో మెలిగే ఆమె, మంచి అభిరుచిగల కళాకారిణి. సంగీతం లోనూ, చిత్రకళలోనూ ఆమెకు ప్రవేశం ఉండేది.

ఉపాధ్యాయురాలిగా పనిచేసిన అనుభవం ఉన్న నివేదిత భారత్‌లోనూ విద్యాభివృద్ధికి ఎంతో కృషి చేసింది. ముఖ్యంగా బాలికల విద్యకోసం ఆమె 1898 నవంబర్‌లో కలకత్తాలోని బాగ్‌బజారులో పాఠశాలను ప్రారంభించింది. కనీస విద్యలేని బాలికలకు విద్యను అందించడం లక్ష్యంగా ఆమె పనిచేశారు. ప్రాథమికవిద్య అందించడానికి విశేష కృషి చేశారు. అన్నికులాల మహిళలకు చదువు తప్పనిసరిగా రావాలని ఆమె ఆకాంక్షించారు. బెంగాల్‌ మహిళలతో, మేధావులతో పరిచయాలను ఏర్పాటుచేసుకుని బాలికల విద్యకోసం ఎంతో శ్రమించారు. విశ్వకవి రవీంద్రనాథ్‌ ఠాగూర్‌, జగదీష్‌చంద్రబోస్‌ తదితర ప్రముఖులతో స్నేహసంబంధాలను కొనసాగించారు.1899 సంవత్సరం మార్చిలో కలకత్తావాసులకు ప్లేగ్‌ వ్యాధి సోకినప్పుడు తన శిష్యులతో కలిసి వైద్యసేవలు అందించారు. భారత మహిళల ఔన్నత్యం గురించి, ఆచారవ్యవహారాల గురించి న్యూయార్క్‌, షికాగో మొదలైన నగరాల్లో ఆమె ప్రసంగించారు. భారతస్వాతంత్య్రపోరాటంలోనూ ఆమె చురుకైన పాత్రపోషించారు. భారతీయతను పూర్తిగా ఆకలింపు చేసుకున్న ఆమె మహిళావిద్య కోసం ఎంతగానో పాటుపడ్డారు.

1906లో బెంగాల్‌కు వరదలు వచ్చినప్పుడు బాధిత ప్రజలకు ఆమె చేసిన సేవ, అందించిన మానసికధైర్యం ఎంతో విలువైనవి. విదేశీయురాలు అయినప్పటికీ భారతీ యతను పుణికిపుచ్చుకుని స్వామివివేకానందతో అనేక దేశాలు పర్యటించి ప్రసంగించిన ఆమె 1911 అక్టోబర్‌ 13న డార్జిలింగ్‌లో మరణించారు. ఆమె పేరుతో అనేక పాఠశాలలు, కళాశాలు స్థాపించబడ్డాయి.

చివరి రోజుల్లో :
ఆమెను కడుపులో మోస్తుండా తల్లి తనకు పుట్టబోయే బిడ్డను ప్రభువు సేవకు అందిస్తానని మొక్కుకుంది. టీనేజ్ లోకి అడుగు పెడుతున్న సమయములో మార్గరెట్ కూడా క్రైస్తవ సన్యాసినిగా మారి మతసేవ చేయాలనుకుంది . అయితే ఈలోగా ఆమె ఒక యువకునితో ప్రేమలో పడింది . ఆ ప్రేమలో లభిస్తున్న ఆనందం , తృప్తి తో పొంగిపోయింది. ప్రభువు సేవ చేయాలంటే సన్యాసిని కానక్కరలేదని ,తన తండ్రి ,తాత సంసారము చేసుకుంటూ మతబోధన చేసిన విషయము గుర్తుచేసుకుంది. ఇక పెళ్ళి చేసుకుందామనుకుంటున్న సమయం లో ఆ యువకుడు మరణించడముతో ఎలిజబెత్ కి  పెద్ద షాక్ తగిలింది .
టీచర్ గా పనిచేస్తూ  తిరిగి మతపరమైన అంశాలలో మునిగిపోవాలనుకుంది. కాని క్రైస్తవ మతములో పరిచయం పెరుగుతున్నకొద్దీ ఆమెలో అసహనం పెరిగింది. అంతులేని ఆంక్షలు మతపరం గా విధించడం సహించలేకపోయింది . మనుషులకు మతం అవసరమే అయినా క్రైస్తవ మతం తనకు అవసరములేదనుకుంది. కొత్త మతం ఏదయినాకావాలి . వ్యక్తి స్వాతంత్ర్యిం హరించని , ఆలోచనలను అదుపుచేయని మతం కోసము వెదకడం మొదలు పెట్టింది . ఆ సమయం లో మార్గరెట్ కి ఎవరో బుద్ధుని జీవితానికి సంబందించిన పుస్తకం ఇచ్చారు . అది చదివిన మార్గరెట్ ఆసియాఖండదేశాలలోని మతాలగురించిన అవగాహన ఏర్పడింది.

అమెరికాలో సర్వమత సమావేశానికి హాజరై భారత దేశము వెళుతూ లండన్‌ లో ఆగిన వివేకానందుడు ఇస్తున్న ప్రసంగాలకు మార్గరెట్ ఆకర్షితురాలై భారతదేశము చేరి రామక్రిష్ణామిషన్‌ లో చేరి సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ ''సిస్టర్ నివేదిత'' గా  వివేకానందుడిచేత పిలిపించుకుంది. ఆ వి్ధముగా భారతదేశములో తన జీవితం దశాబ్దము గడిచింది . కాని ఎందుకో తాను అట్టేకాలం బ్రతకనన్న భావన మొదలైనది.ఆ రోజుల్లో వైద్యవిధానాలు , చికిత్సలు అంతగా అభివృద్ధి చెందని కారణము గా తన అనారొగ్యానికి కారణం తెలియ పర్చలేదు.  నా జీవితం మరో రెండేళ్ళు మించి లేదేమో అంటూ 1908 లొ ఆమె ఒక స్నేహితురాలికి ఉత్తరం రాసింది. ఏ స్నేహితురాలకైతే ఉత్తతం రాసిందో ఆమె మరణానికి దగ్గరగా ఉందని , తనను చూడాలనుకుంటుందని తెలిసి ఆరోగ్యము అంత బాగులేదని తెలిసికూడా బోస్టన్‌ వెళ్ళింది. దురదుస్టవశాత్తూ ఆ స్నేహితురాలి కూతురు నివేదిత మీద ఫిర్యాదుచేసింది. తమ తల్లిని మభ్యపెట్టి ఆస్తిని భారతదేశము తీసుకువెళ్తుందని ఫిర్యాదు. అలాంటి అవమారము తనకు జరుగుతుందని భావించని సిస్టర్ నివేదిత స్నేహితురాలి మరణం తర్వాత ఏప్రిల్ 11 , 1911 న తిరిగి భారతదేశము వచ్చింది. జీవితము లో నిరాశచెందిన ఆమె మనశ్శాంతి కోసము శాంతిదేశమైన భారత్ లోనే మనగలిగింది. దసరా సెలవులలో ఆమె మనసుకు విశ్రాంతి అవసరమని ప్రశాంతవాతావరణం కోసము మిత్రుది కుటుంబం తో కలిసి డార్జిలింగ్ వెళ్ళి రక్తవిరేచనాలు పట్టున్నందున వైద్యము ఇప్పించినా ఆమె శరీరము స్పందించలేదు . చివరిదశలో అనేకరకాల ఆద్యాత్మిక వాక్యాలు సిస్టర్ నివేదిత తన పుస్తకాలలో రాసుకున్నారు. ఆరోగ్యము మరింత క్షీణించడం తో 13 అక్టోబర్ 1911 న 2.30 గంటలకు తెల్లవారు జామున భగవంతునిలో లీనమైనది.

Source : Courtesy with Swathi Telugu weekly magazine and others.
  • ========================
Visit my website - > Dr.seshagirirao.com/

No comments:

Post a Comment

Thanks for your comment & feedback.