Tuesday, January 22, 2013

మున్సీ ప్రేంచంద్‌-Munshi Premchand

  •  
  •  
మానవులు పుడతారు ... చనిపోతారు . కొంతమంది మాత్రమే తమ జీవితం లో ప్రజలకు ఉపయోగపడే సేవాకార్యక్రమాలు చేసి తమ జీవితాన్నే ఫణం గా పెట్టి మానవ జాతిలో చిరస్థాయిగా తరతరాలుగా నిలిచిపోతారు ... వీరిని "మృతంజీవులు" అని అంటారు . కోటాను కోట్ల జనం లో బహు కొద్ది మంది మాత్రమే ఇలాంటివారు ఉంటారు . ప్రపంచము లో ప్రతి జాతి లోనూ ఈ తరహా మహానుభావులు పుట్టి తమ సేవలతో పుణీతులయ్యారు . భారత జాతికి మణిపూసలైన కొందరి మహానుభావులను తెలుసుకునే ప్రయత్నం లో ఇక్కడ - మున్సీ ప్రేంచంద్‌-Munshi Premchand- గురించి తెలుసుకొని మన జీవితాన్ని చక్కని మార్గములో ప్రయాణించే ప్రయత్నం చేద్దాము ....

1980 జూలై 31 న ఉత్తర ప్రదేశ్ లోని వారణాసి లో జన్మించిన మున్షి ప్రేమ్ చంద్  భారతదేశపు ప్రముఖ హిందీ, మరియు ఉర్దూ కవి. ఇతని కలం పేరు ప్రేమ్ చంద్. హిందీ, ఉర్దూ భాషా సాహిత్యాలలో అత్యంత ప్రముఖమైన పేరు సంపాదించాడు.

మున్షీ ప్రేంచంద్‌ ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సాంఘీక జీవనంలో మనిషి తనాన్ని, మంచి తనాన్ని పెంపొందించడానికి తన రచనల ద్వారా కృషి చేసిన మహరచయిత ఉర్దూలో హిందీలో కథలు, నవలలు, సంపాదకీయాలు రాసిన మహానీ యుడు, పిల్లల మానసిక ప్రవర్తన గురించి కూడా గొప్ప కథలు రాశాడు. కథలు లేకుండా మనిషి జీవితాన్ని ఊహించలేం. కథలు లేకుంటే మనిషి పిచ్చివాడైపోతాడు. పాట నుంచి మొదలైన మనిషి జీవితం కథ నుంచి కొనసాగుతుంది. మనిషి చనిపోయిన తరవాత కూడా కథలాగా కొనసాగుతుంది. కథలు ఏం చేస్తాయి. కథలు మనల్ని ఆలోచింపచేస్తాయి. కొన్ని కథలు నవ్విస్తాయి. కొన్ని కథలు మన కళ్లు తెరిపిస్తాయి. కొన్ని కథలు మన కళ్లల్లో గడ్డకట్టిన కన్నీళ్లని ప్రవహింప చేస్తాయి. మనసు కరిగిపోతుంది. కథల్లో మనకు తెలియని మహాత్తు ఉంది. ఈ మధ్య అలాంటి కథ చాలా రోజుల తరువాత మళ్లీ చదివాను. అది ప్రపంచంలోని గొప్ప కథకుల్లో ఒకడైన మున్సీ ప్రేంచంద్‌ కథ ‘ఈద్‌ పండుగ’. ఈ కథ చదివిన వ్యక్తుల కళ్లు కూడా ఆ కథలోని హమీద్‌ నానమ్మ అమీనాతో పాటు వర్షిస్తాయి. మనిషిగా ఎలా వుండాలో ఆలోచింప చేస్తాయి. ఈ కథలో ప్రేమా, మానవత్వం అనుబంధం ఎన్నో కలగలిపి ఉంటాయి.  అలాంటి కథే ‘ఈద్‌ పండుగ’ మన మనస్సులని కదిలించే కథ. మన భావోద్వేగాలకి చలనం ఇచ్చే కథ. ప్రేంచంద్‌ రాసిన కథ ల్లో చాలా గొప్ప కథ ‘ఈద్‌ పండుగ’ ఈ కథ ఈద్గా (మసీదు) పేరు తో అనువాదం అయ్యింది.



ప్రేమ్‌చంద్ 1880, జూలై 31న వారణాసి దగ్గర కాశికి నాలుగు మైళ్ళ దూరములో ఉన్న లమ్హీ గ్రామంలో ఒక తపాలా గుమాస్తా మున్షీ అజైబ్ లాల్ మరియు ఆయన భార్య ఆనందికి జన్మించాడు. ఆయన తల్లితండ్రులు ఈయనకు ''ధన్‌పత్ రాయ్'' అని పేరుపెట్టారు. ఈయన మామ మహాబీర్, ఇతనిని 'నవాబ్' అని పిలిచేవాడు. ఈ పేరుతోనే ప్రేమ్‌చంద్ కొన్ని తొలి రచనలు చేశాడు. ప్రేమ్‌చంద్ తల్లితండ్రులు ఆయన బాల్యంలోనే మరణించడంతో  సవతి తల్లి మరియు ఆమె పిల్లల బాధ్యత  ప్రేమ్ చంద్  పై పడింది. వారి కుటుంబము లో ఆరోగ్యము అంతంతమాత్రమే . అనారోగ్యము వారసత్వమూగా అందుకున్నాడు ప్రేమంచంద్ . ఆరోగ్యము సహకరించక , ఉద్యోగములో వస్తున్న తరచూ బదిలీలు భరించలేక ఉద్యోగము మానేసి పూర్తికాలం రచయితగా స్థిరపడ్డాడు .

ప్రేంచంద్ కి బాల్యములోనే వివాహమైంది. కాని అది బలవంతపు వివాహము , అయిష్ట వివాహము  అనేవారు. పెద్దలు చేసిన పెళ్ళిని ఆయన అంగీకరించలేదు. ఆమె తో సంసారము చెయ్యలేదు.  ఈ లోగా పేపర్లో ఒక ప్రకటన చూశారు . బాల్యములోనే వివాహవైధవ్యము సంభవించిన 11 యేళ్ళ బాలికను వివాహమాడేందుకు అభ్యుదయభావావు కలిగిన యువకుడు కావాలి అనేది ఆ ప్రకటన . అది చూసి ప్రేంచంద్ స్పందించాడు . తాను చేసుకుంటానని ముందుకు వెళ్ళాడు .. ఆ విధము గా " శివరాణీదేవి " ని ఇష్టపడి పెళ్ళిచేసుకున్నాడు . తనకు ఇంతకుముందు పెళ్ళి అయిన విషయము చెప్పలేదు. సమాజపు కట్టుబాట్లు తెంచే ప్రయత్నము చేశాడు . విద్యాశాఖలో ఇన్‌స్పెక్టర్ గా పనిచేస్తూ రచనలు చేస్తూ ఉండేవారు. రచయితగా మంచి గుర్తింపు వచ్చింది . 1920 లో వచ్చిన సహాయనిరాకరణ ఉద్యమం లో గోరఖ్ పూర్ లో గాంధీజీ చేసిన ప్రసంగానికి ప్రభావితుడై  ప్రభుత్వ ఉద్యోగము వదిలేసి పూర్తిస్థాయి రచయితగా ప్రెస్ పెట్టుకొని , పత్రికలు నడుపుతూ జీవితం గడిపేవారు. 250 కధలు , 12 నవలలు రచించాడు .

సమాజములోని లోటుపాట్లను , స్త్రీలకు జరుగుతున్న అన్యాయాలను , మూఢనమ్మకాలను  నిరసిస్తూ రచనలు చేశాడు . మంచి పేరు ప్రతిస్టలు సంపాదించాడు . రెండవ భార్యకు తన మొదటి వివాహము  గురించి తెలిసింది. ఆ విషయము మీద ఇద్దరూ వాదులాడుకున్నారు . వారి సంసారములో వాదులాటలు సామాన్యము అయినా వారిద్దరి మధ్యా ప్రేమ , అనురాగము అధికము .  ప్రేంచందను వదిలి శివరాణీదేవి దూరంగా ఉండేందుకు ఒక్క క్షణము ఇష్టపడేదికాదు . ప్రేంచంద్ కూడా అంతే. ఏ మాత్రము నలతగా అనిపించినా ఆమెను పక్కన కూర్చోపెట్టుకొని తన జీవితంలోని విషయాలు ఆమెకు చెపుతుండేవారు.  భర్తకున్న అనారోగ్య సమస్యలు , జీర్ణకోశ సమస్యలు ఆమెకు ఆందోళన కలిగిస్తూఉండేవి . ఎంతో శ్రద్ద తీసుకొని చూసుకుంటూ తన సాహిత్యసేవా , పత్రిక సేవా నడపడము లో సహకరిస్తూ ఉండేవారు.

ప్రేమ్‌చంద్ 1935 లో జ్వరము బాధపడుతూ పత్రికకు సంపాదకీయము రాయడము మొదలు పెట్టగానే భార్య అభ్యంతరము పెట్టింది. అందుకు ఆయన " రాణీ నువ్వు పొరపడుతున్నావు . నేను నాకు నచ్చిన పని చేయుచున్నాను . ఇందులో నాకు ఆనందము దొరుకుతుంది. ఇది ఒకరకమైన మత్తును కలిగిస్తుంది. కాని ఇది చెడుపని కాదు. నేను దీపం వంటి  వాడిని ... వెలుతురును ఇస్తాను , ఆ వెలుతురు ఇతరులు లాభానికి వాడుకుంటారో , నష్టపోతారో నాకు సంబంధము  లేదు . " అన్న తర్వాత ఇక ఆమె అడ్డు చెప్పలేదు . నాటి నుండి ఆయన ఆరోగ్యము తగ్గడము మొదలు పెట్టింది.

1936 లో ' గోదాన్‌ ' అచ్చు అయింది. మంగళసూత్రమనే మరో నవలను ఆలోచిస్తున్నారు. కాని ఆరోగ్యము సహకరించలేదు . తన ఆరోగ్యము వలన భార్య బాధపడుతుందని ఆయనకు దిగులు. రక్తపు వాంతులు అయ్యాయి . ఆమె సుభ్రము చేసింది. పక్కన వచ్చికూర్చుని నుదుటిమీద చెయ్యివేసి ఉంచమని భార్యను  కోరాడు . ఆమె కంటనీరుతో అలాగే కూర్చుంది. నీకు తెలియకుండా దాచిన రహస్యాలను చెబుతాను విను.  " నా మొదటి వివాహం తర్వాత మరో స్త్రీ నా జీవితం లోకి ప్రవేశించింది. నిన్ను పెళ్ళిచేసుకున్నాక కూడా ఆమెతో నా సంబంధం కొనసాగింది. అలాగే నీకు చెప్పకుండా కొందరికి డబ్బులు ఇచ్చి , ఆ అప్పు ను తీర్చేందుకు  కధలు రాసేవాడిని " ఇలా తాను చేసిన తప్పులను ఒప్పుకోవడము మొదలు పెట్టాడు .  నిజానికి అవన్నీ భార్యకు తెలుసు . అయినా ఆయన కోసము వాటిని తెలియనట్టుగానే ఉంది.  ఆ విషయము ప్రేంచంద్ కి అర్ధమయ్యేసరికి భార్య శివరాణీదేవి మీద గౌరవం , ప్రేమ పెరిగిపోయింది.

అన్నీ తెలిసి నన్ను నిలదీయని నీ హృదయం ఎంత ఉన్నతమైనదో ఈ రోజు గ్రహించాను . నాకిప్పుడు ఎక్కువ కాలము బ్రతకాలని ఉంది నాకోసము కాదు ... నా భార్యకోసము ... ఆమె మహాత్యాగి . ఆమె తో కలిసి మరికొంతకాలము ఉండాలనివుంది. నన్ను బ్రతికించు . వచ్చే జన్మలో కూడా ఈమెనే నా అర్ధాంగిగా చెయ్యి ... కనీసము నా ఈ చివరి ప్రార్ధనన్నా ఆలకించు ... అని తనలోతాను సణుగుతున్నారు. మనము ఎవరికీ ఏ అపకారము  చెయ్యలేదు . భగవంతుడు మన మొర తప్పక ఆలకిస్తాడు . రాణీ ,, నువ్వు నాపక్కనే ఉండు . ఎక్కడికీ వెళ్ళకు . నువ్వు ఉంటే నాకు ధైర్యము గా ఉంటుంది . నీకు చెప్పాలకున్న విషయాలు పూర్తిగా చెప్పగలుగుతాను.  ఇది జరిగిన రెండవరోజూ అంటే ... అక్టోబర్ -08 -1936 న విరోచనమైంది. రాణి శుభ్రం చేద్దామనుకుంటుండగానే ఆయన శరీరము చల్లబడింది. ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. 56 సంవత్సరాలకే ఆ మహా రచయిత జీవితం అంతమైంది.

మూలము : చివరి రోజుల్లో@స్వాతి వారపత్రిక .... 11-1-2013



===========================
Visit my website - > Dr.seshagirirao.com/

No comments:

Post a Comment

Thanks for your comment & feedback.