Monday, February 18, 2013

P.T.usha,పి.టి.ఉష

  •  
  •  
మానవులు పుడతారు ... చనిపోతారు . కొంతమంది మాత్రమే తమ జీవితం లో ప్రజలకు ఉపయోగపడే సేవాకార్యక్రమాలు చేసి తమ జీవితాన్నే ఫణం గా పెట్టి మానవ జాతిలో చిరస్థాయిగా తరతరాలుగా నిలిచిపోతారు ... వీరిని "మృతంజీవులు" అని అంటారు . కోటాను కోట్ల జనం లో బహు కొద్ది మంది మాత్రమే ఇలాంటివారు ఉంటారు . ప్రపంచము లో ప్రతి జాతి లోనూ ఈ తరహా మహానుభావులు పుట్టి తమ సేవలతో పుణీతులయ్యారు . భారత జాతికి మణిపూసలైన కొందరి మహానుభావులను తెలుసుకునే ప్రయత్నం లో ఇక్కడ -P.T.usha,పి.టి.ఉష- గురించి తెలుసుకొని మన జీవితాన్ని చక్కని మార్గములో ప్రయాణించే ప్రయత్నం చేద్దాము ....



ఈమె పూర్తిపేరు పిలవుల్లకాండి థెక్కెపరాంబిల్‌ ఉష. ఈమె 1964 మే 20న పుట్టింది. మంచి క్రీడాకారిణిగా ఎన్నో విజయాలు సాధించి, పరుగుల రాణిగా అంతర్జాతీయ ఖ్యాతిని గడించింది. ఈమెను అందరూ ముద్దుగా పయోలి ఎక్స్‌ప్రెస్‌ అని పిలుస్తుంటారు. ఇక ఈమె విజయ పరంపరలో 1986 సియోల్‌లో జరిగిన ఆసియా క్రీడల్లో 4 బంగారు పతకాలు, ఒక రజితం సాధించి భారత ఖ్యాతిని ఖండాంతరాల్లో చాటిచెప్పింది. 1982లో ఢిల్లీలో జరిగిన ఆసియా క్రీడల్లో కూడా 2 రజిత పతకాలు సొంతం చేసుకుంది. అదేవిధంగా 1990 ఆసియాడ్‌లో 3, 1994లో ఒకటి రజితాలు గెలుచుకుంది. 1984 లాస్‌ ఏంజిల్స్‌ ఒలింపిక్స్‌లో 400 మీటర్ల హార్డిల్స్‌ పరుగు పందెంలో సెకనులో వందోవంతులో కాంస్య పతకం లభించే అవకాశం కోల్పోయిననూ ఒలింపిక్స్‌ అథ్లెటిక్స్‌లో ఫైనల్స్‌ చేరిన తొలి భారతీయ మహిళగా రికార్డు సృష్టించింది. ఇంతటి ఖ్యాతిని భారతదేశానికి అందించినందుకు ఈమెను 1985లో పద్మశ్రీ, అర్జున అవార్డులతో సత్కరించింది.

ఇటువంటి మహాన్నత విలువలున్న మన మహిళలు తాజాగా ట్రస్‌ రీసెర్చ్‌ అడ్వయిజరీ వారి పరిశోధనల్లో కూడా భారత దేశపు అత్యంత నమ్మకమైన మహిళా మణులుగా ఎంపికై రికార్డ్‌ని మరొకమారు తిరగ రాసారని చెప్పవచ్చు.

For more details : see wikipedia.org - P.T.Usha
  • =========================
 Visit my website - > Dr.seshagirirao.com/

No comments:

Post a Comment

Thanks for your comment & feedback.