సర్ధార్ పటేల్ జయంతి: లాడ్‌బాయి, ఝవేవిభాయ్ దంపతులకు తేది 31-10- 1875వ సంవత్సరంలో జన్మించారు సర్ధార్ వల్లభాయ్ పటేల్. ఇంగ్లండ్‌లో బారిస్టర్ పట్టాపుచ్చుకున్నారు. గాంధీజీ ఆశయాలకు అనుగుణంగా గుజరాతీ విద్యా పీఠాన్ని స్థాపించాడు. 1931లో కాంగ్రెస్ మహా సభకు అధ్యక్షునిగా ఎన్నికయ్యాడు. 547 దేశీయ సంస్థానాలను ఇండియన్ యూనియన్‌లో విలీనం చేసిన కార్యశూరుడు.స్వాతంత్య్రానంతరం ఉపప్రధానిగా పని చేశాడు.
1928లో బర్దోలీ సత్యాగ్రహ సందర్భంలో బ్రిటీష్ ప్రభుత్వమే రాజీకి వచ్చే విధంగా చేసిన పటేల్ సాహసాన్ని ప్రశంసి స్తూ... గాంధీజీ ఆయనను సర్దార్ అని సంబోధించారు. నాటి నుండి వల్ల భాయ్ పటేల్ పేరు సర్దార్ పటేల్‌గా స్థిరపడిపో యింది. పటేల్ హోం మంత్రిగా ఉన్నప్పుడే హైదరాబాద్ నిజాం సంస్థానంపై పోలీస్ చర్య జరిగింది. ఉక్కుమనిషి (ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా), ఇండియన్ బిస్మార్క్ అనే బిరు దులు ఉన్న సర్ధార్ పటేల్ డిసెంబర్ 15, 1950వ సంవత్సరంలో మరణించారు. 1991లో పటేల్ దేశానికి చేసిన సేవలను గుర్తిస్తూ... భారత అత్యున్నత పౌరపురస్కారం ''భారతరత్న'' ను ప్రకటించింది (మరణానంతరం).
- మరింత సమాచారము కోసము -> సర్ధార్ వల్లభాయ్ పటేల్
- ====================================
Visit my website - > Dr.seshagirirao.com/
No comments:
Post a Comment
Thanks for your comment & feedback.