- image : courtesy with http://wikipedia.org/
జయంతి: 30-4-1870 .దాదాసాహెబ్ దుండిరాజ్ గోవింద ఫాల్కే మహారాష్టల్రోని త్రయంబకేశ్వర్‌లో జన్మించారు. పురావస్తు శాఖలో డ్రాఫ్ట్‌సమన్‌గా, ఫోటోగ్రాఫర్‌గా పనిచేశారు. 3-5-1913న ఫాల్కే మొదటి చిత్రం ‘రాజాహరిశ్చంద్ర’ విడుదలైంది. అదే మొట్టమొదటి భారతీయ కథా (మూకీ) చలన చిత్రం. అందువల్లనే ఫాల్కే భారతీయ చలన చిత్ర పితామహుడుగా పేరుపొందారు. 1914లో ఆయన రెండవ చిత్రం ‘మోహినీ భస్మాసుర’ విడుదలయింది. ఆయన నిర్మించిన చివరి చిత్రాలు ‘సేతుబంధన్’, ‘గంగావతరణ్’, ఫాల్కే పేరిట కేంద్ర ప్రభుత్వం చలన చిత్ర రంగానికి విశిష్టసేవలు చేసిన కళాకారులకు, సాంకేతిక నిపుణులకు ప్రతి సంవత్సరం అవార్డు ఇస్తోంది.
దాదాసాహెబ్ ఫాల్కే (మరాఠీ ) - ఒక భారతీయ సినీ నిర్మాత, దర్శకుడు, స్క్రీన్‌ప్లే-రచయిత, భారతీయ సినిమా పితామహుడు అని కూడా ప్రసిద్ధి. ఇతడు తన జీవితంలో 95 ఫీచర్ ఫిల్మ్ లు, నిర్మించాడు. మరణము - ఫిబ్రవరి 16, 1944. .1966లో ఇతని పేరు మీద దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, భారత ప్రభుత్వంచే స్థాపించబడినది. రాజా హరిశ్చంద్ర 1913, దాదాసాహెబ్ ఫాల్కేచే దర్శకత్వం వహింపబడినది.
సినీ ప్రస్థానం
* రాజా హరిశ్చంద్ర (1913)
* శ్రీ కృష్ణ జన్మ (1918)
* కలియా మర్దాన్ (1919)
* సేతు బంధన్ (1923)
* గంగావతరన్ (1937)
- ========================================
Visit my website - > Dr.seshagirirao.com/
No comments:
Post a Comment
Thanks for your comment & feedback.