Saturday, January 7, 2012

మొరార్జీ దేశాయి , Morarji Desai



మానవులు పుడతారు ... చనిపోతారు . కొంతమంది మాత్రమే తమ జీవితం లో ప్రజలకు ఉపయోగపడే సేవాకార్యక్రమాలు చేసి తమ జీవితాన్నే ఫణం గా పెట్టి మానవ జాతిలో చిరస్థాయిగా తరతరాలుగా నిలిచిపోతారు ... వీరిని "మృతంజీవులు" అని అంటారు . కోటాను కోట్ల జనం లో బహు కొద్ది మంది మాత్రమే ఇలాంటివారు ఉంటారు . ప్రపంచము లో ప్రతి జాతి లోనూ ఈ తరహా మహానుభావులు పుట్టి తమ సేవలతో పుణీతులయ్యారు . తెలుగు జాతికి మణిపూసలైన కొందరి మహానుభావులను తెలుసుకునే ప్రయత్నం లో ఇక్కడ -మొరార్జీ దేశాయి , Morarji Desai- గురించి తెలుసుకొని మన జీవితాన్ని చక్కని మార్గములో ప్రయాణించే ప్రయత్నం చేద్దాము ....


మొరార్జీజీ దేశాయి - భారతీయ స్వాతంత్ర్య సమర యోధుడు మరియు భారత దేశ తొలి కాంగ్రేసేతర ప్రధాన మంత్రి. భారత్ మరియు పాకిస్తాన్ దేశాల అత్యున్నత పౌర పురస్కారాలైన భారత రత్ననూ, నిషానే పాకిస్తాన్ నూ పొందిన ఏకైక భారతీయుడు. నాకన్నా ముందే చనిపోడని చరణ్ సింగ్ కు అంతనమ్మకమేమిటి? ఏడాదిలో ఇద్దరు లోక్ సభ సభ్యులు చనిపోతారు అని చెప్పాడట. మురార్జీ 99 ఏళ్ళు బ్రతికారు. మొరార్జీ దేశాయి బక్క పలచగా ఉంటాడు


  • వ్యక్తిగత వివరాలు
Morarji Ranchhodji దేశాయ్ (గుజరాతీ) - మొరార్జీ దేశాయి బాంబే ప్రెసిడెన్సీ లోని Bhadeli (Valsad)లో ఒక Anavil బ్రాహ్మణ కుటుంబం, (ఇప్పుడు గుజరాత్) లో ఫిబ్రవరి 29, 1896 న జన్మించారు. ప్రాథమిక పాఠశాల జీవితం సౌరాష్ట్ర Kundla స్కూల్, Savarkundla లలో జరిగినది .ముంబాయ్ విల్షన్‌ కాలేజీ లో డిగ్రీ పూర్తిచేసి గుజరాత్ సివిల్ సర్వీస్ లో చేరారు . 1924 లో బ్రిటిష్ సివిల్ సర్వీస్ ను వదిలి 1930 లో బ్రిటిష్ ప్రభుత్వ వ్యతిరేక ఉధ్యమములో చేరారు . స్వాతంత్ర సమరయోధుడుగా చాలా సంవత్సరాలు జైలులో ఉన్నారు . గుజరాత్ లో ఇండియన్‌ నేషనల్ కాంగ్రెస్ లో ప్రముఖ నాయకుడు గా చలామని అయ్యేవారు . 1934 మరియు 1937 లో బొంబే ప్రసిడెన్సీ లో రెవిన్యూ , మరియు హోం మినిష్టర్ గా సేవలందించారు . 1952 లో బోంబే స్టేట్ ముఖ్యమంత్రి అయ్యారు . maraaThii భాషా రాస్టం ఏర్పాటులో ప్రముఖ పాత్ర పోషించారు .

  • రాజకీయ జీవితమము :

కాంగ్రెస్ పార్టీలో జాతీయ నాయకుడైనా ప్రధానమంత్రి జవర్లాల్ నెహౄ తోను అతని సహచరులతోను విభేదాలుండేవి. 1964 లో నెహ్రూ మరణాంతరము తను ప్రధానమంత్రి రేసులో ఉన్నా ... తనను కాదని నెహ్రూ అనుచరుడు లాల్ బహదూర్ శాస్త్రి నే ప్రధానమంత్రిని చేసారు . శాస్త్రి మరణాంతరము 1966 లో ప్రధానమంత్రిగా పోటీలో ఉండి ఇందిరా గాంధీ తో నెగ్గలేక 169/351 ఓట్ల తేడాతో వెనుదిరగవల్ససి వచ్చింది .

1975 లో విధించబడిన అత్యవసర పరిస్థితి 1977 ఫిబ్రవరి - మార్చ్ నెలలలో జరిగన ఎన్నికలలో తీవ్ర ప్రభావాన్ని చూపింది. 30 సంవత్సరాలపాటు నిరంతరాయంగా సాగిన కాంగ్రెస్ పాలన అంతమయింది. కాంగ్రసేతర ప్రభూత్వం అధికారం చేపట్టింది. కాంగ్రెస్ (ఒ), భారతీయ లోక్ దళ్, జనసంఘ్, సోషలిస్టు పార్టీలు జనతాపార్టీ పేరుతో ఒకటయ్యాయి.మొరార్జీ దేశాయ్ ఆ పార్టీ అధ్యక్షుడయ్యాడు. మాజీ మంత్రి జగజ్జీవన్ రామ్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి డెమొక్రటిక్ కాంగ్రెస్ అనే కొత్త పార్టీ స్థాపించాడు. జనతాపార్టీతో ఒక అవగాహనకు వచ్చాడు. ఫిబ్రవరి 16_మార్చ్ 10వ తేదీ మధ్య జరిగిన న్నికలలో జనతాపార్టీ దాని మిత్రపక్షాలు మెజారిటీ సాధించాయి. ఇందిరాగాంధీ- రాయ్ బెరీలో ఒడిపోయింది. మార్చ్ 21వ తేదీ అత్యవసర పరిస్థితి పసంహరించుకో బడింది. మార్చ్ 24వ తేది మొరార్జీ దేశాయి ప్రధానమంత్రి పదవీ బాధ్యతలు స్వీకరించాడు. .


మరణము – ఏప్రిల్ 10, 1995
  • ==============================
Visit my website - > Dr.seshagirirao.com/

No comments:

Post a Comment

Thanks for your comment & feedback.