Wednesday, January 26, 2011

స్వామి వివేకానంద, Swami Vivekananda


స్వామి వివేకానంద జయంతి : జనవరి 12, 1863వ సంవత్సరంలో కలకత్తాలో జన్మిం చారు స్వామి వివేకానంద. వీరి అసలుపేరు నరేంద్రనాథ్‌ దత్‌. తల్లిదండ్రులు భువనేశ్వరీ దేవి, విశ్వనాథ్‌ దత్‌. వివిధ మత సిద్ధాంతా లను ఆకలింపు చేసుకున్న ఆయన కొంత కాలం బ్రహ్మసమాజం ప్రభావంలో గడిపాడు. రామకృష్ణ పరమహంస మరణానంతరం సన్యాసం స్వీకరించి వివేకానందుడయ్యాడు. హిమాలయాలకు వెళ్ళి ఆరేళ్ళపాటు ధ్యానం లో గడిపాడు. 1893లో చికాగోలో జరిగిన సర్వమత సమ్మేళనానికి హిందూమత ప్రతినిధి గా హాజరయ్యాడు. ఆ తరువాత ఇంగ్లాండ్‌, శ్రీలంక, స్టిట్జర్లాండ్‌ మొదలైన దేశాలు పర్య టించి ఉపన్యసించాడు. ఇంగ్లాండ్‌లో ఆమె శిష్యురాలిగా మారి ఇండియాకు వచ్చిన మార్గ రెట్‌ నోబుల్‌ ఆ తరువాత సిస్టర్‌ నివేదితగా మారింది. రామకృష్ణమిషన్‌ అనే సంస్థను స్థాపించాడు. ‘రాజయోగం’ మొదలైన గ్రంథా లను రచించాడు. కలకత్తా సమీపంలోని బేలూరులో జులై 4, 1902వ సంవత్సరంలో మరణించాడు.

For details about Swami Vivekananda in Telugu --> Swami Vivekananda స్వామి వివేకానంద
  • ========================================
Visit my website - > Dr.seshagirirao.com

No comments:

Post a Comment

Thanks for your comment & feedback.