Tuesday, January 25, 2011

నేతాజీ సుభాష్‌ చంద్ర బోస్, Netaji Subhas Chandra Bose

నేతాజీ సుభాష్‌ చంద్ర బోస్‌ జయంతి: 24-01-1897.

ప్రభావతి, జనకీనాథ్‌ బోస్‌ దంపతులకు తేదీ 24-01-1897వ సంవత్సరంలో ఒరిస్సాలో ని కట్‌ లో జన్మించాడు నేతాజీ సుభాష్‌ చం ద్రబోస్‌ 1920 లండన్‌లో ఇండియన్‌ సివిల్‌ సర్వీస్‌ పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడు. చిత్తరంజన్‌ దాస్‌ ఈయనకు మార్గదర్శి. స్వాతంత్య్రోద్య మంలో పాల్గొని 1921లో అరెస్టయ్యాడు. కాంగ్రెస్‌లో కొంతకాలం కొనసాగిన తరువాత ఫార్వర్డ్‌ బ్లాక్‌ అనే పార్టీని స్థాపించాడు. 1941 లో బ్రిటీష్‌ పోలీసుల కన్నుగప్పి ఇంటి నుంచి అదృశ్యమయ్యాడు.

జర్మనీలోని ఒక జలాంత ర్గామిలో 90 రోజులు ప్రయాణించి ఆఫ్రికాను ప్రదక్షిణం చేసి హందూ మహాసముద్రం మీ దుగా జపాన్‌ చేరుకున్నాడు. 1943లో ఇండి యన్‌ నేషనల్‌ ఆర్మీ (ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌) కి సర్వసైన్యాధిపతిగా నాయక త్వం వహించాడు. ‘యాన్‌ ఇండియన్‌ పిలిగ్రిమ్‌’ పేరుతో ఆత్మక థను రాశాడు. ఈయన ఫార్మోసా వెళుతున్న సమయంలో విమానం కూలిపోవటంతో మర ణించాడని అంటారు. ఆ ప్రమాదంలో వీరు మరణించి ఉండకపో వచ్చునని కొందరి అభిప్రాయం.

మరికొంత సమాచారము కోసం - > వికీపిడియాలో నేతాజీ సుబాష్ చంద్రబోస్

  • ========================================
Visit my website - > Dr.seshagirirao.com

No comments:

Post a Comment

Thanks for your comment & feedback.