Sunday, December 16, 2012

Pandit RaviSankar-పండిట్‌ రవిశంకర్‌

  •  
  •  

మానవులు పుడతారు ... చనిపోతారు . కొంతమంది మాత్రమే తమ జీవితం లో ప్రజలకు ఉపయోగపడే సేవాకార్యక్రమాలు చేసి తమ జీవితాన్నే ఫణం గా పెట్టి మానవ జాతిలో చిరస్థాయిగా తరతరాలుగా నిలిచిపోతారు ... వీరిని "మృతంజీవులు" అని అంటారు . కోటాను కోట్ల జనం లో బహు కొద్ది మంది మాత్రమే ఇలాంటివారు ఉంటారు . ప్రపంచము లో ప్రతి జాతి లోనూ ఈ తరహా మహానుభావులు పుట్టి తమ సేవలతో పుణీతులయ్యారు . భారత జాతికి మణిపూసలైన కొందరి మహానుభావులను తెలుసుకునే ప్రయత్నం లో ఇక్కడ --పండిట్‌ రవిశంకర్‌-- గురించి తెలుసుకొని మన జీవితాన్ని చక్కని మార్గములో ప్రయాణించే ప్రయత్నం చేద్దాము ....


  ప్రముఖ సితార్‌ విద్వాంసుడు పండిట్‌ రవిశంకర్‌(92) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన అమెరికాలోని శాండియాగోలోని స్క్రిప్స్‌ మెర్సీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఏప్రిల్‌ 7, 1920లో వారణాసిలో జన్మించిన రవిశంకర్‌ హిందుస్థాని క్లాసికల్‌ సంగీతంలో పలు అవార్డులు అందుకున్నారు. మూడు సార్లు గ్రామీ పురస్కారం పొందారు. 1999లో రవిశంకర్‌ను ప్రభుత్వం అత్యున్నత పురస్కారం 'భారత రత్న'తో సత్కరించింది.


రవిశంకర్‌ అసలు పేరు రబింద్రో శౌంకోర్‌ చౌదురి. తన బాల్యంలో నృత్యం నేర్చుకునేందుకు సోదరుడు ఉదయ్‌శంకర్‌తో కలిసి యూరప్‌ వెళ్లాడు. 1938లో నృత్యాన్ని పక్కనబెట్టి సితార్‌ నేర్చుకోవడానికి అల్లాద్దిన్‌ ఖాన్‌ అనే విద్వాంసుడి వద్ద చేరాడు. 1944లో చదువు అనంతరం మ్యూజిక్‌ కంపోజర్‌గా జీవితాన్ని ప్రారంభించి సత్యజిత్‌రే 'అప్పు' చిత్రానికి పనిచేశారు. 1949 నుంచి 1956 వరకు సంగీత దర్శకునిగా ఢిల్లీ ఆల్‌ ఇండియా రేడియోకు సేవలు అందించారు.


1956 నుంచి యూరప్‌, అమెరికాలో హిందుస్థాని క్లాసికల్‌ సంగీత ప్రదర్శనలు ఇవ్వడం ప్రారంభించారు. బోధన, పదర్శనల ద్వారా హిందుస్థాని క్లాసికల్‌ సంగీతానికి ప్రపంచవ్యాప్త గుర్తింపు తీసుకువచ్చారు. తన కూతురు అనౌష్కతో కలిసి సంగీత ప్రదర్శనలు ఇచ్చారు. 2003లో అనౌష్క తన మ్యూజిక్‌ అల్బమ్‌ ద్వారా గ్రామీ అవార్డుకు నామినేట్‌ అయ్యారు.

అవార్డులు:

1975లో యునెస్కో సంగీత పురస్కారం
1981లో పద్మవిభూషణ్‌ పురస్కారం
1988లో కాళిదాస్‌ సమ్మాన్‌ పురస్కారం
1992లో రామన్‌ మెగసేసే పురస్కారం
1999లో అత్యున్నత పురస్కారం భారతరత్న

1986 నుంచి 1992 వరకూ రాజ్యసభలో నామినేటెడ్‌ సభ్యునిగా వ్యవహరించారు.

  • ========================
 Visit my website - > Dr.seshagirirao.com/

No comments:

Post a Comment

Thanks for your comment & feedback.