Thursday, August 4, 2011

బంకించంద్ర ఛటర్జీ , Bankim Chandra Chatterjee


  • photo : courtesy - Wikipedia.org/

మానవులు పుడతారు ... చనిపోతారు . కొంతమంది మాత్రమే తమ జీవితం లో ప్రజలకు ఉపయోగపడే సేవాకార్యక్రమాలు చేసి తమ జీవితాన్నే ఫణం గా పెట్టి మానవ జాతిలో చిరస్థాయిగా తరతరాలుగా నిలిచిపోతారు ... వీరిని "మృతంజీవులు" అని అంటారు . కోటాను కోట్ల జనం లో బహు కొద్ది మంది మాత్రమే ఇలాంటివారు ఉంటారు . ప్రపంచము లో ప్రతి జాతి లోనూ ఈ తరహా మహానుభావులు పుట్టి తమ సేవలతో పుణీతులయ్యారు . తెలుగు జాతికి మణిపూసలైన కొందరి మహానుభావులను తెలుసుకునే ప్రయత్నం లో ఇక్కడ -బంకించంద్ర ఛటర్జీ , Bankim Chandra Chatterjee- గురించి తెలుసుకొని మన జీవితాన్ని చక్కని మార్గములో ప్రయాణించే ప్రయత్నం చేద్దాము ....


  • 26-6-1838న బెంగాల్‌లోని కంతల్‌పు రాలో జన్మించారు బంకించంద్ర ఛటర్జీ. బెంగాల్‌లో మొదటగా బి.ఏ డిగ్రీ పొందిన వ్యక్తి ఈయనే కావడం విశేషం. తండ్రివలెనే ఈయన కూడా డిప్యూటీ కలెక్టరయ్యాడు. స్వస్థాన వేష భాషల పట్ల గౌరవాభిమానాలు కలవాడు. ఇరవై ఏళ్ళు నిండకముందే ‘లలిత ఓ మానస్‌’ అనే కవితా సంపుటి రచించాడు. దుర్గేశ్‌ నందిని, కపాలకుండల, మృణాళిని, దేవీ చౌధురాణి మొ దలైన 15 నవలలు రాశాడు. దేశాన్ని మాతృమూర్తిగా సంబో ధిస్తూ... దేశభక్తిని ప్రబోధిస్తూ... ‘వందేమాతరం’ గేయం రాసిన తర్వాత దానిని ‘ఆనంద్‌మఠ్‌’ న వలలో పొందుపరిచాడు. ఈ న వల వివిధ భారతీయ భాషలలో నికి అనువదించబడడం వలన ఈ గేయం దేశవ్యాప్తంగా ప్రచా రాన్ని పొందింది. ఈ గేయాన్ని బహిరంగంగా గానం చేయటాన్ని నాటి ప్రభు త్వం నిషేధించింది. ఈ గేయానికి రవీంద్రుడు బాణీకట్టి నిషేధాజ్ఞలను ఉల్లంఘించి 1896 కాంగ్రెస్‌ సభలలో గానం చేశాడట.

For full details -->బంకించంద్ర ఛటర్జీ , Bankim Chandra Chatterjee
  • ========================================
Visit my website - > Dr.seshagirirao.com/

No comments:

Post a Comment

Thanks for your comment & feedback.