16-07-1972న భారత పోలీస్ వ్యవస్థలోనే సంచలనం చోటు చేసుకుంది. దేశ చరిత్రలోనే తొలిసారిగా ఒక మహిళ ఐపీఎస్ ఆఫీసర్‌గా బాధ్యతలు స్వీక రించింది. అమృత్‌సర్‌కు చెందిన డా కిరణ్ బేడి ఈ ఘనత సాధించి చరిత్ర సృష్టించింది.పంజాబ్ విశ్వవిద్యాలయం నుండి రాజనీతి శాస్త్రంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన కిరణ్ బేడి ఢిల్లీ ఐఐటీ సోషల్ సైన్సెస్ విభాగం నుండి డాక్టర్‌ను కూడా పూర్తి చేసింది. ఢిల్లీ డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ (ట్రాఫిక్)గా ధైర్యసాహసాలతో తన బాధ్యతలను నిర్వహిం చింది. 9 వేల మంది ఖైదీలున్న తీహార్ జైలు కు బదిలీ అయ్యాక అక్కడ ఖైదీల పట్ల సేవాదృ క్పథాన్ని ప్రదర్శించింది. ఎన్నో సంస్కరణలు చేసింది. ఈమె సేవలకు గుర్తింపుగా 1994లో రామన్ మెగసెసె అవార్డు లభించింది. ఐక్యరా జ్య సమితి ప్రధాన కార్యదర్శికి పౌర పోలీస్ సలహాదారుగా నియమింపబడిన తొలి మహిళ కిరణ్ బేడీ నే కావడం విశేషం. ‘ఐ డేర్’ పేరుతో తన ఆత్మకథను కూడా రాసుకున్నారు కిరణ్ బేడీ.
for more details ->
Dr.Kiran bedi IPS- ========================================
Visit my website - >
Dr.seshagirirao.com
No comments:
Post a Comment
Thanks for your comment & feedback.