Saturday, July 30, 2011

ఈశ్వరచంద్ర విద్యాసాగర్ , EswarachandraVidhyasagar



మానవులు పుడతారు ... చనిపోతారు . కొంతమంది మాత్రమే తమ జీవితం లో ప్రజలకు ఉపయోగపడే సేవాకార్యక్రమాలు చేసి తమ జీవితాన్నే ఫణం గా పెట్టి మానవ జాతిలో చిరస్థాయిగా తరతరాలుగా నిలిచిపోతారు ... వీరిని "మృతంజీవులు" అని అంటారు . కోటాను కోట్ల జనం లో బహు కొద్ది మంది మాత్రమే ఇలాంటివారు ఉంటారు . ప్రపంచము లో ప్రతి జాతి లోనూ ఈ తరహా మహానుభావులు పుట్టి తమ సేవలతో పుణీతులయ్యారు . తెలుగు జాతికి మణిపూసలైన కొందరి మహానుభావులను తెలుసుకునే ప్రయత్నం లో ఇక్కడ -ఈశ్వరచంద్ర విద్యాసాగర్ - గురించి తెలుసుకొని మన జీవితాన్ని చక్కని మార్గములో ప్రయాణించే ప్రయత్నం చేద్దాము ....

ఈశ్వరచంద్ర విద్యాసాగర్ కవి, రచయిత, విద్యావేత్త, తత్వవేత్త, సమాజ సేవకుడు. ఈయన బెంగాలీ లిపిని 1780 తర్వాత మొదటిసారి క్రమబద్ధీకరించాడు. ఈశ్వరచంద్ర విద్యాసాగర్... బిర్సింగా గ్రామం (నేటి పశ్చిమ బెంగాల్) లో నిరుపేద కుటుంబంలో జన్మించాడు. బాల్యమంతా పేదరికంలో గడుపుతూ కూడా ఎంతో పుస్తక జ్ఞానాన్ని పొందాడు. తండ్రి సంస్కృత ఉపాధ్యాయుడు కావటంతో కొడుకు కూడా అదే వృత్తిని చేపట్టాడు. గ్రామంలో ప్రారంభమయిన ఈశ్వరచంద్ర విద్యాభ్యాసం ఆ తర్వాత తండ్రి కోల్‌కతాలో ఉద్యోగంలో చేరటంతో అక్కడ కొనసాగింది.
1839లో హిందూ న్యాయ శాస్త్రంలో ఉత్తీర్ణుడై ‘విద్యాసాగర్’ అనే బిరుదును పొందాడు. రెండు సంవత్సరాల తర్వాత పోర్టు విలియమ్ కాలేజీలో ప్రధాన సంస్కృత పండిత పదవిని పొందాడు. అక్కడ ఆయన... అన్ని కులాలకు సంస్కృతం నేర్పాలని,మహిళలను ప్రోత్సహించాలని పోరాటం ప్రారంభించాడు. ఆ తర్వాత స్కూల్ ఇన్‌స్పెక్టర్ పదవిలో ఉండగా కొత్తగా ఇరవై స్కూళ్లను స్థాపించాడు. కొంతకాలం తర్వాత పోర్టు విలియమ్ కాలేజీ మూతపడింది.

కోల్‌కతా విశ్వవిద్యాలయం ప్రారంభం కావడంతో ఈశ్వరచంద్ర దానికి స్థాపక సభ్యుడయ్యాడు. ఆయన అప్పటికే మహిళల హక్కుల కోసం పోరాటం ప్రారంభించాడు. ఈశ్వరచంద్ర విశాలహృదయం, ఔన్నత్యం కలవాడని అతని గురించి తెలిసిన వారందరూ అంగీకరిస్తారు.

సమాజంలోని పేదవారి మీద కనికరం చూపి వారికి సహాయం చేసేవాడు. చిన్నపెద్ద అందరికీ వినయం, సహనం నేర్పేవాడు. స్వామి వివేకానంద ఈశ్వరచంద్ర గురించి మాట్లాడుతూ ‘‘ఉత్తర భారతంలో విద్యాసాగర్ నీడ సోకని నా వయసువాడు ఎవ్వడూ లేడు’’ అన్నాడంటే ఈశ్వరచంద్ర ఖ్యాతిని అర్థం చేసుకోవచ్చు.

పూర్తి వివరాలకోసం --> ఈశ్వరచంద్ర విద్యాసాగర్
  • ========================================
Visit my website - > Dr.seshagirirao.com/

No comments:

Post a Comment

Thanks for your comment & feedback.