Saturday, July 30, 2011

ఈశ్వరచంద్ర విద్యాసాగర్ , EswarachandraVidhyasagar



మానవులు పుడతారు ... చనిపోతారు . కొంతమంది మాత్రమే తమ జీవితం లో ప్రజలకు ఉపయోగపడే సేవాకార్యక్రమాలు చేసి తమ జీవితాన్నే ఫణం గా పెట్టి మానవ జాతిలో చిరస్థాయిగా తరతరాలుగా నిలిచిపోతారు ... వీరిని "మృతంజీవులు" అని అంటారు . కోటాను కోట్ల జనం లో బహు కొద్ది మంది మాత్రమే ఇలాంటివారు ఉంటారు . ప్రపంచము లో ప్రతి జాతి లోనూ ఈ తరహా మహానుభావులు పుట్టి తమ సేవలతో పుణీతులయ్యారు . తెలుగు జాతికి మణిపూసలైన కొందరి మహానుభావులను తెలుసుకునే ప్రయత్నం లో ఇక్కడ -ఈశ్వరచంద్ర విద్యాసాగర్ - గురించి తెలుసుకొని మన జీవితాన్ని చక్కని మార్గములో ప్రయాణించే ప్రయత్నం చేద్దాము ....

ఈశ్వరచంద్ర విద్యాసాగర్ కవి, రచయిత, విద్యావేత్త, తత్వవేత్త, సమాజ సేవకుడు. ఈయన బెంగాలీ లిపిని 1780 తర్వాత మొదటిసారి క్రమబద్ధీకరించాడు. ఈశ్వరచంద్ర విద్యాసాగర్... బిర్సింగా గ్రామం (నేటి పశ్చిమ బెంగాల్) లో నిరుపేద కుటుంబంలో జన్మించాడు. బాల్యమంతా పేదరికంలో గడుపుతూ కూడా ఎంతో పుస్తక జ్ఞానాన్ని పొందాడు. తండ్రి సంస్కృత ఉపాధ్యాయుడు కావటంతో కొడుకు కూడా అదే వృత్తిని చేపట్టాడు. గ్రామంలో ప్రారంభమయిన ఈశ్వరచంద్ర విద్యాభ్యాసం ఆ తర్వాత తండ్రి కోల్‌కతాలో ఉద్యోగంలో చేరటంతో అక్కడ కొనసాగింది.
1839లో హిందూ న్యాయ శాస్త్రంలో ఉత్తీర్ణుడై ‘విద్యాసాగర్’ అనే బిరుదును పొందాడు. రెండు సంవత్సరాల తర్వాత పోర్టు విలియమ్ కాలేజీలో ప్రధాన సంస్కృత పండిత పదవిని పొందాడు. అక్కడ ఆయన... అన్ని కులాలకు సంస్కృతం నేర్పాలని,మహిళలను ప్రోత్సహించాలని పోరాటం ప్రారంభించాడు. ఆ తర్వాత స్కూల్ ఇన్‌స్పెక్టర్ పదవిలో ఉండగా కొత్తగా ఇరవై స్కూళ్లను స్థాపించాడు. కొంతకాలం తర్వాత పోర్టు విలియమ్ కాలేజీ మూతపడింది.

కోల్‌కతా విశ్వవిద్యాలయం ప్రారంభం కావడంతో ఈశ్వరచంద్ర దానికి స్థాపక సభ్యుడయ్యాడు. ఆయన అప్పటికే మహిళల హక్కుల కోసం పోరాటం ప్రారంభించాడు. ఈశ్వరచంద్ర విశాలహృదయం, ఔన్నత్యం కలవాడని అతని గురించి తెలిసిన వారందరూ అంగీకరిస్తారు.

సమాజంలోని పేదవారి మీద కనికరం చూపి వారికి సహాయం చేసేవాడు. చిన్నపెద్ద అందరికీ వినయం, సహనం నేర్పేవాడు. స్వామి వివేకానంద ఈశ్వరచంద్ర గురించి మాట్లాడుతూ ‘‘ఉత్తర భారతంలో విద్యాసాగర్ నీడ సోకని నా వయసువాడు ఎవ్వడూ లేడు’’ అన్నాడంటే ఈశ్వరచంద్ర ఖ్యాతిని అర్థం చేసుకోవచ్చు.

పూర్తి వివరాలకోసం --> ఈశ్వరచంద్ర విద్యాసాగర్
  • ========================================
Visit my website - > Dr.seshagirirao.com/

ప్రసిద్ధ పారిశ్రామికవేత్త జె.ఆర్‌.డి.టాటా , J.R.D.Tata






J.R.D.Tata భారతీయ వ్యాపార వ్యవస్థను కొత్తపుంతలు తొక్కించిన వ్యాపా ర దిగ్గజం, టాటా సామ్రాజ్యాన్ని మరింత విస్తరింపజేసిన - జెహంగిర్‌ రతన్‌జీ దాదాబాయ్‌ టాటా.... తేదీ 29 జూలై 1904న పారిస్‌లో జన్మించారు.

1877 లో జెమ్‌షెట్‌జీ టాటా ప్రారం భించిన వ్యాపారం పరిశ్రమలను ఈయన బాగా విస్తరింపజేశా రు. జెమ్‌షెట్‌జీ బావమరిది కుమారుడైన రతన్‌జీ, ఫ్రెంచ్‌ మహి ళ సుజానే బ్రెయిరీలకు జూలై 29, 1904వ సంవత్సరంలో జన్మించారు. ఈయన టాటా పగ్గాలు చేపట్టిన తరువాతనే టాటా స్టీల్‌, టాటా కెమికల్స్‌, హోటళ్ళు (తాజ్‌, లేక్‌ ప్యాలెస్‌) టైటాన్‌ వాచ్‌, టాటా టీ, లాక్మె మొదలైన సంస్థలు ఏర్పడ్డాయి. భారత దేశపు ప్రథమ ఎయిర్‌లైన్స్‌ అయిన ‘ఎయిర్‌ ఇండియా’ వ్యవస్థాప కుడు కూడా ఈయనే కావడం విశేషం. అనేక శాస్త్ర, సాంకేత సంస్థలను స్థాపించి ఆయా రంగాల వికాసానికి కృషి చేశారు. 1993లో ఆయన మరణా నంతరం భారత ప్రభుత్వం జె.ఆర్‌.డి.టాటాను ‘భారత రత్న’ పురస్కారంతో సత్కరించింది.

మరికొంత సమాచారము కొరకు -> J.R.D.Tata
  • ========================================
Visit my website - > Dr.seshagirirao.com

Monday, July 25, 2011

ఎమ్.ఎఫ్.హుసేన్,Maqbool Fida Husain





హుస్సేన్‌ను తన సమకాలికుల్లోకెల్లా ఉన్నతంగా నిలిపే అంశమేమిటంటే ఎటువంటి అంశాన్ని అయినా మనోహరంగా, వినూత్నమైన రీతిలో చిత్రించగలగడం. అన్ని రకాల కళా రూపాల్లోను ఆయనది అందెవేసిన చేయి. పోస్టర్ల తయారీ దగ్గర నుంచి అబ్బురపరిచే పెయింటింగ్స్‌, పిల్లల ఆటవస్తువుల తయారీ వరకు అన్నిటిలోనూ ఆయన విశేష ప్రావీణ్యం ప్రదర్శించారు. వలస పాలనలో రాజా రవి వర్మ మాదిరిగానే, ఆధునిక దృక్పథంతో సాంప్రదాయిక రీతులను మేళవిస్తూ జన రంజకంగా, ఆకట్టుకునేలా బొమ్మలు గీయడంలో హుస్సేన్‌ అనిర్వచనీయమైన కృషి చేశారు.

మక్బూల్ ఫిదా హుసేన్ జననం : 1915, పంఢర్‌పూర్, మహారాష్ట్ర , ఎమ్.ఎఫ్.హుసేన్ పేరుతో ప్రసిద్ధి. భారతదేశపు చిత్రకారుడిగా ప్రపంచ ప్రసిద్ధ్ గాంచాడు. దాదాపు 7 దశాబ్దాలుగా కళాకారుడిగా ప్రసిద్ధి. ఫోర్బ్స్ మేగజైన్ ప్రకారం "భారతీయ పికాసో" తన విజయవంతమైన ప్రస్థానంలో, 1996 లో వివాదాస్పదమైన సంఘటనలు చోటుచేసుకున్నాయి. 1970 లో హిందూ దేవతామూర్తులను నగ్నంగా చిత్రీకరించాడని అభియోగం. 96 ఏళ్ల నిండు జీవితం గడిపిన హుస్సేన్‌ జున్ 9(8) న లండన్ లొ(అక్కడి కాలమానం ప్రకారం తెల్లవారుఝ్హామున 2:30ని|| కు) అనారొగ్యం తో మరణించారు.. మాతృభూమి అయిన భారత్‌కు తిరిగిరాలేని స్థితిలో ఆయన తనువు చాలించారన్న వార్త ఎంతగానో బాధ కలిగించింది.

for full details _ see wikipedia.org -- ఎమ్.ఎఫ్.హుసేన్
  • ========================================

Visit my website - > Dr.seshagirirao.com

Thursday, July 14, 2011

కామరాజ్‌ నాడార్ , Kamaraj Nadar




మట్టిలోంచే మాణిక్యాలు వస్తాయి.ప్రజల నుండే నాయకులు వస్తారు. అలాంటి నాయకుల్లో తమిళనాడులోని తిన్నెవెల్లి జిల్లాలోని విరుదు నగర్‌ దగ్గర మారుమూల గ్రామంలో ఉన్న నిరుపేద కల్లుగీత కుటుంబంలో జన్మించినాడు కామరాజ్‌ నాడార్‌. తమిళనాడు కాంగ్రెస్‌ పార్టీలో అంచెలంచెలుగా ఎదిగి, జాతీయ కాంగ్రెస్‌ పార్టీకి జాతీయ అధ్యక్షుడిగా, ప్రధానమంత్రి ఇందిరా గాంధికి అత్యంత సన్నిహితుడిగా, జాతీయ కాంగ్రెస్‌ అస్తవ్యస్థంగా ఉన్న సమయంలో ఉండి... గరీబీ హఠావో, ఆరు సూత్రాల పథకాలను రూపొందించి- ప్రతి పేదవానికి ఇల్లు, భూమి, సంక్షేమ పథకాలను అందజేసి, కాంగ్రెస్‌ పార్టీని పేదల పార్టీగా మలచిన గొప్ప జాతీయ నాయకుడు కామరాజు నాడార్‌.

ఆయన రూపొందించిన మాస్టర్‌ ప్లాన్‌తో జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అఖండ విజయంతో గెలుపొందింది. అప్పటికే అనేక లుక లుకలతో ఉన్న జాతీయ కాంగ్రెస్‌ను ఒక్క తాటిపైకి తీసుకువచ్చి ఇందిరాగాంధీకి అత్యంత నమ్మకస్థుడిగా ఉన్న కామరాజ్‌ నాడార్‌ గొప్ప పోరాట యోధుడు. ప్రజల నుండి వచ్చి, పెద్దగా చదువుకోకున్నా ప్రజల జీవితాలను చదివినాడు కామరాజ్‌. నిరుపేద కల్లుగీత కుటుంబంలో పుట్టిన ఆయన ప్రజల కోసమే జీవితం అంకితం చేసి, పెళ్లి కూడా చేసుకోలేదు. ఆయన రాజకీయ శక్తిగా ఎదగడానికి కారణం చిన్నతనం నుండి రాజకీయాల పట్ల మక్కువ ఎక్కువగా ఉండడమే.

1929 నాటికే కామరాజ్‌ కాంగ్రెస్‌లో ప్రముఖ నాయకుడైన సత్యమూర్తికి సహచరుడిగా ఉండేవాడు.ఆయన సత్యమూర్తిని రాజకీయ గురువుగా భావించేవాడు. అంతేకాకుండా ప్రముఖ సంఘ సేవకుడు నారాయణ గురు ప్రభావం కామరాజ్‌ పై ఉండేది. బ్రాహ్మణ వ్యతిరేక పోరాటంలో ముందు ఉన్నాడు. తమిళనాట కల్లుగీత కులాలవారిని అంరాని జాతిగా చూసేవారు. గుడి, బడి, సామాజిక హోదా కోసం కామరాజ్‌ నాడార్‌ శక్తికొద్ది ఉద్యమాలు నడిపాడు. అనతి కాలంలోనే కల్లుగీత, ఇతర అణగారిన కులాల నాయకుడిగా ఎదిగాడు. ఇదే సమయంలో సత్యమూర్తితో కాంగ్రెస్‌ పార్టీ తరపున రాష్టమ్రంతటా తిరగడం ద్వారా మంచి అనుభవం, పలుకుబడి కలిగిన వ్యక్తిగా రూపొందాడు. అనంతర కాలంలో తమిళనాడు కాంగ్రెస్‌లో గొప్ప శక్తిగా ఎదిగాడు.

1930లో మహాత్మాగాంధీ చేపట్టిన ఉప్పు సత్యాగ్రహ ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్నాడు. అనేక సందర్భాలలో దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో 8 సంవత్సరాల పాటు జైలు శిక్ష అనుభవించాడు. 1931లో తమిళనాడు కాంగ్రెస్‌ పార్టీ శాఖ రాష్ట్ర అధ్యక్షుడయ్యాడు. 1937లో కాంగ్రెస్‌ అసెంబ్లీ నుండి పోటీ చేశాడు.చారిత్రక విరూద్‌నగర్‌, శివకాశి వంటి ప్రాముఖ్యం కలిగిన ప్టణాలు ఉన్న ఈ నియోజకవర్గంలో కల్లుగీత కులస్థులైన నాడార్లు ఎక్కువగా జస్టిస్‌ పార్టీలోనే ఉండేవారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ నుండి కామరాజ్‌ ఏకగ్రీవంగా ఎన్నిక కావడం జాతీయ కాంగ్రెస్‌ నాయకుల దృష్టికి వచ్చింది. దీనితో ఆయన ఇందిరాగాంధీకి దగ్గరయ్యాడు.

అదే సమయంలో తమిళనాడులో పెద్ద ఎత్తున సామాజిక ఉద్యమాలు వెల్లువెత్తాయి. తమిళనాడు ముఖ్యమంత్రి రాజగోపాలాచారి బహుజన కులాలకు వ్యతిరేక చర్యలు తీసుకోవడంతో పెరియార్‌ రామస్వామి పెద్ద ఆందోళన చేపట్టాడు. దానితో రాజగోపాలాచారి స్థానంలో కామరాజ్‌ నాడార్‌ ముఖ్యమంత్రి పదవిని అధిష్ఠించాడు. ఈ అవకాశాన్ని ఆయన సద్వినియోగం చేసుకున్నాడు. నిరుపేద కుటుంబం నుండి వచ్చిన కామరాజ్‌కు సామాన్యుల సమస్యలు తెలుసు కాబట్టి, వారి బాగు కోసం శక్తి మేరకు కృషి చేశాడు. విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చాడు. వెనుకబడిన కులాల జాబితాలోని అన్ని కులాలకు ఉద్యోగ, విద్యా రంగాల రిజర్వేషన్లలో, బడ్జెట్‌లో పెద్ద పీఠం వేయడం ఆయన కృషితోనే సాధ్యమయింది.

1954 నుండి 1963 వరకు కామరాజ్‌ నాడార్‌ తమిళనాడు ముఖ్యమంత్రిగా కొనసాగారు. బ్రాహ్మణులతో సమానంగా పరిపాలన చేసిన కామరాజ్‌ నాడార్‌ తమిళనాడు రాజకీయ చరిత్ర ను తిరగ రాశాడు. ఆ తర్వాత తమిళనాడులో అనేక సామాజిక కోణాల నుండి కొత్త రాజకీయ పార్టీలు పురుడు పోసుకున్నాయి.కామరాజ్‌ పరిపాలనను అన్ని వర్గాల వారు గౌరవించారు. ఆ తర్వాత కామరాజ్‌ నాడార్‌ 1969 నాటికి జాతీయ కాంగ్రెస్‌ రాజకీయాల్లో ప్రవేశించారు.జాతీయ కాంగ్రెస్‌ అత్యున్నత అధ్యక్ష బాధ్యతను కామరాజ్‌కు అప్పగించింది.

-ఇందిరా గాంధీని అఖండ మెజారిటీతో గెలిపించిన యోధుడు నాడార్‌. కామరాజ్‌ నాడార్‌ వంటి వ్యక్తులు పుట్టుకొచ్చిన ఈ దేశంలో- నేటి రాజకీయ నాయకులకు అటువంటివారి అవసరం లేదనేలా రాజకీయాలు మారాయి. ఎన్‌ఆర్‌ఐలు, పారిశ్రామికవేత్తలు విదేశాల నుంచే తమ రాజకీయ ఎన్నికల స్థానాలను రిజర్వు చేసుకుంటున్నారు. సామాన్యుడిని రాజకీయ శక్తిగా మలచే ప్రక్రియను ప్రారంభిస్తే ప్రజాస్వామ్యం పరిడవిల్లుతుంది.

--Written by Ambala Narayan goud.

  • ========================================
Visit my website - > Dr.seshagirirao.com

సునీల్ మనోహర్ గవాస్కర్ ,Sunil Manohar Gavaskar





1949 జూలై 10న జన్మించిన సునీల్ మనోహర్ గవాస్కర్ (Sunil Manohar Gavaskar) , భారతదేశానికి చెందిన ప్రముఖ క్రికెట్ క్రీడాకారుడు. సన్నీ అని ముద్దుగా పిల్వబడే ఈ ముంబాయి కి చెందిన బ్యాట్స్‌మెన్ 1970' , 1980' దశాబ్దాలలో భారత క్రికెట్ జట్టుకు ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ గా తన అపూర్వ సేవలందించాడు. తన హయంలో 34 టెస్టు సెంచరీలతో అత్యధిక టెస్ట్ సెంచరీలు సాధించిన క్రికెటర్ గా ప్రపంచ రికార్డు సృష్టించాడు.

For More details ->Sunik Gavaskar - Cricketer
  • ========================================
Visit my website - > Dr.seshagirirao.com

డా కిరణ్‌ బేడి, Dr.Kiran bedi



16-07-1972న భారత పోలీస్‌ వ్యవస్థలోనే సంచలనం చోటు చేసుకుంది. దేశ చరిత్రలోనే తొలిసారిగా ఒక మహిళ ఐపీఎస్‌ ఆఫీసర్‌గా బాధ్యతలు స్వీక రించింది. అమృత్‌సర్‌కు చెందిన డా కిరణ్‌ బేడి ఈ ఘనత సాధించి చరిత్ర సృష్టించింది.పంజాబ్‌ విశ్వవిద్యాలయం నుండి రాజనీతి శాస్త్రంలో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసిన కిరణ్‌ బేడి ఢిల్లీ ఐఐటీ సోషల్‌ సైన్సెస్‌ విభాగం నుండి డాక్టర్‌ను కూడా పూర్తి చేసింది. ఢిల్లీ డిప్యూటీ కమీషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ (ట్రాఫిక్‌)గా ధైర్యసాహసాలతో తన బాధ్యతలను నిర్వహిం చింది. 9 వేల మంది ఖైదీలున్న తీహార్‌ జైలు కు బదిలీ అయ్యాక అక్కడ ఖైదీల పట్ల సేవాదృ క్పథాన్ని ప్రదర్శించింది. ఎన్నో సంస్కరణలు చేసింది. ఈమె సేవలకు గుర్తింపుగా 1994లో రామన్‌ మెగసెసె అవార్డు లభించింది. ఐక్యరా జ్య సమితి ప్రధాన కార్యదర్శికి పౌర పోలీస్‌ సలహాదారుగా నియమింపబడిన తొలి మహిళ కిరణ్‌ బేడీ నే కావడం విశేషం. ‘ఐ డేర్‌’ పేరుతో తన ఆత్మకథను కూడా రాసుకున్నారు కిరణ్‌ బేడీ.

for more details -> Dr.Kiran bedi IPS
  • ========================================

Visit my website - > Dr.seshagirirao.com