Wednesday, October 5, 2011

కమలా నెహ్రూ , Kamala Nehru



మానవులు పుడతారు ... చనిపోతారు . కొంతమంది మాత్రమే తమ జీవితం లో ప్రజలకు ఉపయోగపడే సేవాకార్యక్రమాలు చేసి తమ జీవితాన్నే ఫణం గా పెట్టి మానవ జాతిలో చిరస్థాయిగా తరతరాలుగా నిలిచిపోతారు ... వీరిని "మృతంజీవులు" అని అంటారు . కోటాను కోట్ల జనం లో బహు కొద్ది మంది మాత్రమే ఇలాంటివారు ఉంటారు . ప్రపంచము లో ప్రతి జాతి లోనూ ఈ తరహా మహానుభావులు పుట్టి తమ సేవలతో పుణీతులయ్యారు . తెలుగు జాతికి మణిపూసలైన కొందరి మహానుభావులను తెలుసుకునే ప్రయత్నం లో ఇక్కడ -కమలా నెహ్రూ , Kamala Nehru- గురించి తెలుసుకొని మన జీవితాన్ని చక్కని మార్గములో ప్రయాణించే ప్రయత్నం చేద్దాము ....


పాత డిల్లీ లోని కాశ్మీరీ బ్రాహ్మిణ్ కుటుంబములో 01 ఆగస్ట్ 1899 సంవత్సరములో " రాజ్ పతి , జవహర్మాల్ కౌల్ దంపతులకు జన్మించారు .ఈమె తోడ ఇద్దరు తమ్ముళ్లు ..చాంద్ భహదూర్ కౌల్ , కైలాష నాథ్ కౌల్ , ఒక చెల్లెలు ..స్వరూప్ కథ్జు . 14 -11 - 1889 తేదిన పుట్టిన జవహర్ లాల్ నెహ్రూ గారి తో వివాహం 1916వ సంవత్సరం ఫిబ్రవరి 8న "కమలా నెహ్రూ" వివాహమయ్యింది. కమలా నెహ్రూ మామగారు -మోతీలాల్ నెహ్రూ. అత్తగారు -శ్రీమతి స్వరూప రాణి. ఇంటి పట్టునే ఉండే కమలానెహ్రూ 1921 లొ non-coperation movement లో వుమెన్‌ గ్రూప్ కి నాయకత్వము వహించి విదేసీ వస్తువులు దుస్తులు , మద్యము అమ్మకాలు చేయకూడదనే నినాదముతో ముందుకు సాగారు . రెండుసార్లు అరెస్ట్ అయ్యారు .

నెహ్రూ తండ్రి మోతీలాల్ నెహ్రూ కూడా కాంగ్రెస్ అధ్యక్షుడిగా వ్యవహరించారు. తండ్రితో కలసి నెహ్రూ కూడా కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటుండేవారు. దేశ స్వాతంత్ర్యం పోరాటం కోసం నెహ్రూ కుటుంబం ఆస్థినంతా దారపోసింది. చివరకు తన ఇంటిని సైతం కొంత భాగం హాస్పటల్ గా మార్చి స్వాతంత్ర్య పోరాటంలో గాయపడిన వారికి వైద్య చికిత్సలు అందించేవారు. 1917, నవంబర్ 19 తేదీన జవహర్ లాల్ నెహ్రూ, కమలా నెహ్రూ ల ఏకైక సంతానంగా అలహాబాద్ లో జన్మించిన ఇందిర అల్లారు ముద్దుగా పెరిగారు. ఇందిర బాల్యం అలహాబాదు లోనే గడిచింది. 1924 లో కమలానెహ్రూ ఒకబాబును కన్నారు . ప్రీ మెచ్యూర్ గా జన్మించడం వలన 2 రోజులలో బాబు చనిపోయాడు . 1934 లో జైలు నుండి విడుదలైన నెహ్రూ తిరిగి అరెస్టు కాబడి కలకత్తా, డెహ్రాడూన్‌ లలో జైలు జీవితాన్ని గడిపారు. ఈ సమయంలో నెహ్రూ ఆరోగ్యం పాడైంది. భర్త ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్న కమలా నెహ్రూ దిగులుతో అనారోగ్యానికి గురైంది. చికిత్స కోసం స్విట్జర్లాండ్‌ కు వెళ్లి 1936 లో టి.బి. జబ్బు మూలాన మరణించారు . మే 27 వ తేది 1964వ సంత్సరంలో పండిట్ నెహ్రూ భౌతికంగా మనకు దూరమయ్యారు. కమలా నెహ్రూ చనిపోయిన తరువాత ఆమె పేరుతో కాలేజీలు , పార్కులు , ఆసుపత్రులు , విశ్వవిద్యాలయాలు వెలసాయి .


  • ========================================

Visit my website - > Dr.seshagirirao.com/

Monday, October 3, 2011

లాలా లజపతిరాయ్,Lala lajpat Rai



మానవులు పుడతారు ... చనిపోతారు . కొంతమంది మాత్రమే తమ జీవితం లో ప్రజలకు ఉపయోగపడే సేవాకార్యక్రమాలు చేసి తమ జీవితాన్నే ఫణం గా పెట్టి మానవ జాతిలో చిరస్థాయిగా తరతరాలుగా నిలిచిపోతారు ... వీరిని "మృతంజీవులు" అని అంటారు . కోటాను కోట్ల జనం లో బహు కొద్ది మంది మాత్రమే ఇలాంటివారు ఉంటారు . ప్రపంచము లో ప్రతి జాతి లోనూ ఈ తరహా మహానుభావులు పుట్టి తమ సేవలతో పుణీతులయ్యారు . తెలుగు జాతికి మణిపూసలైన కొందరి మహానుభావులను తెలుసుకునే ప్రయత్నం లో ఇక్కడ -లాలా లజపతిరాయ్- గురించి తెలుసుకొని మన జీవితాన్ని చక్కని మార్గములో ప్రయాణించే ప్రయత్నం చేద్దాము ....


  • లాలా లజపత్ రాయ్ --జనణము : జనవరి 28, 1865 -
  • మరణము : నవంబరు 17 1928,
  • బిరుదులు :పంజాబ్ కేసరి -
  • జన్మస్థలం: ఫిరోజ్‌పూర్., పంజాబ్, భారతదేశం,
  • ఉద్యమము: భారత స్వతంత్ర సంగ్రామం,
  • ప్రధాన సంస్థలు: భారత జాతీయ కాంగ్రెస్, ఆర్య సమాజ్,

లాలా లజపత్ రాయ్ భారత్ కు చెందిన రచయిత మరియు రాజకీయనాయకుడు. పంజాబ్ రాష్ట్రం మోఘా జిల్లా ధుడీకె గ్రామంలో జననం జనవరి 28 1865, మరణం నవంబరు 17 1928. భారత స్వతంత్ర సంగ్రామంలో బ్రిటిష్ రాజ్ కు వ్యతిరేకంగా పోరాడిన ధీరులలో ఒకడుగా చిరస్థాయిగా నిలిచిపోయాడు. ఇతడిని భారతీయులు పంజాబ్ కేసరి అనే బిరుదును నొసంగారు. ఇతను పంజాబ్ నేషనల్ బ్యాంకు మరియు లక్ష్మి ఇన్సూరెన్స్ కంపెనీల స్థాపకుడు.

లాల్ (లాలా లజపత్ రాయ్), బాల్ (బాలగంగాధర తిలక్), పాల్ (బిపిన్ చంద్రపాల్) త్రయం, ఆకాలంలో లాల్-బాల్-పాల్ గా ప్రసిద్ధి. వీరిలో ఒకడు.

For more details : Lala Lajapathi Rai
  • ========================================

Visit my website - > Dr.seshagirirao.com/

Saturday, October 1, 2011

శాంతిస్వరూప్ భట్నాగర్,Santhiswaroop Batnagar



మానవులు పుడతారు ... చనిపోతారు . కొంతమంది మాత్రమే తమ జీవితం లో ప్రజలకు ఉపయోగపడే సేవాకార్యక్రమాలు చేసి తమ జీవితాన్నే ఫణం గా పెట్టి మానవ జాతిలో చిరస్థాయిగా తరతరాలుగా నిలిచిపోతారు ... వీరిని "మృతంజీవులు" అని అంటారు . కోటాను కోట్ల జనం లో బహు కొద్ది మంది మాత్రమే ఇలాంటివారు ఉంటారు . ప్రపంచము లో ప్రతి జాతి లోనూ ఈ తరహా మహానుభావులు పుట్టి తమ సేవలతో పుణీతులయ్యారు . తెలుగు జాతికి మణిపూసలైన కొందరి మహానుభావులను తెలుసుకునే ప్రయత్నం లో ఇక్కడ -శాంతిస్వరూప్ భట్నాగర్,Santhiswaroop Batnagar- గురించి తెలుసుకొని మన జీవితాన్ని చక్కని మార్గములో ప్రయాణించే ప్రయత్నం చేద్దాము ....


శాంతిస్వరూప్ భట్నాగర్ గురించి తెలియనివారుండరు. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చి (CSIR) వారు ఏటేటా ఇచ్చే శాంతిస్వరూప్ భట్నాగర్ బహుమతి ఈయన గౌరవార్ధం ఏర్పరచినదే. భారతదేశం నిండుగా గర్వించదగ్గ శాస్త్రజ్ఞుడు భట్నాగర్.

ఇప్పటి పాకిస్తాన్లో ఉన్న షాపూర్లో ఫిబ్రవరి 21, 1894న భట్నాగర్ జన్మించాడు.చిన్నతనంలోనే తండ్రి చనిపోవటంతో తన తాతగారింట పెరిగాడు. వాళ్ళ తాత ఓ పెద్ద ఇంజనీరు. చిన్ననాటి నుండి సాహిత్యమన్నా, విజ్ఞాన శాస్త్రమన్నా విపరీతమైన ఆసక్తిని పెంచుకున్నాడు. కవిత్వంలో మంచి ప్రవేశముండేది.

ఇప్పటి పాకిస్తాన్లొ ఉన్న రావల్పిండి ప్రాంతంలో ఒక బ్రిటిష్ కంపెనీ చమురు అన్వేషణా కార్యక్రమం చేపట్టిన రోజుల్లో ఒక సమస్య ఎదురైంది. చమురు ఉన్న ప్రాంతం బురదమయంగా ఉండేది. పైగా డ్రిల్ చేసిన బురద ఉప్పునీటితో కలిసి గట్టిగా రాయిలాగామారి, డ్రిల్లింగ్కు అంతరాయం కలిగించేది. ఒక దశలో పనిపూర్తిగా ఆగిపోయేది. అపుడు కంపెనీవారు భట్నాగర్ను సలహా కోసం ఆశ్రయించారు. ఎమల్షన్ కొల్లాయిడ్లతో పరిశోధనలు చేసి 1921లో లండన్ యూనివర్శిటీ నుండి డాక్టర్ ఆఫ్ సైన్స్ పట్టా తీసుకున్న భట్నాగర్ ఈ సమస్యను కూలంకషంగా పరిశీలించి అతిసులభమైన, చవకైన పరిష్కారాన్ని సూచించాడు. డ్రిల్ చేసిన బురదకు జిగురుకలపమని సలహా ఇచ్చాడు. జిగురు కలిపిన బురదకు స్నిగ్ధత(Viscosity) తక్కువై గట్టిపడకుండా ఉండటంతో బ్రిటీష్ కంపెనీ కొన్ని లక్షల రూపాయల నష్టం నుండి బయటపడింది. వెంటనే కంపెనీ వారు ఆయనకు లక్షాయాభై వేల రూపాయలు బహుకరించారు. ఆ సొమ్మున లాహొరు యూనివర్శిటీకి చమురు పరిశోధనల కోసం విరాళంగా ఇచ్చాడు. చూశారా! భట్నాగర్ ఔదార్యం.

భట్నాగర్ చమురు పరిశోధనాభివృద్ధికి ఎంతో కృషి చేశాడు. మైనాన్ని వాసన లేకుండా ఎలా రూపొందించాలో ఈయన తెలియచేశాడు. కిరోసిన్ను శుద్ధి చేయడం. వెలుగును ఎక్కువ చేయటం. ఆదా చేయడం గురించి భట్నాగర్ ఎంతో విలువైన సమాచారాన్ని అందించాడు. పెట్రోలియం నుండి విడుదలయ్యే వ్యర్థ పదార్ధాలను చమురు పరిశ్రమలో ఎలా ఉపయోగించాలో ఈయన పరిశోధించాడు. రెండవ ప్రపంచ యుద్ధకాలంలో ఈయన CSIR కు డైరెక్టరయ్యాడు. భట్నాగర్ చమురు పరిశోధనల్లో మునిగి తేలుతున్నా మాగ్నటో కెమిస్ట్రీ మీద కూడా దృష్టినిలిపేవాడు. ఈ సమయంలోనే ఆయన వ్యర్థ పదార్థాల నుండి ప్లాస్టిక్స్ చేయడం, రబ్బరు వస్తువులను రూపొందించడం వంటి పరిశోధనలను ముమ్మరం చేశాడు. 1943లో ఈయనను Fellow of the Royal Society (FRS) గా ఎన్నుకున్నారు.

నువ్వు పనిచెయ్యడమే కాదు ,పనిచేసే అవకాశాలు కల్పించు అనే సిద్ధాంతాన్ని నమ్మే భట్నాగర్ భారతదేశములో వివిధప్రాంతాలలో 12 పరిశోధనా శాలలను స్థాపించారు .

జవహార్లాల్నెహ్రూ హయాంలో ప్రభుత్వం నుండి నిధులను సమకూర్చి చమురు పరిశోధనా వనరులను అభివృద్ధి చేశాడు. ఈనాడు మనదేశంలో చమురు వనరులు, చమురు నిక్షేప స్థావరాలు, అణుఖనిజ పరిశ్రమలు అభివృద్ధి చెందాయంటే అది భట్నాగర్ కృషే అని చెప్పాలి.

01 జనవరి 1955 తేదీన మరణించారు .

భట్నాగర్‌ అవార్డు, Batnagar Award


శాస్త్ర, సాంకేతిక రంగాల్లో శాస్త్రవేత్తలు కనబరిచిన ప్రతిభకు నిదర్శనంగా, ఆయా రం గాలకు వారు అందించిన సేవలకు గుర్తింపుగా ప్రతి ఏడాది ఇచ్చే శాంతి స్వరూప్‌ భట్నాగర్‌ అవా ర్డులు భారత శాస్త్ర రంగంలో అత్యున్నతమైనదిగా పరిగణిస్తారు.2010 సం.ప్రఖ్యాతిగాంచిన శాంతి స్వరూప్‌ భట్నాగర్‌ పురస్కారాలకు 11 మంది శాస్త్రవేత్తలు ఎంపికయ్యారు. సీఎస్‌ఐఆర్‌ ఫౌండేషన్‌ డే వార్షికోత్సవంలో.. శాస్త్ర, సాంకేతిక వ్యవహారాల మంత్రి విలాస్‌రావ్‌ దేశ్‌ముఖ్‌ సమక్షంలో సీఎస్‌ఐఆర్‌ డైరెక్టర్‌ జనరల్‌ సమీర్‌ బ్రహ్మచారి పురస్కార విజేతల 2010 సంవత్సరానికి పేర్లు ప్రకటించారు. ఆ వివరాలు..

గణిత శాస్త్రంలో..
* మహాన్‌ మహారాజ్‌: రామకృష్ణా మిషన్‌కు చెందిన వివేకానంద యునివర్సిటీ- హౌరా
* పలాశ్‌కుమార్‌: ఇండియన్‌ స్టాటిస్టికల్‌ ఇన్‌స్టిట్యూట్‌-కోల్‌కతా

జీవశాస్త్రంలో ..
* అమిత్‌ ప్రకాశ్‌ శర్మ: ఇంటర్నేషనల్‌ జెనిటిక్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ బయోటెక్నాలజీ-ఢిల్లీ
* రాజన్‌ శంకర్‌ నారాయణన్‌: సీసీఎంబీ - హైదరాబాద్‌

రసాయనశాస్త్రంలో ..
* బాలసుబ్రమణియన్‌ సుందరం: జవహర్‌లాల్‌ నెహ్రూ సెంటర్‌ ఫర్‌ అడ్వాన్స్‌డ్‌ సైంటిఫిక్‌ రీసెర్చ్‌-బెంగళూరు
* గరికపాటి నరహరి శాస్త్రి: ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ-హైదరాబాద్‌

భౌతిక శాస్త్రంలో..
* షిరాజ్‌ మిన్‌వల్లా: టాటా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఫండమెంటల్‌ రీసెర్చ్‌-ముంబయి
వైద్య శాస్త్రంలో..
* కె.నారాయణస్వామి బాలాజీ: ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ -బెంగళూరు

ఇంజినీరింగ్‌లో..
* శిరీషెందు దే: ఐఐటీ- ఖరగ్‌పూర్‌
* ఉపద్రష్ట రామమూర్తి: ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌- -

ఎర్త్‌ సైన్స్‌లో..
* శంకర్‌ దొరై స్వామి: నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఓషనోగ్రాఫీ- గోవా

ఈ పురస్కారం కింద విజేతలకు ప్రధాని మన్మోహన్‌సింగ్‌ రూ.5 లక్షల నగదు బహుమతి ప్రదానం చేస్తారు.
  • ========================================


Visit my website - > Dr.seshagirirao.com/