Saturday, December 11, 2010
బి.ఆర్.అంబేద్కర్ డా., B.R.Ambedkar Dr.
భీంరావ్ రాంజీ అంబేడ్కర్ (Bhimrao Ramji Ambedkar) (ఏప్రిల్ 14, 1891 - డిసెంబర్ 6, 1956)బాబాసాహెబ్ అని ప్రసిద్ధి, ధర్మశాస్త్రపండితుడు, భారత ప్రధాన రాజ్యాంగ నిర్మాత, రాజకీయ నాయకుడు, స్వంతంత్ర భారత తొలి న్యాయ శాఖా మంత్రి, స్వాతంత్ర్యోద్యమ దళిత నాయకుడు, వృత్తి రీత్యా న్యాయవాది, ఇండియన్, బౌధుడు, తత్వశాస్రవేత, అన్త్రోపోలోజిస్ట్, చరిత్రకారుడు, ప్రసంగికుడు, రచేయత, అర్థశాస్త్రవేత్త, పండితుడు, సంపాదకుడు, విప్లవకారుడు, బౌద ధర్మ పునరుద్ధరణకర్త.
భారత రాజ్యాంగ నిర్మాత డా బాబాసాహెబ్ అంబేద్కర్ తేది- 14-04 -1891వ సంవత్సరంలో మహర్ సామా జికవర్గానకి చెందిన భీమాబాయి, రాంజీ దంపతులకు జన్మించారు. గ్రామ నామాన్ని బట్టి అంబేద్కర్ ఇంటిపేరు ‘అంబావదేకర్’. అయితే అంబేద్కర్‌ను ఎంతో ఇష్టపడే తన ఉపాధ్యాయుడు అమిత వాత్సల్యంతో తన ఇంటిపేరు ‘అంబేద్కర్’ను ‘అంబావదేకర్’ స్థానంలో రాశారు. 1913లో బరోడా మహా రాజు ఉపకారవేతనంతో అమెరికాలో ఉన్నత విద్యనభ్యసించారు. 1915లో అంబేద్కర్ రాసిన ‘ఎన్సియెంట్ ఇండియన్ కామర్స్’ అనే వ్యాసానికి ఎం.ఏ డిగ్రీ వరించింది. 1916లో ‘క్యాస్ట్‌స అండ్ దెయిర్ మెకానిజమ్, జెనెసిస్ అండ్ డెవలప్‌మెంట్’ అనే అంశంపై ఆంత్రో పాలజీ సెమినార్‌లో పలువురి ప్రశంసలు పొందారు అంబేద్కర్. ‘నేషనల్ డివిడెండ్ ఆఫ్ ఇండియా - ఎ హిస్టారికల్ అండ్ ఎనలిటికల్ స్టడీ’ అనే అంశంపై రాసిన పరిశోధనాత్మక గ్రంథానికి కొలంబియా విశ్వవిద్యాలయం నుండి పిహెచ్.డి డిగ్రీ పొందారు. 1947- 51 మధ్యకాలంలో కేంద్ర మంత్రివర్గంలో న్యాయశాఖామంత్రిగా పనిచేశారు. జీవితాం తం కులనిర్మూలన, అట్టడుగు వర్గాల అభ్యు న్నతి కోసం అనేక ఉద్యమాలు చేపట్టిన సం ఘసంస్కర్త, దళితజన బాంధవుడు అంబేద్క ర్.
తన అమోఘ మేధాశక్తితో రాజ్యాంగాన్ని రచించిన భారత పరిపాలనా వ్యవస్థకు ఒక రూపాన్ని చేకూర్చిన మహనీయుడు. ఆయన సేవలను గుర్తిస్తూ... 1990లో భారత ప్రభు త్వం అత్యున్నత పౌర పురస్కారం అయిన ‘భారతరత్న’ బిరుదినిచ్చి సత్కరించింది.
పూర్తి వివరాలకు --> అంబేద్కర్ బి.ఆర్.
========================================
Visit my website - > Dr.seshagirirao.com
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment
Thanks for your comment & feedback.