కోల్‌కతా: విశ్వమాత మథర్ థెరిస్సా శతజయంతి నేడు. పేదలకు ప్రేమను పంచిన ఆ అమృత మూర్తి 1910 ఆగస్టు 26న అల్బేనియాలో జన్మించారు. సేవే మార్గంగా సాగిన ఆమె తన జీవితాన్ని అభాగ్యులకు అంకితం చేశారు. ఆమె నిస్వార్థ సేవను అనేక దేశాలు, ప్రభుత్వాలు, సంస్థలు ఎంతగానో కొనియాడాయి. ఆమె సేవకు గుర్తింపుగా 1979లో నోబెల్ శాంతి బహుమతి, 1980లో భారతరత్న లభించాయి. ప్రశంసలతోపాటు మదర్ విమర్శలనూ ఎదుర్కోవాల్సి వచ్చింది. అనేక కష్టాలను ఎదుర్కొని నిర్భాగ్యులకు తమ ఆపన్న హస్తాన్ని అందించారు. 1997 సెప్టెంబర్ 5న ఆ మాతృమూర్తి కన్నుమూశారు. ఆమె మరణానంతరం పోప్ ఆమెను సెయింట్‌హుడ్ హోదాతో గౌరవించారు
full details - > Mother teresa in wikipedia.org/
- ========================================
No comments:
Post a Comment
Thanks for your comment & feedback.