మానవులు పుడతారు ... చనిపోతారు . కొంతమంది మాత్రమే తమ జీవితం లో ప్రజలకు ఉపయోగపడే సేవాకార్యక్రమాలు చేసి తమ జీవితాన్నే ఫణం గా పెట్టి మానవ జాతిలో చిరస్థాయిగా తరతరాలుగా నిలిచిపోతారు ... వీరిని "మృతంజీవులు" అని అంటారు . కోటాను కోట్ల జనం లో బహు కొద్ది మంది మాత్రమే ఇలాంటివారు ఉంటారు . ప్రపంచము లో ప్రతి జాతి లోనూ ఈ తరహా మహానుభావులు పుట్టి తమ సేవలతో పుణీతులయ్యారు . భారత జాతికి మణిపూసలైన కొందరి మహానుభావులను తెలుసుకునే ప్రయత్నం లో ఇక్కడ -మన్మోహన్ సింగ్- గురించి తెలుసుకొని మన జీవితాన్ని చక్కని మార్గములో ప్రయాణించే ప్రయత్నం చేద్దాము ....
డా. మన్మోహన్ సింగ్ భారత దేశానికి 17వ ప్రధాన మంత్రి. భారత జాతీయ కాంగ్రెస్ సభ్యుడైన సింగ్ ప్రధాన మంత్రిగా మే 22, 2004 లో భాద్యతలు స్వీకరించారు. అనేక అర్హతలు కల సింగ్ 1991లో ఆర్థిక శాఖా మంత్రి గా ఉన్నప్పుడు ప్రారంభించిన ఆర్థిక సంస్కరణ ల వలన ప్రస్తుత భారత చరిత్రలో ముఖ్యుడిగా భావింపబడుతున్నాడు. మరియు ఇంతటి విద్యా మరియు సేవలలో అనుభవం కలిగిన ప్రధానమంత్రి ప్రపంచంలోనే లేడంటో అతిశయోక్తిగాదు.
ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ రేపు (26/09/2012) 80వ పుట్టినరోజు జరుపుకోబోతున్నారు. సంస్కరణవాదిగా ఒకప్పుడు తెచ్చుకున్న పేరును ఇటీవలే తిరిగి సాధించుకున్న ప్రధానికి ఈ పుట్టినరోజు శుభశకునాలనే సూచిస్తోంది. 1990వ దశకంలో ఆర్థికమంత్రిగా ఆయన సంస్కరణలకు తెరలేపి గొప్పపేరు ప్రతిష్ఠలు తెచ్చుకున్నారు. 2004లో కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వచ్చాక ప్రధాని అయిన మన్మోహన్‌కి తొలి ఐదేళ్లూ సాఫీగానే సాగాయి. 2009లో రెండో దఫా ప్రధాని అయిన తర్వాత మాత్రం గడ్డుకాలం ఎదుర్కొనక తప్పలేదు. వరుస కుంభకోణాలకు తోడు అండర్ ఎఛీవర్ అంటూ టైమ్, వాషింగ్టన్ పోస్టులాంటి పత్రికల కథనాలు ఆయన ప్రతిష్ఠకు మచ్చతెచ్చాయి. ఇటీవల ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టేందుకు ఎఫ్‌డీఐలకు స్వాగతం పలుకుతూ మరోసారి సంస్కరణల బాట పట్టిన మన్మోహన్ పునర్వైభవం సాధించారనవచ్చు.
For more details -> Manmohan Singh (wikipedia.org)
- ============================