Tuesday, May 21, 2013

Hagiography statues in Parliament, పార్లమెంట్‌లో మహాత్ముల విగ్రహాలు

  •  

  •  

మానవులు పుడతారు ... చనిపోతారు . కొంతమంది మాత్రమే తమ జీవితం లో ప్రజలకు ఉపయోగపడే సేవాకార్యక్రమాలు చేసి తమ జీవితాన్నే ఫణం గా పెట్టి మానవ జాతిలో చిరస్థాయిగా తరతరాలుగా నిలిచిపోతారు ... వీరిని "మృతంజీవులు" అని అంటారు . కోటాను కోట్ల జనం లో బహు కొద్ది మంది మాత్రమే ఇలాంటివారు ఉంటారు . ప్రపంచము లో ప్రతి జాతి లోనూ ఈ తరహా మహానుభావులు పుట్టి తమ సేవలతో పుణీతులయ్యారు . భారత జాతికి మణిపూసలైన కొందరి మహానుభావులను తెలుసుకునే ప్రయత్నం లో ఇక్కడ -Hagiography statues in Parliament, పార్లమెంట్‌లో మహాత్ముల విగ్రహాలు- గురించి తెలుసుకొని మన జీవితాన్ని చక్కని మార్గములో ప్రయాణించే ప్రయత్నం చేద్దాము ....


1963లో మోతీలాల్‌ నెహ్రూతో ప్రారంభం
1993లో జాతిపిత విగ్రహావిష్కరణ
విశ్వవిఖ్యాత నటనా సార్వభౌముడు ఎన్‌టిఆర్‌
వ్యవసాయ అభివృద్ధికి ఎన్‌.జి.రంగా కృషి
బ్రిటీష్‌వారికి గుండె చూపిన టంగుటూరి
తెలుగు వారిలో ముగ్గురికి చోటు

దేశ స్వాతంత్య్రం కోసం కొందరు, బీసీ, ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతి కోసం మరిందరు. జాతి ఔన్నత్యాన్ని దశ దిశలా వ్యాపింపజేసిన వారు ఇంకొందరు. ఇలా అందరూ ఎంతో ఉన్నతమైన వారే. మన దేశచరిత్రలో ఎందరో మహానుభావులు. వారందరినీ స్మరించుకోవడానికిి, మున్ముందు తరాల కోసం పార్లమెంట్‌లో విగ్రహాలను ఏర్పాటు చేయడం ప్రారంభించారు. మోతీలాల్‌ నెహ్రూతో 1963లో ప్రారంభమైన ఈ ఏర్పాటులో ఇప్పటికీ 49 విగ్రహాలు ఏర్పాటయ్యారుు. నూతనంగా ఆంధ్రుల అభిమాన నటుడు, తెలుగువాడి గౌరవాన్ని ప్రపంచస్థారుులో చాటిచెప్పి ముఖ్యమంత్రిగా సేవలు అందించిన ఎన్‌టిఆర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పార్లమెంట్‌లోని విగ్రహాల విశేషాలు...

పార్లమెంట్‌ను ఇద్దరు అర్కిటెక్‌ నిపుణులు రూపకల్పన చేశారు. సర్‌ ఎడ్విన్‌ లుట్యన్స్‌, సర్‌ హెర్బర్ట్‌ బాకెర్‌లే ప్లానింగ్‌ చేసి నిర్మాణం చేయించారు. 1921 ఫిబ్రవరి 12న నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. ఆరు సంవత్సరాలు అత్యంత జాగ్రత్తగా నిర్మించారు. 18 జనవరి 1927న భవన ప్రారంభం జరిగింది. అప్పటి భారత గవర్నర్‌ జనరల్‌ లార్డ్‌ ఇర్విన్‌ ప్రారంభించారు. నిర్మాణానికి అయిన ఖర్చు ఎంతో తెలుసా అక్షరాల 83లక్షల రూపాయలు. దీనికి 12 గేట్లు ఏర్పాటు చేశారు. గేట్‌ నెం.1 సన్‌సాద్‌ మార్గ్‌ ప్రధాన ద్వారం. దాదాపు ఆరు ఎకరాల విస్తీర్ణంలో పార్లమెంట్‌ ఏర్పాటు చేశారు. జాతి గర్వించదగిన మహానుభావుల విగ్రహాలను పార్లమెంట్‌లో ఏర్పాటు చేశారు. హాల్‌లో, గ్రంథాలయంలో, కోర్డుయార్డులో, బయట కలిపిమొత్తం 49 విగ్రహాలు ఉన్నాయి. కొందరి విగ్రహాలు రెండు ప్రాంతాల్లో కూడా ఏర్పాటు చేశారు. ఎన్‌.జి.రంగా, టంగుటూరి ప్రకాశం, ఎన్‌.టి.రామారావుల విగ్రహాలు తెలుగు వారి ఔన్నత్యాన్ని నిదర్శనంగా ఠీవిగా కనిపిస్తాయి

మహాత్మా గాందీ

16 అడుగుల ఎత్తు కాంస్యంతో తయారైంది మహాత్మా గాంధీ విగ్రహం. ఇది సరిగ్గా గేట్‌ నెం.1కి ఎదురుగా ఉంటుంది. ధ్యానంలో ఉన్న జాతి పితగా ఇది కనిపిస్తుంది. రామ్‌ సుతార్‌ అనే శిల్పి అత్యంత నైపుణ్యంతో దీన్ని తయారు చేశారు. 2 అక్టోబర్‌ 1993న నాటి రాష్టప్రతి శంకర్‌ దయాల్‌ శర్మ ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ విగ్రహాన్ని దానం చేసింది. 1869న జన్మించిన బాపూజీ 1948లో నాధురామ్‌ గాడ్సే చేతితో హత్య చేయబడ్డారు.

బాబూజగ్జీవన్‌రామ్‌

బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహాను భావుడు. ప్రస్తుత స్పీకర్‌ మీరాకుమార్‌కు తండ్రి. లోక్‌ సభ చాంబర్‌ అవుట్‌ లాబీ వద్ద ఈయన విగ్రహం ఉంది. తొమ్మిది అడుగుల ఎత్తులో రామ్‌ సుతార్‌ అనే శిల్పి దీన్ని తయారు చేశారు. 25 ఆగస్టు 1995న శంకర్‌ దయాల్‌ శర్మ విగ్రహావిష్కరణ చేశారు. బాబూ జగ్జీవన్‌ రామ్‌ ఆశ్రమ ట్రస్టు విగ్రహాన్ని పార్లమెంట్‌కు అందజేసింది. 1908లో జన్మించిన జగ్జివన్‌ రామ్‌ 1986లో మృతిచెందారు.

బి.ఆర్‌. అంబేద్కర్‌

పార్లమెంట్‌ బయట ఉన్న ఉద్యానవనంలో 3.66 మీటర్ల ఎత్తులో రాజ్యాంగ నిర్మాత డా.బి. ఆర్‌.అంబేద్కర్‌ విగ్రహం నిలువెత్తుగా దర్శనమిస్తుంది. దీన్ని కాంస్యంతో తయారు చేశారు. బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ మెమోరియల్‌ కమిటీ విగ్రహాన్ని దానం చేయగా బి.వి.వాగ్‌ నైపుణ్యంతో తయారు చేశారు. 2 ఏప్రిల్‌ 1967న నాటి రాష్టప్రతి డా.సర్వేపల్లి రాధాకృష్ణ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఎస్టీ, ఎస్సీ, బిసీల అభివృద్ధికి బాటలు వేసిన జనోద్ధరణ నాయకుడు. 1891లో జన్మించిన అంబేద్కర్‌ 1956లో మృతిచెందారు

ఎన్‌.జి. రంగా

రైతుల ఎన్నో సేవలు చేసిన ప్రొఫెసర్‌ ఎన్‌.జి.రంగా. అందుకే మన రాష్ట్రంలో వ్యవసాయ విశ్వ విద్యాల యానికి ఎన్‌.జి.రంగా పేరు పెట్టుకున్నాం. డి.శంకర్‌ అతని సోదరులు ఈయన విగ్రహాన్ని తయారు చేశారు. ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వం విగ్రహాన్ని దానం చేసింది. నాటి ఉపరాష్టప్రతి కృష్ణకాంత్‌ 27 జులై 1998న విగ్రహావిష్కరణ చేశారు. 1900 సంవత్సరంలో పుట్టిన ఎన్‌.జి.రంగా 1995లో మృతిచెందారు.

టంగుటూరి ప్రకాశం

డి.శంకర్‌ అతని సోదరులు ఎంతో అద్భుతంగా టంగుటూరి ప్రకాశం పంతులు విగ్రహాన్ని తయారు చేశారు. ఆంధ్రకేసరిగా గుర్తింపు పొందారు టంగుటూరి. 5 మే 2000న నాటి రాష్టప్రతి కె.ఆర్‌.నారాయణన్‌ విగ్రహాన్ని ఆవిష్కరించారు. విగ్రహాన్ని దానం చేసింది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం. ‘‘రండి రా.. దమ్ముంటే కాల్చుకోండి అంటూ బ్రిటీష్‌ వారికి గుండెను చూపిన ఆంధ్రుడు’’. 1872లో జన్మించిన టంగుటూరి ప్రకాశం 1957లో మరణించారు.

జయప్రకాశ్‌ నారాయన్‌

జె.పి.విచార్‌ మంచ్‌ విగ్రహాన్ని దానం చేయగా కె.ఆర్‌.నారాయణన్‌ 3 జులై 2002 ఆవిష్కరణ చేశారు. భారత స్వాతంత్య్ర సమర యోధుడు, రాజకీయ నాయకుడు. 1970 వ దశకంలో అప్పటి భారత ప్రధాని ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా ప్రతిపక్షానికి నాయకత్వం వహించి సంపూర్ణ విప్లవానికి పిలుపునివ్వటం ద్వారా జయప్రకాశ్‌ నారాయణ్‌ చిరస్మరణీయుడయ్యాడు. ఈయనను ప్రజలు లోక్‌నాయక్‌ అని సగౌరవంగా పిలుచుకుంటారు. జె.పి.గా సుప్రసిద్దులైన జయప్రకాశ్‌ నారాయణ్‌ 1902 జన్మించి 1979లో మృతిచెందారు.

జ్యోతిరావు ఫూలే

గేట్‌ నెం.3 వద్ద గల ఉద్యానవనంలో మహాత్మా జ్యోతిరావు ఫూలే విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. మహారాష్ట్ర ప్రభుత్వం విగ్రహాన్ని దానం చేయగా 3 డిసెంబర్‌ 2003న నాటి ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి ఆవిష్కరణ చేశారు. బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి కోసం శ్రమించిన నాయకుడు. 12 అడుగుల ఎత్తులో కాంస్యంతో ఈ విగ్రహాన్ని తయారు చేశారు.

  • ఎన్‌.టి. రామారావు

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా, విశ్వ విఖ్యాత నటనా సార్వభౌముడిగా, నిర్మాతగా, దర్శకుడిగా, తెలుగువాడి ఖ్యాతిని దశదిశలా వ్యాపింప జేసిన ధీరుడిగా ఎన్‌.టి.రామారావు ప్రసిద్ధి గాంచారు. పదేళ్లుగా ఈయన విగ్రహం పార్లమెంట్‌లో ఏర్పాటు చేయాలని కుటుంబీకులు పోరాడుతున్నారు. ఎట్టకేలకు ఎన్‌టిఆర్‌ కూతురు, కేంద్ర మంత్రి పురందేశ్వరీ విగ్రహాన్ని దానం చేయడంతో మార్గం సుగమమం అయింది. 7 మే 2013న అంగరంగ వైభవంగా కుటుంబీకులంతా తరలిరాగా స్పీకర్‌ మీరాకుమర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించారు.

  • ================================= 
Visit my website - > Dr.seshagirirao.com/

Sunday, May 19, 2013

Anoushka shankar ,అనౌష్క శంకర్‌





మానవులు పుడతారు ... చనిపోతారు . కొంతమంది మాత్రమే తమ జీవితం లో ప్రజలకు ఉపయోగపడే సేవాకార్యక్రమాలు చేసి తమ జీవితాన్నే ఫణం గా పెట్టి మానవ జాతిలో చిరస్థాయిగా తరతరాలుగా నిలిచిపోతారు ... వీరిని "మృతంజీవులు" అని అంటారు . కోటాను కోట్ల జనం లో బహు కొద్ది మంది మాత్రమే ఇలాంటివారు ఉంటారు . ప్రపంచము లో ప్రతి జాతి లోనూ ఈ తరహా మహానుభావులు పుట్టి తమ సేవలతో పుణీతులయ్యారు . భారత జాతికి మణిపూసలైన కొందరి మహానుభావులను తెలుసుకునే ప్రయత్నం లో ఇక్కడ --Anoushka shankar ,అనౌష్క శంకర్‌ -- గురించి తెలుసుకొని మన జీవితాన్ని చక్కని మార్గములో ప్రయాణించే ప్రయత్నం చేద్దాము ....



ప్రపంచ ప్రఖ్యాత సితార్‌ కళాకారుడు పండిత్‌ రవి శంకర్‌ కుమార్తె అనౌష్క శంకర్‌. అనౌష్క శంకర్‌ సైతం సితార్‌ ప్లేయర్‌గా దేశ, విదేశాల్లో ఎన్నో ప్రదర్శనలిచ్చి మంచి పేరు తెచ్చుకున్నారు. ఆమె సింగర్‌ నోరా జోన్స్‌తో కలిసి గ్రామీ అవార్డును అందుకొని ఎంతో పాపులారిటీ సంపాదించారు. ఈ ప్రఖ్యాత కళాకారిణి కొందరు ప్రముఖులతో కలిసి పాన్‌ ఏషియన్‌ గర్ల్‌ బ్యాండ్‌ను రూపొందించేందుకు నడుం బిగించారు. ఈ బ్యాండ్‌లో చైనా, జపాన్‌, కొరియా, ఫిలిప్పీన్స్‌తో పాటు ఇండియా నుంచి ఒక్కొక్క పాప్‌ ఆర్టిస్ట్‌ను ఎంపికచేయనున్నారు.

గ్రామీ అవార్డు విజేత అనౌష్క శంకర్‌ 1981 జూన్‌ 9న జన్మించారు. ఆమె ప్రసిద్ధ సితార్‌ కళాకారుడు రవి శంకర్‌, బ్యాంక్‌ ఉద్యోగిని అయిన సుకన్యా రాజన్‌ దంపతులకు జన్మించారు. ఆమె లండన్‌లో జన్మిం చగా కొంతకాలం లండన్‌లో, మరికొంతకాలం ఢిల్లీలో ఆమె బాల్యం గడి చింది. టీనేజీ వయస్సులో ఆమె క్యాలిఫోర్నియాలో ఉంటూ సాన్‌ డిగిటో మ్యూజిక్‌ అకాడమీలో సంగీతంలో శిక్షణ పొందారు. తండ్రి లక్షణాలను పుణికిపుచ్చుకున్న అనౌష్కకు చిన్నతనం నుంచే సంగీతమంటే ప్రాణం. ఆమె తన తండ్రి పండిత్‌ రవిశంకర్‌ వద్ద సితార్‌ వాయించడాన్ని నేర్చుకు న్నారు. 13 సంవత్సరాల వయస్సులోనే ఆమె మ్యూజిక్‌ షోలను నిర్వహిం చడం విశేషం.

ఆ తర్వాత 16 సంవత్సరాల వయస్సులో మొదటి రికార్డు కాంట్రాక్ట్‌పై సంతకం చేశారు. 1998లో విడుదలైన తన మొదటి మ్యూ జిక్‌ ఆల్బమ్‌ అనౌష్కతో ఆమె ఎంతో పాపులారిటీ సంపాదించారు. అనంతరం 2000 సంవత్సరం ఫిబ్రవరిలో కోల్‌కతాలోని రామకృష్ణ సెంటర్‌లో సంగీత ప్రదర్శనిచ్చిన మొదటి మహిళగా పేరు తెచ్చుకున్నారు. నేడు సంగీత ప్రపంచంలో సితార్‌ వాయిద్యకారిణిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు అనౌష్క. తండ్రి సంగీత వారసత్వాన్ని పుణికిపుచ్చు కొని సంగీతకారిణిగా పేరుతెచ్చుకున్నారు.

పాప్‌ మ్యూజిక్‌తో ఒకప్పుడు యూత్‌ను ఉర్రూతలూగించారు సై్పస్‌ గర్ల్‌‌స. అనంతరం కొంతకాలానికి విడిపోయిన ఈ గర్ల్‌‌స బ్యాండ్‌ తన సాంగ్స్‌తో ఎంతో పాపులారిటీ తెచ్చుకుంది. ఈ బ్యాండ్‌ ఏర్పాటుకు కృషిచేసిన కొందరు ప్రముఖులతో కలిసి ప్రఖ్యాత సితార్‌ కళాకారిణి అనౌష్క శంకర్‌ పాన్‌ ఏషియన్‌ గర్ల్‌ బ్యాండ్‌ ఏర్పాటుకు కృషిచేస్తుండడం విశేషం. ఆసియా ఖండంలోని ఇండియాతో పాటు చైనా, జపాన్‌, కొరియా, ఫిలిప్పీన్స్‌ల నుంచి ఒక్కొక్క పాప్‌ ఆర్టిస్ట్‌ను వారు ఎంపికచేయనున్నారు. ఇక ఇండియా నుంచి టాలెంట్‌ ఉన్న పాప్‌ ఆర్టిస్ట్‌ను ఎంపిక చేసే బాధ్యతను అనౌష్క శంకర్‌కు చెందిన సంస్థ ఆల్‌కెమిస్ట్‌ టాలెంట్‌ సొల్యూషన్‌ తీసుకుంది.

16 సంవత్స రాల నుంచి తాను సితార్‌ ఆర్టిస్ట్‌గా దేశ, విదేశాల్లో సంగీత ప్రదర్శనలిస్తున్నాననీ కానీ తనకు ఎక్కడా పాప్‌ మ్యూజిక్‌ రంగంలో పాపులారిటీ సంపాదించుకున్న ఇండియన్‌ గర్ల్‌ కనిపించలేంచలేదని అనౌష్క అన్నారు. దీంతో తాను కొందరు ప్రముఖులు కలిసి ఏర్పాటు చేస్తున్న పాన్‌ ఏషియన్‌ గర్ల్‌ బ్యాండ్‌ ఏర్పాటులో భాగంగా ఇండియా నుంచి పాపులర్‌ సింగర్‌ను తాను ఎంపికచేయనున్నట్టు చెప్పారు. ఈ బ్యాండ్‌లో సింగర్‌గా ఇండియన్‌ గర్ల్‌ ప్రపంచ వ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకునే అవకాశం ఉందని తెలిపారు. ఇండియన్‌ ఆర్టిస్ట్‌లను ప్రోత్సహించడమే తమ లక్ష్యమన్నారు.

దేశం గర్వించదగ్గ సితార్‌ విద్వాంసుడు మా నాన్న. అయినా నాకూ వేధింపులు తప్పలేదు. చిన్నప్పుడు ఎన్నోసార్లు శారీరక, మానసిక వేధింపులకు గురయ్యాను. ఎవరికి చెప్పాలో, ఎలా వాటిని ఎదుర్కోవాలో తెలియక మౌనంగా భరించాను. మా కుటుంబానికి ఎంతో సన్నిహితుడైన ఓ పెద్దమనిషే అలా చేసేవాడు' అని పండిట్‌ రవిశంకర్‌ కూతురు, సితార్‌ కళాకారిణి అనౌష్క శంకర్‌ చెప్పింది. ప్రేమికుల రోజున మహిళలపై హింసకు వ్యతిరేకంగా 'వన్‌ బిలియన్‌ రైసింగ్‌' కార్యక్రమంలో పాల్గొన్న ఆమె 'ఒకటి, రెండుసార్లు కాదు, ఏళ్ల తరబడి ఆ వేధింపులు కొనసాగాయి. రాత్రిళ్లు బయటకు రావాలంటే భయం కలిగేది. బాగా తెలిసిన వాళ్లను కూడా నమ్మలేకపోయేదాన్ని. ఎన్నో ఏళ్లు గడిచినా చిన్నప్పటి చేదు జ్ఞాపకాలు ఇంకా నన్ను వదల్లేదు' అని చెప్పుకొచ్చింది. మహిళలపై హింసకు వ్యతిరేకంగా పోరాడేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలంటోన్న అనౌష్క ఢిల్లీలోని కళాశాలలకు వెళ్లి విద్యార్థులను చైతన్య పరుస్తోంది. మహిళా ట్యాక్సీ డ్రైవర్లు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో పాల్గొంది.



  •  ================================

Visit my website - > Dr.seshagirirao.com/ 

Thursday, April 4, 2013

Sister Niveditha,సిస్టర్ నివేదిత



  •  

మానవులు పుడతారు ... చనిపోతారు . కొంతమంది మాత్రమే తమ జీవితం లో ప్రజలకు ఉపయోగపడే సేవాకార్యక్రమాలు చేసి తమ జీవితాన్నే ఫణం గా పెట్టి మానవ జాతిలో చిరస్థాయిగా తరతరాలుగా నిలిచిపోతారు ... వీరిని "మృతంజీవులు" అని అంటారు . కోటాను కోట్ల జనం లో బహు కొద్ది మంది మాత్రమే ఇలాంటివారు ఉంటారు . ప్రపంచము లో ప్రతి జాతి లోనూ ఈ తరహా మహానుభావులు పుట్టి తమ సేవలతో పుణీతులయ్యారు . భారత జాతికి మణిపూసలైన కొందరి మహానుభావులను తెలుసుకునే ప్రయత్నం లో ఇక్కడ --Sister Niveditha,సిస్టర్ నివేదిత-- గురించి తెలుసుకొని మన జీవితాన్ని చక్కని మార్గములో ప్రయాణించే ప్రయత్నం చేద్దాము ....





మహిళలకు సరైన విద్యావకాశాలు కల్పించి విద్యావంతులను చేసినపుడే దేశం అభివృద్ధి చెందుతుందని ఉద్ఘాటించిన సిస్టర్‌ నివేదిత మహిళావిద్యాభివృద్ధికోసం ఎంతో కృషి చేశారు. వివేకానందుడి బోధనలకు ప్రభావితమై హిందుమతాన్ని స్వీకరించిన మొదటి విదేశీ మహిళగా ఆమె చరిత్రను సృష్టించారు. ఐర్లాండులో 1867 అక్టోబర్‌ 28న జన్మించిన మార్గరెట్‌ ఎలిజబెత్‌ నోబెల్‌ తల్లిదండ్రులు మేరి ఐస్‌బెల్‌, శ్యాముల్‌ రిచ్‌ముడ్‌ నోబుల్‌.నిజమైన తోటి మనుషులను కరుణతో చూడటమే భగవంతునికి నిజమైన సేవ చేయడం అని చిన్నతనంలో తండ్రి చెప్పిన మాటలు ఆమెను ఎంతో ప్రభావితం చేశాయి. తండ్రి స్పూర్తిదాయకమైన మాటలతో ఒక పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా చేరారు. దాదాపు పదిసంవత్సరాలు(1884 నుంచి 1894 వరకు) ఇంగ్లాండులో ఆమె ఉపాధ్యాయురాలిగా పనిచేశారు. 1895లో భారత మహిళా ఔన్నత్యంపై స్వామి వివేకానంద లండన్‌లో చేసిన ప్రసంగాలు మార్గరెట్‌ జీవితాన్ని మార్చాయి. భారతీయ స్త్రీ గొప్పదనం గురించి విన్న ఆమె వివేకానందను కలిసి 1898 జనవరి 28న భారత్‌ చేరింది. అలా ఆమె భారతదేశానికి వచ్చి నేటికి 113 సంవత్సరాలయింది. ఆమెకు వివేకానంద నివేదిత అని నామకరణం చేశారు. నివేదిత అంటే భగవంతునికి సమర్పణ చేయబడినది అని అర్థం. వివేకానంద బోధన గురించి, తనపై వాటి ప్రభావం గురించి తాను రాసిన 'ది మాస్టర్‌ యాజ్‌ ఐ సా హిమ్‌' పుస్తకంలో వివరిం చారు. ఇతరులపై దయ గుణంతో మెలిగే ఆమె, మంచి అభిరుచిగల కళాకారిణి. సంగీతం లోనూ, చిత్రకళలోనూ ఆమెకు ప్రవేశం ఉండేది.

ఉపాధ్యాయురాలిగా పనిచేసిన అనుభవం ఉన్న నివేదిత భారత్‌లోనూ విద్యాభివృద్ధికి ఎంతో కృషి చేసింది. ముఖ్యంగా బాలికల విద్యకోసం ఆమె 1898 నవంబర్‌లో కలకత్తాలోని బాగ్‌బజారులో పాఠశాలను ప్రారంభించింది. కనీస విద్యలేని బాలికలకు విద్యను అందించడం లక్ష్యంగా ఆమె పనిచేశారు. ప్రాథమికవిద్య అందించడానికి విశేష కృషి చేశారు. అన్నికులాల మహిళలకు చదువు తప్పనిసరిగా రావాలని ఆమె ఆకాంక్షించారు. బెంగాల్‌ మహిళలతో, మేధావులతో పరిచయాలను ఏర్పాటుచేసుకుని బాలికల విద్యకోసం ఎంతో శ్రమించారు. విశ్వకవి రవీంద్రనాథ్‌ ఠాగూర్‌, జగదీష్‌చంద్రబోస్‌ తదితర ప్రముఖులతో స్నేహసంబంధాలను కొనసాగించారు.1899 సంవత్సరం మార్చిలో కలకత్తావాసులకు ప్లేగ్‌ వ్యాధి సోకినప్పుడు తన శిష్యులతో కలిసి వైద్యసేవలు అందించారు. భారత మహిళల ఔన్నత్యం గురించి, ఆచారవ్యవహారాల గురించి న్యూయార్క్‌, షికాగో మొదలైన నగరాల్లో ఆమె ప్రసంగించారు. భారతస్వాతంత్య్రపోరాటంలోనూ ఆమె చురుకైన పాత్రపోషించారు. భారతీయతను పూర్తిగా ఆకలింపు చేసుకున్న ఆమె మహిళావిద్య కోసం ఎంతగానో పాటుపడ్డారు.

1906లో బెంగాల్‌కు వరదలు వచ్చినప్పుడు బాధిత ప్రజలకు ఆమె చేసిన సేవ, అందించిన మానసికధైర్యం ఎంతో విలువైనవి. విదేశీయురాలు అయినప్పటికీ భారతీ యతను పుణికిపుచ్చుకుని స్వామివివేకానందతో అనేక దేశాలు పర్యటించి ప్రసంగించిన ఆమె 1911 అక్టోబర్‌ 13న డార్జిలింగ్‌లో మరణించారు. ఆమె పేరుతో అనేక పాఠశాలలు, కళాశాలు స్థాపించబడ్డాయి.

చివరి రోజుల్లో :
ఆమెను కడుపులో మోస్తుండా తల్లి తనకు పుట్టబోయే బిడ్డను ప్రభువు సేవకు అందిస్తానని మొక్కుకుంది. టీనేజ్ లోకి అడుగు పెడుతున్న సమయములో మార్గరెట్ కూడా క్రైస్తవ సన్యాసినిగా మారి మతసేవ చేయాలనుకుంది . అయితే ఈలోగా ఆమె ఒక యువకునితో ప్రేమలో పడింది . ఆ ప్రేమలో లభిస్తున్న ఆనందం , తృప్తి తో పొంగిపోయింది. ప్రభువు సేవ చేయాలంటే సన్యాసిని కానక్కరలేదని ,తన తండ్రి ,తాత సంసారము చేసుకుంటూ మతబోధన చేసిన విషయము గుర్తుచేసుకుంది. ఇక పెళ్ళి చేసుకుందామనుకుంటున్న సమయం లో ఆ యువకుడు మరణించడముతో ఎలిజబెత్ కి  పెద్ద షాక్ తగిలింది .
టీచర్ గా పనిచేస్తూ  తిరిగి మతపరమైన అంశాలలో మునిగిపోవాలనుకుంది. కాని క్రైస్తవ మతములో పరిచయం పెరుగుతున్నకొద్దీ ఆమెలో అసహనం పెరిగింది. అంతులేని ఆంక్షలు మతపరం గా విధించడం సహించలేకపోయింది . మనుషులకు మతం అవసరమే అయినా క్రైస్తవ మతం తనకు అవసరములేదనుకుంది. కొత్త మతం ఏదయినాకావాలి . వ్యక్తి స్వాతంత్ర్యిం హరించని , ఆలోచనలను అదుపుచేయని మతం కోసము వెదకడం మొదలు పెట్టింది . ఆ సమయం లో మార్గరెట్ కి ఎవరో బుద్ధుని జీవితానికి సంబందించిన పుస్తకం ఇచ్చారు . అది చదివిన మార్గరెట్ ఆసియాఖండదేశాలలోని మతాలగురించిన అవగాహన ఏర్పడింది.

అమెరికాలో సర్వమత సమావేశానికి హాజరై భారత దేశము వెళుతూ లండన్‌ లో ఆగిన వివేకానందుడు ఇస్తున్న ప్రసంగాలకు మార్గరెట్ ఆకర్షితురాలై భారతదేశము చేరి రామక్రిష్ణామిషన్‌ లో చేరి సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ ''సిస్టర్ నివేదిత'' గా  వివేకానందుడిచేత పిలిపించుకుంది. ఆ వి్ధముగా భారతదేశములో తన జీవితం దశాబ్దము గడిచింది . కాని ఎందుకో తాను అట్టేకాలం బ్రతకనన్న భావన మొదలైనది.ఆ రోజుల్లో వైద్యవిధానాలు , చికిత్సలు అంతగా అభివృద్ధి చెందని కారణము గా తన అనారొగ్యానికి కారణం తెలియ పర్చలేదు.  నా జీవితం మరో రెండేళ్ళు మించి లేదేమో అంటూ 1908 లొ ఆమె ఒక స్నేహితురాలికి ఉత్తరం రాసింది. ఏ స్నేహితురాలకైతే ఉత్తతం రాసిందో ఆమె మరణానికి దగ్గరగా ఉందని , తనను చూడాలనుకుంటుందని తెలిసి ఆరోగ్యము అంత బాగులేదని తెలిసికూడా బోస్టన్‌ వెళ్ళింది. దురదుస్టవశాత్తూ ఆ స్నేహితురాలి కూతురు నివేదిత మీద ఫిర్యాదుచేసింది. తమ తల్లిని మభ్యపెట్టి ఆస్తిని భారతదేశము తీసుకువెళ్తుందని ఫిర్యాదు. అలాంటి అవమారము తనకు జరుగుతుందని భావించని సిస్టర్ నివేదిత స్నేహితురాలి మరణం తర్వాత ఏప్రిల్ 11 , 1911 న తిరిగి భారతదేశము వచ్చింది. జీవితము లో నిరాశచెందిన ఆమె మనశ్శాంతి కోసము శాంతిదేశమైన భారత్ లోనే మనగలిగింది. దసరా సెలవులలో ఆమె మనసుకు విశ్రాంతి అవసరమని ప్రశాంతవాతావరణం కోసము మిత్రుది కుటుంబం తో కలిసి డార్జిలింగ్ వెళ్ళి రక్తవిరేచనాలు పట్టున్నందున వైద్యము ఇప్పించినా ఆమె శరీరము స్పందించలేదు . చివరిదశలో అనేకరకాల ఆద్యాత్మిక వాక్యాలు సిస్టర్ నివేదిత తన పుస్తకాలలో రాసుకున్నారు. ఆరోగ్యము మరింత క్షీణించడం తో 13 అక్టోబర్ 1911 న 2.30 గంటలకు తెల్లవారు జామున భగవంతునిలో లీనమైనది.

Source : Courtesy with Swathi Telugu weekly magazine and others.
  • ========================
Visit my website - > Dr.seshagirirao.com/

Thursday, March 14, 2013

Ram manohar Lohiya,రామ్‌మనోహర్ లోహియా

  •  


మానవులు పుడతారు ... చనిపోతారు . కొంతమంది మాత్రమే తమ జీవితం లో ప్రజలకు ఉపయోగపడే సేవాకార్యక్రమాలు చేసి తమ జీవితాన్నే ఫణం గా పెట్టి మానవ జాతిలో చిరస్థాయిగా తరతరాలుగా నిలిచిపోతారు ... వీరిని "మృతంజీవులు" అని అంటారు . కోటాను కోట్ల జనం లో బహు కొద్ది మంది మాత్రమే ఇలాంటివారు ఉంటారు . ప్రపంచము లో ప్రతి జాతి లోనూ ఈ తరహా మహానుభావులు పుట్టి తమ సేవలతో పుణీతులయ్యారు . భారత జాతికి మణిపూసలైన కొందరి మహానుభావులను తెలుసుకునే ప్రయత్నం లో ఇక్కడ -- Ram manohar Lohiya,రామ్‌మనోహర్ లోహియా- గురించి తెలుసుకొని మన జీవితాన్ని చక్కని మార్గములో ప్రయాణించే ప్రయత్నం చేద్దాము ....

             
సామ్యవాద స్వాప్నికుడు!నిర్భీతికి, నిజాయితీకి చిరునామా గామారి సమాజ శ్రేయస్సుకై తుది శ్వాస దాకా పరితపించిన విలక్షణ రాజకీయవేత్త రామ్‌మనోహర్ లోహియా. స్వాతంత్య్ర సంగ్రామం లో అతి కీలకఘట్టమైన క్విట్ ఇండి యా ఉద్యమంలో ఉద్ధండులైన నేతలందరూ నిర్భంధానికి గురైన సందర్భంలో, లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్ వంటి నాయకులతో కలిసి పోరాటాన్ని ఉధృతం చేయడంలో లోహియా నిర్వహించిన పాత్ర అనన్యం. 1910 మార్చి 23న ఉత్తరప్రదేశ్‌లోని అక్బర్‌పూర్‌లో సంపన్నుల ఇంట జన్మించిన లోహియా ఆడంబరాలకు దూరంగా జీవించారు. కష్టపడటంలోనే తృప్తి ఉందన్నది లోహియా సిద్ధాం తం. బెర్లిన్ విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ పట్టా సాధించినప్పుడు కూడా ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాడు. విదేశాల నుంచి తిరిగొచ్చిన అనంతరం గాంధీ అనుచరుడుగా స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్నప్పటికీ భగత్‌సింగ్, సుభాష్‌చంద్రబోస్ వంటి విప్లవవాదుల ప్రభావం లోహియాపై ఉంది. దేశానికి స్వాతంత్య్రం వస్తేచాలన్న పరిమిత లక్ష్యానికి లోహియా ఎన్నడూ లోనుకాలేదు.

ప్రపంచ దేశాల్లోని అన్ని జాతుల విముక్తితోపాటు వర్ణ వివక్ష పూర్తిగా రూపుమాసినప్పుడే, మానవాళి సంపూర్ణంగా వికసించడం సాధ్యమని నమ్మిన క్రాంతదర్శి. స్వాతంత్య్రానంతర భారతదేశాన్ని గురించి లోహియా ఎన్నో కలలుకన్నాడు. దేశ భవి ష్యత్తుకూ, దారిద్య్ర నిర్మూలనకూ ‘ప్రజాస్వామిక సామ్యవాద’ సాధనే మార్గమని భావించిన నేత లోహియా. గాంధీ, మార్క్స్‌లను ఎంతగా అభిమానించినప్పటికీ, వారి సిద్ధాంతాలను మాత్రం లోహియా యథాతథంగా అంగీకరించకపోవడం గమనార్హం. ‘గాంధీ-మార్క్స్ అండ్ సోషలిజం’ అన్న తన ప్రసిద్ధ గ్రంథంలో, తన భావాన్ని మరింత లోతుగా వివరిం చారు. భారత రాజకీయాల్లో ‘తృతీయశక్తి’ అన్న భావనకు, ఆచరణ రూపాన్ని కల్పిం చిన ఘనత లోహియాకే సొంతం.

దేశంలో సోషలిస్టు ఉద్యమ నిర్మాణానికి నడుంబిగించడమే కాక, అంటరానితనానికి, కులవివక్షకు వ్యతిరేకంగా అనేక పోరాటాలు సాగించారు. స్వదేశీ సంస్థానాల విలీనం, గోవా విమోచనోద్యమంలో లోహియా నిర్వహించిన పాత్ర ఎంతో కీలకమైనది. ఆంగ్ల భాషా వ్యతిరేకోద్యమం సహా నేపాల్ రాచరిక వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడటంలో లోహియా గణనీయమైన కృషిని సాగించారు. రాజకీయ జీవితాచరణలో విలువలకు పట్టంగట్టిన రామ్‌మనోహర్ లోహియా 1967 అక్టోబర్ 12న ఢిల్లీలోని విల్లింగ్టన్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ఆయన జ్ఞాపకార్థం, ఆ ఆసుపత్రి పేరును ‘డాక్టర్ రామ్‌మనోహర్ లోహియా ఆసుపత్రి’గా నామకరణం చేశారు. మరణానికి ముందు తన చుట్టూ గుమిగూడిన వైద్యులను ఉద్దేశించి లోహియా అన్న మాటలు మరువలేనివి-‘‘ఈ దేశంలో కోట్లాది మంది ప్రజలకు డాక్టర్ల రూపురేఖలు ఎలా ఉంటాయో కూడా తెలియదు. అలాంటిది, నా కోసం ఇంత మంది డాక్టర్లా!’’ అంటూ కన్నీరు కార్చడం ఆయన మహోన్నత వ్యక్తిత్వానికి అద్దం పట్టడమే కకా, నేటికీ మన పాలకులకు అదొక హెచ్చరికగా మిగిలిపోయింది.

లెక్కల వెంకటరెడ్డి లెక్కలవారి పల్లె, వైఎస్సార్ కడప జిల్లా-(నేడు రామ్‌మనోహర్ లోహియా 45వ వర్థంతి)@ http://www.sakshi.com/
  • ========================= 
Visit my website - > Dr.seshagirirao.com/

Madapati Hanumantharao,మాడపాటి హనుమంతరావు


  •  
మానవులు పుడతారు ... చనిపోతారు . కొంతమంది మాత్రమే తమ జీవితం లో ప్రజలకు ఉపయోగపడే సేవాకార్యక్రమాలు చేసి తమ జీవితాన్నే ఫణం గా పెట్టి మానవ జాతిలో చిరస్థాయిగా తరతరాలుగా నిలిచిపోతారు ... వీరిని "మృతంజీవులు" అని అంటారు . కోటాను కోట్ల జనం లో బహు కొద్ది మంది మాత్రమే ఇలాంటివారు ఉంటారు . ప్రపంచము లో ప్రతి జాతి లోనూ ఈ తరహా మహానుభావులు పుట్టి తమ సేవలతో పుణీతులయ్యారు . భారత జాతికి మణిపూసలైన కొందరి మహానుభావులను తెలుసుకునే ప్రయత్నం లో ఇక్కడ - Madapati Hanumantharao,మాడపాటి హనుమంతరావు- గురించి తెలుసుకొని మన జీవితాన్ని చక్కని మార్గములో ప్రయాణించే ప్రయత్నం చేద్దాము ....
             
రైతాంగ జీవితంపై 1912లో తొలి కథానిక ‘ఎవరికి?’ రచించిన మాడపాటి హనుమంతరావు జీవితం కేవలం సాహిత్యరంగానికే పరిమితం కాలేదు. తెలుగువారి సాంస్కృతిక, సాంఘిక, రాజకీయ జీవనాన్ని ఆయన తన ఆచరణతో గాఢంగా ప్రభావితం చేశారు. కృష్ణాజిల్లా ఒక్కనూరు గ్రామం లో 1885, జనవరి 22న జన్మించిన మాడపాటి ఆంధ్రమహాసభ నేతృత్వంలో సాగిన ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. మాడపాటి గ్రంథాలయోద్యమంలో నిర్వహిం చిన భూమిక ఎన్నదగినది.

పాత్రికేయునిగా కూడా ఆయన తనదైన ముద్ర వేశారు. బాలికల కోసం ఆయన ఎన్నో పాఠశాలలను నెలకొల్పారు. ఆయన పేర ఈనాటికీ హైదరాబాద్ నగరంలోని నారాయణగూడలో ప్రసిద్ధ పాఠశాల మనుగడలో ఉంది. హైదరాబాద్‌లోని శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయం, హన్మకొండలోని రాజరాజనరేంద్ర ఆంధ్ర గ్రంథాల యం మాడపాటి చల్లని నీడన ఎదిగినవే. 1951లో ఆయన హైదరాబాద్ నగర మేయర్‌గా ఎన్నికయ్యారు. 1958లో శాసనమండలి తొలి అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వహించారు. మాడపాటి 1970, నవంబర్ 11న 85వ ఏట కన్నుమూశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆయనను గౌరవ డాక్టరేట్‌తో, భారత ప్రభుత్వం ‘పద్మ భూషణ్’ బిరుదుతో గౌరవించాయి. ‘ఆంధ్ర పితామహ’గా ఖ్యాతినొందిన మాడపాటి తెలుగువారందరికీ ప్రాతఃస్మరణీయుడు.
వంకాయలపాటి రవి కూకట్‌పల్లి, హైదరాబాద్

(నేడు ‘ఆంధ్రపితామహ’ మాడపాటి 42వ వర్ధంతి)- @ http://www.sakshi.com/
  • ==========================
Visit my website - > Dr.seshagirirao.com/

Jhulkaribhai,ఝల్కారిబాయి

  •  

మానవులు పుడతారు ... చనిపోతారు . కొంతమంది మాత్రమే తమ జీవితం లో ప్రజలకు ఉపయోగపడే సేవాకార్యక్రమాలు చేసి తమ జీవితాన్నే ఫణం గా పెట్టి మానవ జాతిలో చిరస్థాయిగా తరతరాలుగా నిలిచిపోతారు ... వీరిని "మృతంజీవులు" అని అంటారు . కోటాను కోట్ల జనం లో బహు కొద్ది మంది మాత్రమే ఇలాంటివారు ఉంటారు . ప్రపంచము లో ప్రతి జాతి లోనూ ఈ తరహా మహానుభావులు పుట్టి తమ సేవలతో పుణీతులయ్యారు . భారత జాతికి మణిపూసలైన కొందరి మహానుభావులను తెలుసుకునే ప్రయత్నం లో ఇక్కడ -Jhulkaribhai,ఝల్కారిబాయి- గురించి తెలుసుకొని మన జీవితాన్ని చక్కని మార్గములో ప్రయాణించే ప్రయత్నం చేద్దాము ....


నిష్పాక్షిక దృష్టితో చరిత్రను తరచి చూస్తే కాలగర్భంలో కలిసిపోయిన ఎన్నో నిష్టుర సత్యాలు వెలుగు చూస్తాయన్నది అక్షరసత్యం. చరిత్రకారుల నిర్లక్ష్యంతో వెలుగులోకి రాక అలా మరుగునపడ్డ ఝల్కారిబాయి జీవిత చరిత్ర ఎంత విలక్షణమైనదో అంత అపురూపమైనది. ఝాన్సీ లక్ష్మీబాయి పరాక్రమాన్ని తలపించే అరుదైన చరిత్రకు ప్రతీక దళిత సిపాయి వీరనారి ఝల్కారిబాయి. భారత స్వాతంత్య్రోద్యమ చరిత్రలో సిపాయి తిరుగుబాటుగా, ‘ప్రథమ భారత స్వాతంత్య్ర సంగ్రామం’గా ప్రసిద్ధిగాంచిన 1857-58 నాటి వీరోచిత పోరాట ఘట్టంలో ఝాన్సీరాణి లక్ష్మీబాయికి ప్రతిరూపంగా కీలక భూమికను పోషించిన ఘనత దళిత బహుజన భూమిపుత్రిక ఝల్కారిబాయికే దక్కుతుంది. బుందేల్‌ఖండ్ ప్రాం తంలో ప్రజలు పాడుకునే జానపద బాణీల్లో ఝాన్సీలక్ష్మీబాయి సరసన ఝల్కారిబాయి సాహసాలను పాటల రూపంలో నేటికీ గుర్తుచేసుకోవడం విశేషం.

ఝాన్సీ సమీపంలోని భోజ్‌లా గ్రామంలో కోరీ కులానికి చెందిన సదోవర్ సింగ్, జమునాదేవి దంపతులకు నిరుపేద వ్యవసాయకూలీ కుటుంబంలో 1830 నవంబర్ 22న జన్మిం చిన ఝల్కారిబాయి వీరనారిగా ఎదిగి, నేడు దళిత బహుజనుల ఆత్మగౌరవ పతాకగా మారింది. చిన్న వయసులోనే తల్లి మరణించడంతో తండ్రి పెంపకంలో గుర్రపుస్వారీ, కత్తిసాము వంటి యుద్ధ విద్యలు నేర్చుకుంది. అడవిలో పశువులను మేపుతున్న ఝల్కారిపై దాడి చేసిన చిరుత పులిని కేవలం చేతికర్రతో చాకచక్యంగా హతమార్చిన ఘటన సంచలనం రేపింది. ఝాన్సీలక్ష్మీబాయి సైన్యంలో ఆయుధ విభాగంలో పనిచేస్తున్న పూరణ్‌సింగ్‌ను వివాహం చేసుకున్న ఝల్కారిబాయి, తదనంతర కాలంలో లక్ష్మీబాయికి సన్నిహితమై సైన్యంలో చేరి ‘దుర్గావాహిని’ మహిళా సాయుధ దళానికి నాయకత్వం వహించింది.

సిపాయి తిరుగుబాటు సందర్భంగా శత్రుసేనలతో జరిగిన యుద్ధంలో ప్రముఖ పాత్రను పోషించి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. 1858 ఏప్రిల్ 3న బ్రిటిష్ జనరల్ హగ్ రోజ్ నాయకత్వంలో బ్రిటిష్ సేనలు ఝాన్నీ రాజ్యాన్ని చుట్టుముట్టాయి. ఆ దాడి నుంచి లక్ష్మీబాయి సురక్షితంగా తప్పించుకుని కల్పి ప్రాంతంలో పోరాడుతున్న తిరుగుబాటు నాయకులను కలుసుకోవడానికి అనువుగా, ఝల్కారీబాయి తానే ఝాన్సీలక్ష్మీబాయినంటూ కోట ముందు ప్రత్యక్షమై బ్రిటిష్ సేనలను ముప్పుతిప్పలు పెట్టింది. ఆ దాడిలో ఝాన్సీలక్ష్మీబాయి రూపంలో బందీగా పట్టుబడ్డ ఝల్కారిబాయిని గుర్తుపట్టిన బ్రిటిష్ సేనలు, తదనంతర కాలంలో ఆమెను విడిచిపెట్టారా లేదా చంపేశారా అన్నది చెప్పడానికి స్పష్టమైన ఆధారాలు లేవు. ఝల్కారిబాయి సాహసంతో స్ఫూర్తి పొందిన దళిత బహుజన రాజకీయ పార్టీల కార్యకర్తలు నేడు క్షేత్రస్థాయిలో ఝల్కారిబాయి జీవితాన్ని, పోరాట ఘట్టాలను నాటకాలు, కథలుగా మలచి ఊరూరా ప్రచారం చేస్తున్నారు. భారత ప్రభుత్వం, ఆమె జ్ఞాపకార్థం పోస్టల్ స్టాంపును విడుదల చేయడం గమనార్హం.

--బట్టు వెంకయ్య బహుజన టీచర్స్ అసోసియేషన్, తెనాలి, గుంటూరు జిల్లా
(నేడు ఝల్కారిబాయి 182వ జయంతి)@http://www.sakshi.com/main/
  • =====================
Visit my website - > Dr.seshagirirao.com/

Kalojii Narayanarao, కాళోజీ నారాయణరావు

  •  


మానవులు పుడతారు ... చనిపోతారు . కొంతమంది మాత్రమే తమ జీవితం లో ప్రజలకు ఉపయోగపడే సేవాకార్యక్రమాలు చేసి తమ జీవితాన్నే ఫణం గా పెట్టి మానవ జాతిలో చిరస్థాయిగా తరతరాలుగా నిలిచిపోతారు ... వీరిని "మృతంజీవులు" అని అంటారు . కోటాను కోట్ల జనం లో బహు కొద్ది మంది మాత్రమే ఇలాంటివారు ఉంటారు . ప్రపంచము లో ప్రతి జాతి లోనూ ఈ తరహా మహానుభావులు పుట్టి తమ సేవలతో పుణీతులయ్యారు . భారత జాతికి మణిపూసలైన కొందరి మహానుభావులను తెలుసుకునే ప్రయత్నం లో ఇక్కడ -Kalojii Narayanarao, కాళోజీ నారాయణరావు- గురించి తెలుసుకొని మన జీవితాన్ని చక్కని మార్గములో ప్రయాణించే ప్రయత్నం చేద్దాము ....


తెలంగాణ తొలిపొద్దు కాళోజీ!-‘అన్యాయాన్నెదిరిస్తే నా గొడవకు సంతృప్తి-అన్యా యం అంతరిస్తే నా గొడవకు ముక్తిప్రాప్తి. అన్యాయాన్నెదిరించిన వాడే నాకారాధ్యుడు’ అని సగర్వంగా ప్రకటించి ఉద్యమమే ఊపిరిగా జీవించిన ప్రజాకవి కాళోజీ నారాయణరావు. 1914 సెప్టెంబర్ 9న కర్ణాటక రాష్ట్రం, బిజాపూర్ జిల్లాలోని రట్టిహళ్లి గ్రామంలో జన్మించిన కాళోజీ తెలుగు, ఉర్దూ, హిందీ, మరాఠీ, కన్న డ, ఇంగ్లిష్ భాషల్లో రచయితగా ప్రఖ్యాతిగాంచారు. రాజ కీయ వ్యంగ్య కవిత్వం రాయడంలో కాళోజీ దిట్ట. ‘నా గొడవ’ పేరిట సమకాలీన సామాజిక సమస్యలపై నిర్మొహమాటంగా, నిక్కచ్చిగా, కటువుగా స్పందిస్తూ పాలకులపై అక్షరాయుధాలను సంధించి ప్రజాకవిగా కీర్తిగడించారు. తెలంగాణ ప్రజల ఆర్తి, ఆవేదన, ఆగ్రహం ఆయన గేయాల్లో రూపుకడతాయి. బిజాపూర్ నుంచి వరంగల్ జిల్లాకు తరలివచ్చిన కాళోజీ కుటుంబం మడికొండలో స్థిరపడింది.

ప్రాథమిక విద్యానంతరం హైదరాబాద్ పాతబస్తీలోని చౌమహల్లా పాఠశాలలో కొంతకాలం చదివిన కాళోజీ, అటు తరువాత సిటీ కాలేజ్‌లోనూ, హనుమకొండలోని కాలేజియేట్ హైస్కూల్‌లోనూ చదువు కొనసాగించి మెట్రిక్యులేషన్ పూర్తిచేశారు. 1939లో హైదరాబాద్‌లో హైకోర్టుకు అనుబంధంగా ఉన్న లా కళాశాల నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. 1930 నుంచే కాళోజీ గ్రంథాలయోద్యమంలో ఎంతో చురుగ్గా పాల్గొన్నారు. తెలంగాణలోని ప్రతి గ్రామంలో ఒక గ్రంథాలయం ఉండాలన్నది కాళోజీ ఆకాంక్ష. సత్యాగ్రహోద్యమంలో పాల్గొని 25 సంవత్సరాల వయసులో జైలుశిక్ష అనుభవించారు. నిజామాంధ్ర మహా సభ, హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్‌తో కాళోజీ అనుబంధం విడదీయరానిది.

మాడపాటి హనుమంతరావు, సురవరం ప్రతాపరెడ్డి, జమలాపురం కేశవరావు, బూర్గుల రామ్‌కిషన్‌రావు, పీవీ నరసింహారావు వంటి వారితో కలిసి కాళోజీ అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారు. విద్యార్థి దశలోనే నిజాం ప్రభుత్వ నిషేధాజ్ఞలను ఉల్లంఘించి వరంగల్లులో గణపతి ఉత్సవాలు నిర్వహించారు. తెలంగాణలో అక్షరజ్యోతిని వ్యాపింపజేయాలన్న తపనతో ఆంధ్ర సారస్వత పరిషత్తును స్థాపించిన ప్రముఖుల్లో కాళోజీ ఒకరు. రజాకార్ల దౌర్జన్యాన్ని ప్రతిఘటిస్తూ 1945లో పరిషత్తు ద్వితీయ మహాసభలను దిగ్విజయంగా నిర్వహించడంలో కాళోజీ ప్రదర్శించిన చొరవ, ధైర్యసాహసాలను ఆయన అభిమానులు ఇప్పటికీ గుర్తుచేసుకుంటుంటారు. వరంగల్ కోటలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడానికి ప్రయత్నించినందుకు ఆయనకు నగర బహిష్కరణశిక్ష విధించారు. స్వరాజ్య సమరంలో పాల్గొని ఉస్మానియా విద్యార్థులు బహిష్కరణకు గురైనప్పుడు, వారిని నాగపూర్ విశ్వవిద్యాలయంలో చేర్పించి ఆదుకోవడంలో కాళోజీ పాత్ర అనన్యం. 1953లో తెలంగాణ రచయితల సంఘం ఉపాధ్యక్షుడుగా ఎన్నికయ్యారు. 1958లో ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి శాసనమండలికి ఎన్నికయ్యారు. కాకతీయ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ప్రదానం చేయగా, భారత ప్రభుత్వం పద్మవిభూషణ్ అవార్డుతో సత్కరించింది. ‘హింస తప్పు, రాజ్యహింస మరీ తప్పు’ అంటూ సామాన్యుడే నా దేవుడని ప్రకటించిన కాళోజీ 2002 నవంబర్ 13న తుదిశ్వాస విడిచారు.

-దొమ్మాట వెంకటేశ్ హైదరాబాద్-(నేడు ప్రజాకవి కాళోజీ నారాయణరావు పదవ వర్థంతి) @http://www.sakshi.com/

=========================
Visit my website - > Dr.seshagirirao.com/