Tuesday, January 22, 2013

మున్సీ ప్రేంచంద్‌-Munshi Premchand

  •  
  •  
మానవులు పుడతారు ... చనిపోతారు . కొంతమంది మాత్రమే తమ జీవితం లో ప్రజలకు ఉపయోగపడే సేవాకార్యక్రమాలు చేసి తమ జీవితాన్నే ఫణం గా పెట్టి మానవ జాతిలో చిరస్థాయిగా తరతరాలుగా నిలిచిపోతారు ... వీరిని "మృతంజీవులు" అని అంటారు . కోటాను కోట్ల జనం లో బహు కొద్ది మంది మాత్రమే ఇలాంటివారు ఉంటారు . ప్రపంచము లో ప్రతి జాతి లోనూ ఈ తరహా మహానుభావులు పుట్టి తమ సేవలతో పుణీతులయ్యారు . భారత జాతికి మణిపూసలైన కొందరి మహానుభావులను తెలుసుకునే ప్రయత్నం లో ఇక్కడ - మున్సీ ప్రేంచంద్‌-Munshi Premchand- గురించి తెలుసుకొని మన జీవితాన్ని చక్కని మార్గములో ప్రయాణించే ప్రయత్నం చేద్దాము ....

1980 జూలై 31 న ఉత్తర ప్రదేశ్ లోని వారణాసి లో జన్మించిన మున్షి ప్రేమ్ చంద్  భారతదేశపు ప్రముఖ హిందీ, మరియు ఉర్దూ కవి. ఇతని కలం పేరు ప్రేమ్ చంద్. హిందీ, ఉర్దూ భాషా సాహిత్యాలలో అత్యంత ప్రముఖమైన పేరు సంపాదించాడు.

మున్షీ ప్రేంచంద్‌ ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సాంఘీక జీవనంలో మనిషి తనాన్ని, మంచి తనాన్ని పెంపొందించడానికి తన రచనల ద్వారా కృషి చేసిన మహరచయిత ఉర్దూలో హిందీలో కథలు, నవలలు, సంపాదకీయాలు రాసిన మహానీ యుడు, పిల్లల మానసిక ప్రవర్తన గురించి కూడా గొప్ప కథలు రాశాడు. కథలు లేకుండా మనిషి జీవితాన్ని ఊహించలేం. కథలు లేకుంటే మనిషి పిచ్చివాడైపోతాడు. పాట నుంచి మొదలైన మనిషి జీవితం కథ నుంచి కొనసాగుతుంది. మనిషి చనిపోయిన తరవాత కూడా కథలాగా కొనసాగుతుంది. కథలు ఏం చేస్తాయి. కథలు మనల్ని ఆలోచింపచేస్తాయి. కొన్ని కథలు నవ్విస్తాయి. కొన్ని కథలు మన కళ్లు తెరిపిస్తాయి. కొన్ని కథలు మన కళ్లల్లో గడ్డకట్టిన కన్నీళ్లని ప్రవహింప చేస్తాయి. మనసు కరిగిపోతుంది. కథల్లో మనకు తెలియని మహాత్తు ఉంది. ఈ మధ్య అలాంటి కథ చాలా రోజుల తరువాత మళ్లీ చదివాను. అది ప్రపంచంలోని గొప్ప కథకుల్లో ఒకడైన మున్సీ ప్రేంచంద్‌ కథ ‘ఈద్‌ పండుగ’. ఈ కథ చదివిన వ్యక్తుల కళ్లు కూడా ఆ కథలోని హమీద్‌ నానమ్మ అమీనాతో పాటు వర్షిస్తాయి. మనిషిగా ఎలా వుండాలో ఆలోచింప చేస్తాయి. ఈ కథలో ప్రేమా, మానవత్వం అనుబంధం ఎన్నో కలగలిపి ఉంటాయి.  అలాంటి కథే ‘ఈద్‌ పండుగ’ మన మనస్సులని కదిలించే కథ. మన భావోద్వేగాలకి చలనం ఇచ్చే కథ. ప్రేంచంద్‌ రాసిన కథ ల్లో చాలా గొప్ప కథ ‘ఈద్‌ పండుగ’ ఈ కథ ఈద్గా (మసీదు) పేరు తో అనువాదం అయ్యింది.



ప్రేమ్‌చంద్ 1880, జూలై 31న వారణాసి దగ్గర కాశికి నాలుగు మైళ్ళ దూరములో ఉన్న లమ్హీ గ్రామంలో ఒక తపాలా గుమాస్తా మున్షీ అజైబ్ లాల్ మరియు ఆయన భార్య ఆనందికి జన్మించాడు. ఆయన తల్లితండ్రులు ఈయనకు ''ధన్‌పత్ రాయ్'' అని పేరుపెట్టారు. ఈయన మామ మహాబీర్, ఇతనిని 'నవాబ్' అని పిలిచేవాడు. ఈ పేరుతోనే ప్రేమ్‌చంద్ కొన్ని తొలి రచనలు చేశాడు. ప్రేమ్‌చంద్ తల్లితండ్రులు ఆయన బాల్యంలోనే మరణించడంతో  సవతి తల్లి మరియు ఆమె పిల్లల బాధ్యత  ప్రేమ్ చంద్  పై పడింది. వారి కుటుంబము లో ఆరోగ్యము అంతంతమాత్రమే . అనారోగ్యము వారసత్వమూగా అందుకున్నాడు ప్రేమంచంద్ . ఆరోగ్యము సహకరించక , ఉద్యోగములో వస్తున్న తరచూ బదిలీలు భరించలేక ఉద్యోగము మానేసి పూర్తికాలం రచయితగా స్థిరపడ్డాడు .

ప్రేంచంద్ కి బాల్యములోనే వివాహమైంది. కాని అది బలవంతపు వివాహము , అయిష్ట వివాహము  అనేవారు. పెద్దలు చేసిన పెళ్ళిని ఆయన అంగీకరించలేదు. ఆమె తో సంసారము చెయ్యలేదు.  ఈ లోగా పేపర్లో ఒక ప్రకటన చూశారు . బాల్యములోనే వివాహవైధవ్యము సంభవించిన 11 యేళ్ళ బాలికను వివాహమాడేందుకు అభ్యుదయభావావు కలిగిన యువకుడు కావాలి అనేది ఆ ప్రకటన . అది చూసి ప్రేంచంద్ స్పందించాడు . తాను చేసుకుంటానని ముందుకు వెళ్ళాడు .. ఆ విధము గా " శివరాణీదేవి " ని ఇష్టపడి పెళ్ళిచేసుకున్నాడు . తనకు ఇంతకుముందు పెళ్ళి అయిన విషయము చెప్పలేదు. సమాజపు కట్టుబాట్లు తెంచే ప్రయత్నము చేశాడు . విద్యాశాఖలో ఇన్‌స్పెక్టర్ గా పనిచేస్తూ రచనలు చేస్తూ ఉండేవారు. రచయితగా మంచి గుర్తింపు వచ్చింది . 1920 లో వచ్చిన సహాయనిరాకరణ ఉద్యమం లో గోరఖ్ పూర్ లో గాంధీజీ చేసిన ప్రసంగానికి ప్రభావితుడై  ప్రభుత్వ ఉద్యోగము వదిలేసి పూర్తిస్థాయి రచయితగా ప్రెస్ పెట్టుకొని , పత్రికలు నడుపుతూ జీవితం గడిపేవారు. 250 కధలు , 12 నవలలు రచించాడు .

సమాజములోని లోటుపాట్లను , స్త్రీలకు జరుగుతున్న అన్యాయాలను , మూఢనమ్మకాలను  నిరసిస్తూ రచనలు చేశాడు . మంచి పేరు ప్రతిస్టలు సంపాదించాడు . రెండవ భార్యకు తన మొదటి వివాహము  గురించి తెలిసింది. ఆ విషయము మీద ఇద్దరూ వాదులాడుకున్నారు . వారి సంసారములో వాదులాటలు సామాన్యము అయినా వారిద్దరి మధ్యా ప్రేమ , అనురాగము అధికము .  ప్రేంచందను వదిలి శివరాణీదేవి దూరంగా ఉండేందుకు ఒక్క క్షణము ఇష్టపడేదికాదు . ప్రేంచంద్ కూడా అంతే. ఏ మాత్రము నలతగా అనిపించినా ఆమెను పక్కన కూర్చోపెట్టుకొని తన జీవితంలోని విషయాలు ఆమెకు చెపుతుండేవారు.  భర్తకున్న అనారోగ్య సమస్యలు , జీర్ణకోశ సమస్యలు ఆమెకు ఆందోళన కలిగిస్తూఉండేవి . ఎంతో శ్రద్ద తీసుకొని చూసుకుంటూ తన సాహిత్యసేవా , పత్రిక సేవా నడపడము లో సహకరిస్తూ ఉండేవారు.

ప్రేమ్‌చంద్ 1935 లో జ్వరము బాధపడుతూ పత్రికకు సంపాదకీయము రాయడము మొదలు పెట్టగానే భార్య అభ్యంతరము పెట్టింది. అందుకు ఆయన " రాణీ నువ్వు పొరపడుతున్నావు . నేను నాకు నచ్చిన పని చేయుచున్నాను . ఇందులో నాకు ఆనందము దొరుకుతుంది. ఇది ఒకరకమైన మత్తును కలిగిస్తుంది. కాని ఇది చెడుపని కాదు. నేను దీపం వంటి  వాడిని ... వెలుతురును ఇస్తాను , ఆ వెలుతురు ఇతరులు లాభానికి వాడుకుంటారో , నష్టపోతారో నాకు సంబంధము  లేదు . " అన్న తర్వాత ఇక ఆమె అడ్డు చెప్పలేదు . నాటి నుండి ఆయన ఆరోగ్యము తగ్గడము మొదలు పెట్టింది.

1936 లో ' గోదాన్‌ ' అచ్చు అయింది. మంగళసూత్రమనే మరో నవలను ఆలోచిస్తున్నారు. కాని ఆరోగ్యము సహకరించలేదు . తన ఆరోగ్యము వలన భార్య బాధపడుతుందని ఆయనకు దిగులు. రక్తపు వాంతులు అయ్యాయి . ఆమె సుభ్రము చేసింది. పక్కన వచ్చికూర్చుని నుదుటిమీద చెయ్యివేసి ఉంచమని భార్యను  కోరాడు . ఆమె కంటనీరుతో అలాగే కూర్చుంది. నీకు తెలియకుండా దాచిన రహస్యాలను చెబుతాను విను.  " నా మొదటి వివాహం తర్వాత మరో స్త్రీ నా జీవితం లోకి ప్రవేశించింది. నిన్ను పెళ్ళిచేసుకున్నాక కూడా ఆమెతో నా సంబంధం కొనసాగింది. అలాగే నీకు చెప్పకుండా కొందరికి డబ్బులు ఇచ్చి , ఆ అప్పు ను తీర్చేందుకు  కధలు రాసేవాడిని " ఇలా తాను చేసిన తప్పులను ఒప్పుకోవడము మొదలు పెట్టాడు .  నిజానికి అవన్నీ భార్యకు తెలుసు . అయినా ఆయన కోసము వాటిని తెలియనట్టుగానే ఉంది.  ఆ విషయము ప్రేంచంద్ కి అర్ధమయ్యేసరికి భార్య శివరాణీదేవి మీద గౌరవం , ప్రేమ పెరిగిపోయింది.

అన్నీ తెలిసి నన్ను నిలదీయని నీ హృదయం ఎంత ఉన్నతమైనదో ఈ రోజు గ్రహించాను . నాకిప్పుడు ఎక్కువ కాలము బ్రతకాలని ఉంది నాకోసము కాదు ... నా భార్యకోసము ... ఆమె మహాత్యాగి . ఆమె తో కలిసి మరికొంతకాలము ఉండాలనివుంది. నన్ను బ్రతికించు . వచ్చే జన్మలో కూడా ఈమెనే నా అర్ధాంగిగా చెయ్యి ... కనీసము నా ఈ చివరి ప్రార్ధనన్నా ఆలకించు ... అని తనలోతాను సణుగుతున్నారు. మనము ఎవరికీ ఏ అపకారము  చెయ్యలేదు . భగవంతుడు మన మొర తప్పక ఆలకిస్తాడు . రాణీ ,, నువ్వు నాపక్కనే ఉండు . ఎక్కడికీ వెళ్ళకు . నువ్వు ఉంటే నాకు ధైర్యము గా ఉంటుంది . నీకు చెప్పాలకున్న విషయాలు పూర్తిగా చెప్పగలుగుతాను.  ఇది జరిగిన రెండవరోజూ అంటే ... అక్టోబర్ -08 -1936 న విరోచనమైంది. రాణి శుభ్రం చేద్దామనుకుంటుండగానే ఆయన శరీరము చల్లబడింది. ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. 56 సంవత్సరాలకే ఆ మహా రచయిత జీవితం అంతమైంది.

మూలము : చివరి రోజుల్లో@స్వాతి వారపత్రిక .... 11-1-2013



===========================
Visit my website - > Dr.seshagirirao.com/

Sunday, January 20, 2013

Cyrus Pallonji Mistry,సైరస్ పల్లోంజీ మిస్త్రీ

  •  

  •  
మానవులు పుడతారు ... చనిపోతారు . కొంతమంది మాత్రమే తమ జీవితం లో ప్రజలకు ఉపయోగపడే సేవాకార్యక్రమాలు చేసి తమ జీవితాన్నే ఫణం గా పెట్టి మానవ జాతిలో చిరస్థాయిగా తరతరాలుగా నిలిచిపోతారు ... వీరిని "మృతంజీవులు" అని అంటారు . కోటాను కోట్ల జనం లో బహు కొద్ది మంది మాత్రమే ఇలాంటివారు ఉంటారు . ప్రపంచము లో ప్రతి జాతి లోనూ ఈ తరహా మహానుభావులు పుట్టి తమ సేవలతో పుణీతులయ్యారు . భారత జాతికి మణిపూసలైన కొందరి మహానుభావులను తెలుసుకునే ప్రయత్నం లో ఇక్కడ -Cyrus Pallonji Mistry,సైరస్ పల్లోంజీ మిస్త్రీ- గురించి తెలుసుకొని మన జీవితాన్ని చక్కని మార్గములో ప్రయాణించే ప్రయత్నం చేద్దాము ....



టాటా గ్రూప్ ఛైర్మన్‌గా రతన్ టాటా నిష్క్రమించనున్నారు. ఆయన స్థానంలో కొత్త ఛైర్మన్‌గా సైరస్ మిస్త్రీ సోమవారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించనున్నారు. టాటా గ్రూపు ఛైర్మన్‌గా రతన్ టాటా పదవీ విరమణ తర్వాత ఆరో రథ సారథిగా యేడాది చివరి రోజున పగ్గాలు చేపట్టనున్నట్లు కంపెనీ ఉన్నతాధికారులు వెల్లడించారు. జంషెడ్‌జీ నుసెర్వాన్‌జీ టాటా 1868లో టాటా గ్రూపును స్థాపించారు. యాభై ఏళ్లు సంస్థకు సేవలందించిన మాజీ ఛైర్మన్ రతన్ టాటా పదవీ కాలం శుక్రవారంతో ముగిసింది.

ఇదిలావుండగా, షాపూర్‌జీ పల్లోంజీ కుటుంబానికి చెందిన సైరస్ మిస్త్రీ.. 2006లో టాటా గ్రూపు బోర్డులో చేరారు. టాటా గ్రూపు హోల్డింగ్ సంస్థ టాటా సన్స్‌లో పల్లోంజీ కుటుంబానికి 18 శాతం వాటా ఉంది. రతన్ టాటా తర్వాత ఛైర్మన్ పదవిలో ఎవరిని కూర్చోబెట్టాలా అని చాలా పెద్ద కసరత్తు జరిగింది. ఇందుకోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కమిటీ మొత్తం ఐదుగురు ప్రతిపాదిత సభ్యుల నుంచి చివరికి మిస్త్రీని ఎంపిక చేసిన విషయం తెల్సిందే. టాటా గ్రూప్ 6వ చైర్మన్‌ గా 28 డిసెంబర్ 2012 నుండి బాధ్యతలు చేపట్టారు .

పుట్టిన తేదీ : 04 జూలై 1968,
తల్లిదండ్రులు : పల్లోంజీ మిస్త్రీ : patsy perin Dubash ,
చదువు : B.E civil engineer with MBA from London Business School.
నేషనాలిటీ : ఐరిష్ ,
మతము : జోరాస్ట్ర్రియానిజం ,
భార్య : రోహిక మిస్త్రీ(Rohiqa chagla Mistry),
పిల్లలు : ఇద్దరు .
తోబుట్టువులు : ఒక అన్నయ్య : షపూర్ మిస్త్రీ , ఇద్దరు సిస్టర్స్ =లైలా మరియు అలూ ,

టాటా సంస్థలు : భారతదేశపు తొలి బహుళజాతి సంస్థ " టాటా" సంస్థలు . 20 వ శతాబ్దపు తొలి సంవత్సరాలలోనే వ్యాపార కార్యాలయం  కలిగిన సంస్థ టాటా సన్స్ . భారతదేశము బానిసపాలనలో  ఉన్న కాలములో జాతీయ భావాలు కలిగిన ఒక పార్శీ - జంషెడ్జీ టాటా ఈ సంస్థ ను నెలకొలిపారు. ప్రపంచములొ పలుదేశాలలో పరిశ్రమలు , పెట్టుబడులు కలిగిన టాటా లు ప్రవేశించని పరిశ్రమలేదు. ఉప్పునుండి సాప్ట్ వేర్ వరకు ప్రతి రంగములో వారి ఉత్పత్తులు ఉన్నాయి. టాటా స్టీల్ , టాటా లారీలు ,టాటా కార్లు , టాటా టీ , టాటా కెమికల్స్ , టాటా టెలికమ్యూనిమేషన్‌ ... ఇలా వారి ఉత్పత్తులు భారతీయలందరి జీవితాలను తాకేవే . నాన్యత విషయములో రాజీ పడని కంపెనీగా , నిజాయితీ విషయ్ము లో చాలా పారిశ్రామిక సంస్థలకన్నా మెరుగైనదిగా  టాటా లకు గుర్తింపు ఉంది. ఈ సంస్థల ఆధాయము సుమారు 100 బిలియన్ల డాలర్లు ఉంటుందని అంచనా . 80 దేశాలకు పైగా వీరి పెట్టుబడులు , పరిశ్రమలు కలిగి ఉన్నాయి.

52 ఏళ్ళపాటు చైర్మన్‌ గా వ్యవహరించిన జె.ఆర్.డి.టాటా నుండి వారసత్వముగా చైర్మన్‌ పదవిని 1991 లో రతన్‌ టాటా అందుకున్నారు. సుమారు 20 ఏళ్ళ పైబడి ఆయన ఆ పదవిలో ఉన్నారు. రతన్‌ టాటా అవివాహితుడైనందున తన 75 వ ఏట తన వారసుడుగా ఎంఫిక 5 గురు సభ్యులున్న కమిటీకి అప్పగించి ... అలా ఎన్నికైన వారే ఈ సైరస్ మిస్త్రీ.

టాటా గ్రూప్ చైర్మన్ జాబితా-List of Tata Group Chairmen

  1.    జమ్సేట్జి టాటా- Jamsetji Tata (1887–1904)
  2.    దొరబ్జి టాటా-Dorabji Tata (1904–1932)
  3.   నౌరోజీ శక్లత్వల- Nowroji Saklatwala (1932–1938)
  4.   జె.ఆర్ డి టాటా J. R. D. Tata (1938–1991)
  5.   రతన్ టాటా- Ratan Tata (1991–2012)  
  6. సైరస్ మిస్త్రీ -Cyrus Mistry (2012–present)

  •  ============================ 
Visit my website - > Dr.seshagirirao.com/

Sunday, December 16, 2012

Pandit RaviSankar-పండిట్‌ రవిశంకర్‌

  •  
  •  

మానవులు పుడతారు ... చనిపోతారు . కొంతమంది మాత్రమే తమ జీవితం లో ప్రజలకు ఉపయోగపడే సేవాకార్యక్రమాలు చేసి తమ జీవితాన్నే ఫణం గా పెట్టి మానవ జాతిలో చిరస్థాయిగా తరతరాలుగా నిలిచిపోతారు ... వీరిని "మృతంజీవులు" అని అంటారు . కోటాను కోట్ల జనం లో బహు కొద్ది మంది మాత్రమే ఇలాంటివారు ఉంటారు . ప్రపంచము లో ప్రతి జాతి లోనూ ఈ తరహా మహానుభావులు పుట్టి తమ సేవలతో పుణీతులయ్యారు . భారత జాతికి మణిపూసలైన కొందరి మహానుభావులను తెలుసుకునే ప్రయత్నం లో ఇక్కడ --పండిట్‌ రవిశంకర్‌-- గురించి తెలుసుకొని మన జీవితాన్ని చక్కని మార్గములో ప్రయాణించే ప్రయత్నం చేద్దాము ....


  ప్రముఖ సితార్‌ విద్వాంసుడు పండిట్‌ రవిశంకర్‌(92) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన అమెరికాలోని శాండియాగోలోని స్క్రిప్స్‌ మెర్సీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఏప్రిల్‌ 7, 1920లో వారణాసిలో జన్మించిన రవిశంకర్‌ హిందుస్థాని క్లాసికల్‌ సంగీతంలో పలు అవార్డులు అందుకున్నారు. మూడు సార్లు గ్రామీ పురస్కారం పొందారు. 1999లో రవిశంకర్‌ను ప్రభుత్వం అత్యున్నత పురస్కారం 'భారత రత్న'తో సత్కరించింది.


రవిశంకర్‌ అసలు పేరు రబింద్రో శౌంకోర్‌ చౌదురి. తన బాల్యంలో నృత్యం నేర్చుకునేందుకు సోదరుడు ఉదయ్‌శంకర్‌తో కలిసి యూరప్‌ వెళ్లాడు. 1938లో నృత్యాన్ని పక్కనబెట్టి సితార్‌ నేర్చుకోవడానికి అల్లాద్దిన్‌ ఖాన్‌ అనే విద్వాంసుడి వద్ద చేరాడు. 1944లో చదువు అనంతరం మ్యూజిక్‌ కంపోజర్‌గా జీవితాన్ని ప్రారంభించి సత్యజిత్‌రే 'అప్పు' చిత్రానికి పనిచేశారు. 1949 నుంచి 1956 వరకు సంగీత దర్శకునిగా ఢిల్లీ ఆల్‌ ఇండియా రేడియోకు సేవలు అందించారు.


1956 నుంచి యూరప్‌, అమెరికాలో హిందుస్థాని క్లాసికల్‌ సంగీత ప్రదర్శనలు ఇవ్వడం ప్రారంభించారు. బోధన, పదర్శనల ద్వారా హిందుస్థాని క్లాసికల్‌ సంగీతానికి ప్రపంచవ్యాప్త గుర్తింపు తీసుకువచ్చారు. తన కూతురు అనౌష్కతో కలిసి సంగీత ప్రదర్శనలు ఇచ్చారు. 2003లో అనౌష్క తన మ్యూజిక్‌ అల్బమ్‌ ద్వారా గ్రామీ అవార్డుకు నామినేట్‌ అయ్యారు.

అవార్డులు:

1975లో యునెస్కో సంగీత పురస్కారం
1981లో పద్మవిభూషణ్‌ పురస్కారం
1988లో కాళిదాస్‌ సమ్మాన్‌ పురస్కారం
1992లో రామన్‌ మెగసేసే పురస్కారం
1999లో అత్యున్నత పురస్కారం భారతరత్న

1986 నుంచి 1992 వరకూ రాజ్యసభలో నామినేటెడ్‌ సభ్యునిగా వ్యవహరించారు.

  • ========================
 Visit my website - > Dr.seshagirirao.com/

Wednesday, December 12, 2012

Ajur daa-అజూర్ దా

మానవులు పుడతారు ... చనిపోతారు . కొంతమంది మాత్రమే తమ జీవితం లో ప్రజలకు ఉపయోగపడే సేవాకార్యక్రమాలు చేసి తమ జీవితాన్నే ఫణం గా పెట్టి మానవ జాతిలో చిరస్థాయిగా తరతరాలుగా నిలిచిపోతారు ... వీరిని "మృతంజీవులు" అని అంటారు . కోటాను కోట్ల జనం లో బహు కొద్ది మంది మాత్రమే ఇలాంటివారు ఉంటారు . ప్రపంచము లో ప్రతి జాతి లోనూ ఈ తరహా మహానుభావులు పుట్టి తమ సేవలతో పుణీతులయ్యారు . భారత జాతికి మణిపూసలైన కొందరి మహానుభావులను తెలుసుకునే ప్రయత్నం లో ఇక్కడ -అజూర్ దా- గురించి తెలుసుకొని మన జీవితాన్ని చక్కని మార్గములో ప్రయాణించే ప్రయత్నం చేద్దాము ....

  •  =========================
 Visit my website - > Dr.seshagirirao.com/

Jagadesh Chandra Bose-జగదీష్ చంద్ర బోస్



  •  
 మానవులు పుడతారు ... చనిపోతారు . కొంతమంది మాత్రమే తమ జీవితం లో ప్రజలకు ఉపయోగపడే సేవాకార్యక్రమాలు చేసి తమ జీవితాన్నే ఫణం గా పెట్టి మానవ జాతిలో చిరస్థాయిగా తరతరాలుగా నిలిచిపోతారు ... వీరిని "మృతంజీవులు" అని అంటారు . కోటాను కోట్ల జనం లో బహు కొద్ది మంది మాత్రమే ఇలాంటివారు ఉంటారు . ప్రపంచము లో ప్రతి జాతి లోనూ ఈ తరహా మహానుభావులు పుట్టి తమ సేవలతో పుణీతులయ్యారు . భారత జాతికి మణిపూసలైన కొందరి మహానుభావులను తెలుసుకునే ప్రయత్నం లో ఇక్కడ -సర్ జగదీష్ చంద్ర బోస్- గురించి తెలుసుకొని మన జీవితాన్ని చక్కని మార్గములో ప్రయాణించే ప్రయత్నం చేద్దాము ....


సర్ జగదీష్ చంద్ర బోస్,-- బెంగాల్ కు చెందిన ప్రముఖ శాస్త్రవేత్త. ఇతడు రేడియో మరియు మైక్రోవేవ్ ఆప్టిక్స్ తో వృక్షశాస్త్రంలో గణనీయమైన ఫలితాల్ని సాధించారు. ఇతన్ని రేడియో విజ్ఞానంలో పితామహునిగా పేర్కొంటారు. ఇతడు భారతదేశం నుండి 1904 సంవత్సరంలో అమెరికా దేశపు పేటెంట్ హక్కులు పొందిన మొట్టమొదటి వ్యక్తి.

జననం-    నవంబర్ 30 1858--మైమెన్‌సింగ్, తూర్పు బెంగాల్ (ప్రస్తుతము బంగ్లాదేశ్), బ్రిటీష్ ఇండియా,
మరణం-    నవంబర్ 23 1937 --గిరిడీ, బెంగాల్ ప్రావిన్స్, అవిభాజ్య భారతదేశం,
నివాసం-    అవిభాజ్య భారతదేశం, జాతీయత: భారతీయుడు, మతం:హిందూ,
రంగము-    భౌతిక శాస్త్రము, జీవ భౌతిక శాస్త్రం, జీవ శాస్త్రం, వృక్ష శాస్త్రం, పురాతత్వ శాస్త్రం, బెంగాలీ సాహిత్యం, బంగ్లా సైన్సు ఫిక్షన్,
సంస్థ-    ప్రెసిడెన్సీ కళాశాల,
మాతృ సంస్థ-    కలకత్తా విశ్వవిద్యాలయం,కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం,లండన్ విశ్వవిద్యాలయం,
ప్రాముఖ్యత-    మిల్లీమీటర్ తరంగాలు,రేడియో,క్రెస్కోగ్రాఫ్,

More details : < Jagadesh Chandra Bode Telugu  >
  • =====================

Visit my website - > Dr.seshagirirao.com/

Tuesday, September 25, 2012

Manmohan Singh-మన్మోహన్ సింగ్

  •  

మానవులు పుడతారు ... చనిపోతారు . కొంతమంది మాత్రమే తమ జీవితం లో ప్రజలకు ఉపయోగపడే సేవాకార్యక్రమాలు చేసి తమ జీవితాన్నే ఫణం గా పెట్టి మానవ జాతిలో చిరస్థాయిగా తరతరాలుగా నిలిచిపోతారు ... వీరిని "మృతంజీవులు" అని అంటారు . కోటాను కోట్ల జనం లో బహు కొద్ది మంది మాత్రమే ఇలాంటివారు ఉంటారు . ప్రపంచము లో ప్రతి జాతి లోనూ ఈ తరహా మహానుభావులు పుట్టి తమ సేవలతో పుణీతులయ్యారు . భారత జాతికి మణిపూసలైన కొందరి మహానుభావులను తెలుసుకునే ప్రయత్నం లో ఇక్కడ -మన్మోహన్ సింగ్- గురించి తెలుసుకొని మన జీవితాన్ని చక్కని మార్గములో ప్రయాణించే ప్రయత్నం చేద్దాము ....


 డా. మన్మోహన్ సింగ్ భారత దేశానికి 17వ ప్రధాన మంత్రి. భారత జాతీయ కాంగ్రెస్‌ సభ్యుడైన సింగ్ ప్రధాన మంత్రిగా మే 22, 2004 లో భాద్యతలు స్వీకరించారు. అనేక అర్హతలు కల సింగ్ 1991లో ఆర్థిక శాఖా మంత్రి గా ఉన్నప్పుడు ప్రారంభించిన ఆర్థిక సంస్కరణ ల వలన ప్రస్తుత భారత చరిత్రలో ముఖ్యుడిగా భావింపబడుతున్నాడు. మరియు ఇంతటి విద్యా మరియు సేవలలో అనుభవం కలిగిన ప్రధానమంత్రి ప్రపంచంలోనే లేడంటో అతిశయోక్తిగాదు.

ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ రేపు (26/09/2012) 80వ పుట్టినరోజు జరుపుకోబోతున్నారు. సంస్కరణవాదిగా ఒకప్పుడు తెచ్చుకున్న పేరును ఇటీవలే తిరిగి సాధించుకున్న ప్రధానికి ఈ పుట్టినరోజు శుభశకునాలనే సూచిస్తోంది. 1990వ దశకంలో ఆర్థికమంత్రిగా ఆయన సంస్కరణలకు తెరలేపి గొప్పపేరు ప్రతిష్ఠలు తెచ్చుకున్నారు. 2004లో కాంగ్రెస్‌ తిరిగి అధికారంలోకి వచ్చాక ప్రధాని అయిన మన్మోహన్‌కి తొలి ఐదేళ్లూ సాఫీగానే సాగాయి. 2009లో రెండో దఫా ప్రధాని అయిన తర్వాత మాత్రం గడ్డుకాలం ఎదుర్కొనక తప్పలేదు. వరుస కుంభకోణాలకు తోడు అండర్‌ ఎఛీవర్‌ అంటూ టైమ్‌, వాషింగ్టన్‌ పోస్టులాంటి పత్రికల కథనాలు ఆయన ప్రతిష్ఠకు మచ్చతెచ్చాయి. ఇటీవల ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టేందుకు ఎఫ్‌డీఐలకు స్వాగతం పలుకుతూ మరోసారి సంస్కరణల బాట పట్టిన మన్మోహన్‌ పునర్వైభవం సాధించారనవచ్చు.



For more details -> Manmohan Singh  (wikipedia.org)
  • ============================
Visit my website - > Dr.seshagirirao.com/

Tuesday, July 31, 2012

ప్రణబ్‌ముఖర్జీ ,Pranab Mukharjee




మానవులు పుడతారు ... చనిపోతారు . కొంతమంది మాత్రమే తమ జీవితం లో ప్రజలకు ఉపయోగపడే సేవాకార్యక్రమాలు చేసి తమ జీవితాన్నే ఫణం గా పెట్టి మానవ జాతిలో చిరస్థాయిగా తరతరాలుగా నిలిచిపోతారు ... వీరిని "మృతంజీవులు" అని అంటారు . కోటాను కోట్ల జనం లో బహు కొద్ది మంది మాత్రమే ఇలాంటివారు ఉంటారు . ప్రపంచము లో ప్రతి జాతి లోనూ ఈ తరహా మహానుభావులు పుట్టి తమ సేవలతో పుణీతులయ్యారు . తెలుగు జాతికి మణిపూసలైన కొందరి మహానుభావులను తెలుసుకునే ప్రయత్నం లో ఇక్కడ -ప్రణబ్‌ముఖర్జీ ,Pranab Mukharjee- గురించి తెలుసుకొని మన జీవితాన్ని చక్కని మార్గములో ప్రయాణించే ప్రయత్నం చేద్దాము ....


క్లుప్తంగా...
  • పేరు : ప్రణబ్‌ ముఖర్జీ
  • పుట్టిన తేదీ : డిసెంబరు 11, 1935
  • ముద్దుపేరు : పోల్తూ
  • ప్రాంతం         : మీరట్‌, పశ్చిమబెంగాల్‌,
  • పార్టీలు        : రాష్ట్రీయ సమాజ్‌వాదీ కాంగ్రెస్‌,
  • కన్నవారు : అమ్మ రాజ్యలక్ష్మి, నాన్న కమదాకింకర్‌ ముఖర్జీ
  • కుటుంబం : అర్ధాంగి సువ్ర. ఇద్దరు కొడుకులు (అందులో ఒకరు శాసనసభ్యులు), ఒక కూతురు.
  • పిల్లలు        : షర్మీస్తా, అభిజిత్‌, ఇంద్రజిత్‌
  • ప్రస్తుతం        : రాష్టప్రతిగా..స్వీకరణ        : 25 జులై 2012

  • చేపట్టిన పదవులు: రాజ్యసభ సభ్యుడు, లోక్‌సభ సభ్యుడు, కేంద్రమంత్రి (విదేశీ వ్యవహారాలు, ఆర్థిక, రక్షణ, నౌకాయాన, రెవెన్యూ- బ్యాంకింగ్‌, వాణిజ్య తదితర), ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ సభ్యుడు, పశ్చిమ బెంగాల్‌ పీసీసీ అధ్యక్షుడు. అంతర్జాతీయ ద్రవ్యనిధి, ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు తదితర సంస్థల్లో కీలక బాధ్యతలు. దాదాపు 30 మంత్రిత్వ బృందాలకు నాయకత్వం.

  • అవార్డులు : ఉత్తమ పార్లమెంటేరియన్‌, పద్మవిభూషణ్‌
* * *
బహుదూరపు బాటసారి -- ఇందిర నుంచి సోనియా దాకా - ఎందరో నేతలు. రాజ్యసభ సభ్యత్వం నుంచి కేంద్రమంత్రి హోదా దాకా - ఎన్నో పదవులు. మిరాటీ నుంచి కొత్తఢిల్లీ దాకా - ఎన్నో మైళ్లు. భారత రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ జీవితం ఓ సుదీర్ఘ ప్రయాణం.

ఎక్ల చొలో... ఎక్ల చొలో... ఎక్ల చొలోరే! 'ఎవరూ నీవెంట రాకున్నా... ఎవరూ నీ పిలుపు వినకున్నా...కారుచీకటైనా కారడవైనా... ఒంటరిగా... ఒంటరిగా... ఒంటరిగానే ముందుకు సాగవోయ్‌!' ప్రణబ్‌ముఖర్జీకి ఠాగూర్‌ సాహిత్యమంటే ప్రాణం. ఆనందంగా ఉన్నా, విషాదమనిపించినా పడక్కుర్చీలో సేదతీరుతూ రవీంద్ర సంగీతం వింటారు. అందులోనూ 'ఎక్ల చొలో..' గీతమంటే మరీ ఇష్టం. ఆ పాటకూ తన జీవితానికీ ఎక్కడో పోలిక ఉన్నట్టు అనిపిస్తుంది. నిజమే, నాలుగున్నర దశాబ్దాల ప్రజా జీవితంలో ఆయనదెప్పుడూ ఒంటరి ప్రయాణమే. అధికారగణం, ప్రొటోకాల్‌ హంగామా, గాంధీ-నెహ్రూ కుటుంబంతో సన్నిహిత సంబంధాలు...ఎన్నున్నా, అంతరాంతరాల్లో ప్రణబ్‌ ఏకాకే. ఎంతోకొంత అంతర్ముఖుడే!

మూడుతరాలు...
'భారత ప్రజాస్వామ్యం వెనుక నెహ్రూ, ఆధునికత వెనుక ఇందిర, టెక్నాలజీ వెనుక రాజీవ్‌'... ప్రణబ్‌ ప్రసంగాల్లో మూడుతరాల ముచ్చట ఉండితీరుతుంది. దేశం మీదే కాదు, ఆయన రాజకీయ జీవితం మీదా ఆ ముగ్గురి ప్రభావం అపారం. నెహ్రూతో తనకున్నది భావజాల అనుబంధం. తొలిప్రధాని ఉపన్యాసాలన్నీ శ్రద్ధగా చదివారు. కొన్ని కంఠతా వచ్చు కూడా. గాంధీ-నెహ్రూ కుటుంబంతో ప్రత్యక్ష పరిచయం మాత్రం ఇందిర హయాంలోనే!

ఓసారి రాజ్యసభలో బ్యాంకుల జాతీయీకరణపై చర్చ జరుగుతోంది. ప్రణబ్‌వంతు వచ్చింది. బిత్తరచూపులతో మైకు అందుకున్న ఆ కొత్త ఎంపీని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. క్రమంగా ఉపన్యాసం వూపందుకుంది. అంకెలు రంకెలేశాయి. విమర్శలు చురుకుపుట్టించాయి. చరిత్ర, అర్థశాస్త్రం, సామ్యవాదం- ప్రణబ్‌ స్పృశించని కోణమంటూ లేదు. ప్రసంగం ముగిసింది. చప్పట్లు మోగాయి. ప్రధాని ఇందిరాగాంధీ కూడా ఆ ఉపన్యాసాన్ని విన్నారు. ఆవేశం వచ్చినా, ఆనందం కలిగినా ఆమె ఆపుకోలేరు. వెంటనే ప్రణబ్‌ను పిలిపించి అభినందించారు. కాంగ్రెస్‌ పార్టీకి సంబంధించినంత వరకూ అధినేత్రి దృష్టిలోపడటం అంటే... పెద్ద పదవి చేపట్టడానికి సిద్ధంగా ఉండటం. అందులోనూ మంత్రివర్గ విస్తరణపై వూహాగానాలు వినిపిస్తున్న సమయమది. ప్రణబ్‌ ఎలాంటి ఆశలూ పెట్టుకోలేదు. సాధారణ అతిథిగానే ప్రమాణ స్వీకారోత్సవానికి వెళ్లారు. మొత్తం ఏడు పేర్లు ఖరారయ్యాయి. ఇందిర సంఖ్యాశాస్త్రాన్ని నమ్మేవారు. ఆ అంకె అశుభసూచకమని అనిపించింది. మరో మంత్రిని తీసుకుంటే ఎలా ఉంటుందన్న ఆలోచన కలిగింది. ఎవరా ఎనిమిదో వ్యక్తి? రాజ్యసభలో ప్రణబ్‌ గంభీరోపన్యాసం గుర్తుకొచ్చింది. ఎంపీల మధ్య ఉన్న ప్రణబ్‌ను పిలిచి, 'మంత్రిగా ప్రమాణం చేస్తారా?' అనడిగారు. ఎవరైనా కాదనగలరా! పారిశ్రామిక అభివృద్ధిశాఖ సహాయమంత్రి హోదాలో రాష్ట్రపతి భవన్‌ నుంచి బయటికొచ్చారు ప్రణబ్‌ముఖర్జీ. 'ఇదంతా మీడియా వండివార్చిన మసాలా కథనం మాత్రమే. వాస్తవం ఏమిటంటే.. ప్రణబ్‌ రాజకీయ గురువు అజయ్‌ ముఖర్జీ స్వయంగా ఇందిరాగాంధీకి ఫోన్‌ చేసి మంత్రిపదవి ఇప్పించారు' అంటారు నాటి పరిణామాలను దగ్గర నుంచి పరిశీలించిన రాజకీయ విశ్లేషకులు.

ప్రణబ్‌ మితభాషి కావచ్చు. కానీ ప్రియభాషి. ఆయన సంభాషణల్లో పదాడంబరం ఉండదు. సాహితీ గుబాళింపు కనిపిస్తుంది. తరచూ భగవద్గీతను ఉటంకిస్తారు. ఠాగూర్‌ ప్రస్తావన సరేసరి. ఆయన మాటతీరే కాదు, పనితీరూ ఇందిరకు నచ్చింది. రెండేళ్లలో రెవెన్యూ, బ్యాంకింగ్‌ విభాగాల సహాయమంత్రి అయ్యారు. కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సభ్యత్వం లభించింది. అంతలోనే అత్యవసర పరిస్థితి! ఆతర్వాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఘోరంగా ఓడిపోయింది. ఆ సమయంలో ప్రణబ్‌ పార్టీకి అండగా నిలబడ్డారు. ఆ కృతజ్ఞతతోనే, అధికారంలోకి వచ్చాక మంత్రివర్గంలో పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగించారు ఇందిర. సమర్థతతో, విశ్వసనీయతతో వాణిజ్యశాఖ నుంచి ఆర్థికశాఖ దాకా ఎదిగారు ప్రణబ్‌. క్యాబినెట్‌లో ఆయనే 'నంబర్‌ టూ'.

ఇందిరతో ఆయనకున్నది...కేంద్రమంత్రి-ప్రధాని సంబంధానికి అతీతమైన అనుబంధం. ఓసారి 'ప్రణబ్‌! మన క్రికెట్‌ జట్టు వరల్డ్‌ కప్‌ గెలిచింది...' ఎంతో ఉత్సాహంగా ఫోన్‌ చేశారు ఇందిరాగాంధీ. ఆయనకు క్రికెట్‌లో ఓనమాలు తెలియవు. ఆసక్తి కూడా లేదు. 'అలాగా...గ్రేట్‌...వెరీగుడ్‌' అంటూ లేని ఉత్సాహాన్ని ప్రదర్శించాల్సి వచ్చింది. ఇద్దరికీ ఆసక్తి ఉన్న అంశం మాత్రం ... పుస్తక పఠనమే. తనకు బాగా నచ్చిన పుస్తకాలను ప్రణబ్‌కు పంపేవారు ఇందిరాగాంధీ. ప్రణబ్‌ కూడా ఆమెకు మంచి పుస్తకాల్ని సిఫార్సు చేసేవారు. ఎర్వింగ్‌ టోఫ్లెర్‌ రాసిన పుస్తకం ప్రణబ్‌కు తెగ నచ్చింది. చదవమంటూ ప్రధానికి పంపారు. రెండ్రోజుల్లోనే పుస్తకం వెనక్కి వచ్చింది. చివరిపేజీలో... 'పుస్తకం బావుంది, కృతజ్ఞతలు. కానీ నా ఆర్థిక మంత్రి టోఫ్లెర్‌ పుస్తకాన్ని చదువుతూ కూర్చుంటే, బడ్జెట్‌ గతేంకాను'...అంటూ ఇందిర స్వదస్తూరీలో రాసిన చీటీ. అది బడ్జెట్‌ సీజన్‌ మరి! ఏదో హాస్యానికి అలా రాశారు కానీ, తన ఆర్థికమంత్రి సామర్థ్యం ఆమెకు తెలియంది కాదు. ప్రణబ్‌ పనిరాక్షసుడు. రోజుకు పద్దెనిమిది గంటలు కష్టపడగలరు. ఉద్యోగులంతా వెళ్లిపోయాక...ఆయన సొరుగులోని ఫైళ్లు తెరుచుకుంటాయి. రాత్రంతా ఆఫీసు లైట్లు వెలుగుతూనే ఉంటాయి.

ఇందిర దుర్మరణం ప్రణబ్‌ రాజకీయ జీవితంలో పెద్ద కుదుపు. నాటి అనిశ్చిత పరిస్థితుల్లో...రెండో స్థానం నుంచి మొదటి స్థానానికి ఎగబాకాలని ప్రణబ్‌ ఆశించడంలో తప్పులేదు. వారసత్వ రాజకీయాలకు నెలవైన కాంగ్రెస్‌ పార్టీలో అది నేరం, విశ్వాసఘాతుకం! రాజీవ్‌ ప్రధాని కావడంతో పరిస్థితులు మారిపోయాయి. ప్రణబ్‌కు కష్టాలు మొదలయ్యాయి. ప్రణబ్‌కు రాజీవ్‌ కేబినెట్‌లో స్థానం లభించలేదు. బెంగాల్‌ బాధ్యతలు అప్పగించి ఢిల్లీ నుంచి వెళ్లిపొమ్మని పరోక్షంగా సంకేతాలిచ్చారు. తర్వాత ఆ పీఠం నుంచీ తొలగించారు. ఉనికి చాటుకోడానికి, తనలాగే వివక్షకు గురవుతున్న సీనియర్లతో జతకట్టారు ప్రణబ్‌. రాజీవ్‌ విధాన నిర్ణయాలను విమర్శిస్తూ కమలాపతి త్రిపాఠి ఓ లేఖ రాశారు. అదికాస్తా పత్రికల చేతికి చిక్కింది. పెద్ద గొడవైంది. ఏదో సాకు చూపించి..ప్రణబ్‌ను పార్టీ నుంచి వెలివేశారు. 'అప్పటికి నా వయసు నలభై ఎనిమిది. తొమ్మిదేళ్లు కేంద్ర క్యాబినెట్‌లో ఉన్నాను. పద్నాలుగేళ్లు రాజ్యసభ సభ్యుడిగా వ్యవహరించాను. మిగిలిన జీవితమంతా ఏం చేయాలో అర్థంకాని పరిస్థితి'..అంటూ ఆ చేదు అనుభవాన్ని గుర్తుచేసుకుంటారు ప్రణబ్‌. ఇష్టం ఉన్నా లేకపోయినా... తనకంటూ ఓ రాజకీయ వేదిక ఏర్పాటు చేసుకోవడం తప్పనిసరైంది. రాష్ట్రీయ సమాజ్‌వాదీ కాంగ్రెస్‌ను స్థాపించి...ఎన్నికల బరిలో దిగారు. ఘోరపరాజయం ఎదురైంది. రాజకీయాల అసలు రంగు తెలిసింది. మనసు మళ్లీ కాంగ్రెస్‌వైపు మళ్లింది. ఆ సమయానికి రాజీవ్‌ పూర్వవైభవాన్ని కోల్పోయి దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. బోఫోర్స్‌ ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ప్రణబ్‌ను ఇబ్బందులకు గురిచేసిన అరుణ్‌నెహ్రూ తదితరులు పార్టీని వదిలి వెళ్లిపోయి, విశ్వనాథ్‌ ప్రతాప్‌సింగ్‌ మంత్రివర్గంలో చక్రం తిప్పుతున్నారు. కాంగ్రెస్‌ కూడా ప్రణబ్‌ వంటి అనుభవజ్ఞుల అవసరాన్ని గుర్తించింది. అప్పుడే, త్రిపుర శాసనసభ ఎన్నికలు జరుగుతున్నాయి. 'పార్టీని గట్టెక్కించాల్సిన బాధ్యత మీదే..' అన్నారు రాజీవ్‌. ఇందిర హయాంలో సాధించుకున్న ప్రతిష్ఠ పూర్తిగా మసకబారిపోయింది. ఒక్కో ఇటుకా పేర్చుకుని కాంగ్రెస్‌లో తనకంటూ ఓ పునాది నిర్మించుకోవాల్సిన పరిస్థితి. ఆ అవకాశాన్ని వదులుకోలేదా ఆశావాది. 'తప్పకుండా...'అని భరోసా ఇచ్చారు. కాలం కూడా కలిసొచ్చింది. కాంగ్రెస్‌ నేతృత్వంలోని సంకీర్ణ కూటమి అధికారంలోకి వచ్చింది. రాజీవ్‌తో సాన్నిహిత్యమూ పెరిగింది. ఏదో సందర్భంలో... 'ప్రణబ్‌జీ! అప్పట్లో కమలాపతి త్రిపాఠి పేరు మీద వచ్చిన సుదీర్ఘలేఖ రచయిత మీరే కదూ! నాకు అప్పుడే అనిపించింది.. అంత చక్కగా, అంత విమర్శనాత్మకంగా మీరు తప్ప ఎవరూ రాయలేరు' అనడిగారు రాజీవ్‌. బదులు చెప్పలేదు ప్రణబ్‌. అవుననలేరు. కాదనలేరు.

రాజీవ్‌ దుర్మరణంతో పార్టీలో నాయకత్వ సమస్య మొదలైంది. బయటికెళ్లిరావడం ప్రణబ్‌ ప్రధాన అనర్హతగా మారింది. ప్రధాని పదవి మీద ఆశ ఉన్నా...పోటీపడలేకపోయారు. దూరం నుంచే ఆ పరుగుపందాన్ని గమనించారు. ప్రధాని పీఠం పీవీ నరసింహారావును వరించింది. ఆయన సర్కారులో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా, విదేశాంగమంత్రిగా పనిచేశారు. సోనియా రాజకీయ ప్రవేశం... ప్రణబ్‌ జీవితంలో కీలకమైన మలుపు. ఆమెను నాయకత్వ బాధ్యతలకు ఒప్పించిన వారిలో ప్రణబ్‌ ఒకరు. 'విదేశీయత' కారణంగా సోనియా ప్రధాని పదవి వద్దనుకున్నప్పుడు, ప్రణబ్‌కే పీఠం దక్కుతుందని అంతా భావించారు. కానీ ఆమె మన్మోహన్‌సింగ్‌ పేరు సిఫార్సు చేశారు. మరోసారి ఆశాభంగం. ఇందిర క్యాబినెట్‌లో ఆర్థికమంత్రిగా ఉన్నప్పుడు, తాను రిజర్వు బ్యాంకు గవర్నరుగా నియమించిన వ్యక్తి ప్రధానమంత్రి కావడం, ఆయన నాయకత్వంలో పనిచేయాల్సి రావడం కాస్త ఇబ్బందిగానే అనిపించింది. అదీ తాత్కాలికమే. విభేదించడం, వ్యతిరేకించడం, విమర్శించడం...అన్నపదాల్ని ప్రణబ్‌ ఎప్పుడో తన నిఘంటువు నుంచి తొలగించారు. సంక్షోభాల్లో సమస్యల్లో అధినాయకురాలికి అండగా నిలిచారు. కురువృద్ధుడైన ప్రణబ్‌ తన మంత్రివర్గంలో సర్దుకుపోగలరా అన్న అనుమానం, కొంతకాలం మన్మోహన్‌నూ పీడించేది. మనసులో ఏం ఉన్నా...చక్కని సమన్వయంతో పనిచేసుకుపోయారు ప్రణబ్‌. అణు ఒప్పందం వంటి సంక్షోభ సమయాల్లో ప్రధానికి రక్షణ కవచమయ్యారు. ఎనిమిదేళ్ల అనుబంధం మన్మోహన్‌కు ప్రణబ్‌ అంటే గౌరవాన్ని పెంచింది. రోడ్డు ప్రమాదంలో ఆయన తీవ్ర గాయాలపాలైనప్పుడు...ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానం పంపారు. స్వయంగా ఎయిర్‌పోర్టుకు వచ్చి ఆసుపత్రికి తీసుకెళ్లారు.

ప్రణబ్‌ముఖర్జీ ఆర్థిక మంత్రిగా రాజీనామా చేసిన రోజు.. కాంగ్రెస్‌ పార్టీ యువనేత రాహుల్‌గాంధీ ఆయనతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. దాదా చెప్పిన నానమ్మ కబుర్లూ, నాన్న జ్ఞాపకాలూ వింటూ చాలాసేపు కూర్చుండిపోయారు. కాంగ్రెస్‌ చరిత్రకు సంబంధించి ప్రణబ్‌ నడిచే ఎన్‌సైక్లోపిడియా. ఓసారి ఇందిర వెంట సౌదీ అరేబియా వెళ్లారు. సౌదీ రాజు తమ ప్రణాళికల గురించి వివరించారు. ఇందిర కూడా తమ ప్రభుత్వం పనితీరును చెప్పాలనుకున్నారు. అప్పటికప్పుడు ఎవరైనా ఏం మాట్లాడగలరు? అధికారులు తెల్లమొహం వేశారు. ప్రణబ్‌వైపు చూశారామె. అధినేత్రి ఆదేశం అర్థమైంది. పంచవర్షప్రణాళికల గురించీ ఇరవైసూత్రాల పథకం గురించీ అంకెలతో సహా వివరించారు. 'మిమ్మల్ని అంతా హ్యూమన్‌ కంప్యూటర్‌ అని ఎందుకంటారో ఇప్పుడు నాకు అర్థమైంది' అని ప్రశంసించారు ప్రధాని. ఏ సంవత్సరం ఎన్నికోట్లతో బడ్జెట్‌ ప్రవేశపెట్టారు, ఏ సందర్భంలో ఇందిరాగాంధీ ఎలా వ్యవహరించారు... ఇలా ఎవరూ గుర్తుంచుకోలేని, ఎవరికీ చూచాయగా అయినా తెలియని చాలా విషయాలు ప్రణబ్‌ బుర్రలో నిక్షిప్తమై ఉన్నాయి. ఇంకొన్ని పాత డైరీల్లో భద్రంగా ఉన్నాయి. ఇప్పటికీ ఆయన డైరీ రాసుకుంటారు. 'ప్రజల భూముల్ని లాక్కునే హక్కు ప్రభుత్వానికి ఎక్కడిది? పేదల పొట్టకొట్టి పారిశ్రామికవేత్తల కడుపు నింపడం ఎంతవరకు న్యాయం? తప్పనిసరి పరిస్థితుల్లో తీసుకోవాల్సి వచ్చినా సరైన ధర చెల్లించాలి. అభివృద్ధిలో వారినీ భాగస్వాములను చేయాలి'...నందిగ్రామ్‌ ఉదంతం జరిగిన రోజు ప్రణబ్‌ డైరీలో అక్షర అంతర్మథనమిది.
రాజకీయ యోధుడు..
చేతిలో బంతి పెట్టి వెళ్లిపోయారు డ్రిల్‌ మాస్టరు. ఫుట్‌బాల్‌ ఆడుకుందామంటే...దాన్లో గాలి లేదు. స్టోర్‌రూమ్‌లోంచి మరొకటి తీసుకురావడానికి ఎవరికీ ధైర్యం చాల్లేదు. అక్కడ హెడ్‌మాస్టరు ఉన్నారు. పిల్లలంతా నిరాశపడిపోయారు. ప్రణబ్‌కు ఓ ఆలోచన వచ్చింది. పక్కనే ఉన్న దుకాణంలో సైకిలు పంపు తెచ్చాడు. తన దగ్గరున్న పాతపైపు జోడించి ... బంతిలో గాలి నింపాడు. సహపాఠీల ఆనందానికి అవధుల్లేవు. 'మనోడు సైంటిస్టురా...' అంటూ ఆకాశానికెత్తేశారు. శాస్త్రవేత్త కాదుకానీ, ప్రణబ్‌లో గొప్ప క్రైసిస్‌ మేనేజర్‌ ఉన్నాడు. కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ మీటింగులో అయినా, క్యాబినెట్‌ సమావేశంలో అయినా, గాంధీ-నెహ్రూ కుటుంబ సభ్యులతో ఆంతరంగిక సమావేశంలో అయినా... ఏదైనా సంక్షోభం గురించి చర్చిస్తున్నప్పుడు ప్రణబ్‌ అభిప్రాయానికి చాలా విలువ ఉంటుంది. సమస్యల పరిష్కారంలో ఆయన నేర్పరి. కాంగ్రెస్‌లో చాలామంది విధేయులే ఉన్నారు. సీనియర్లూ ఉన్నారు. వక్తలకూ కొదవలేదు. ఆ సంక్షోభ నివారణ నైపుణ్యమే..ప్రణబ్‌కు ప్రత్యేక స్థానాన్ని సంపాదించిపెట్టింది. ఆ పరిణతి యాదృచ్ఛికంగా వచ్చింది కాదు, అనుభవంతో పదునుపెట్టుకున్నది. తొలిసారిగా బాధ్యతలు చేపట్టిన సహాయ మంత్రులు కూడా..తమ సమయంలో కొంత రాజకీయాలకూ కొంత పాలనకూ కొంత నియోజకవర్గానికీ కేటాయించుకుంటారు. సొంత వ్యాపారాలూ వ్యవహారాలూ ఉండనే ఉంటాయి. ప్రణబ్‌ మాత్రం...పూర్తి సమయాన్ని బాధ్యతలకే అంకితం చేశారు. అదే సర్వస్వం! విద్యార్థి పాఠ్యపుస్తకాన్ని చదివినంత శ్రద్ధగా తన దగ్గరికొచ్చిన ఫైళ్లను చదివారు. విలుకాడు లక్ష్యానికి గురిపెట్టినట్టు... సంక్షోభాలపై దృష్టి సారించారు. 'ఫ్రొఫెషనలిజమ్‌' ఆయన ప్రధాన అర్హత. అదే అనర్హతగానూ మారింది. గత రాష్ట్రపతి ఎన్నికలప్పుడే, ఎవరి ద్వారానో సోనియాకు తన మనసులోని మాట చెప్పించారు. 'ప్రణబ్‌జీ! మీరు రాష్ట్రపతి అయితే, సంతోషించే మొదటి వ్యక్తిని నేనే. మీ స్థానాన్ని ఎవరితో భర్తీ చేయాలో చెప్పండి. ఆపని చేసిపెట్టి... నిరభ్యంతరంగా వెళ్లండి' అన్నారు సోనియా. నిజమే, ఎవరున్నారు? మారుమాట్లాడలేక పోయారు. ఇప్పటికీ, ఆలోటు భర్తీ చేయడం అసాధ్యమే. కానీ, దశాబ్దాలుగా పార్టీకి సేవచేస్తున్న డెబ్భై ఏడేళ్ల వయోధికుడిని ఇంకా ఇబ్బందిపెట్టడం సముచితం కాదని అధిష్ఠానం భావించినట్టుంది. రాష్ట్రపతి అభ్యర్థిగా ఆయన పేరు ఖరారు చేసింది.

ఇన్నేళ్లు, ఇన్నిసార్లు తనతో దాగుడుమూతలాడిన ప్రధాని పీఠం... భవిష్యత్‌లో అయినా వరిస్తుందన్న నమ్మకం లేదు. ఆ అవకాశం కనుచూపుమేరలో కూడా లేదు. అంతా అనుకూలిస్తే, 2014 ఎన్నికల తర్వాత అధికారం చేపట్టడానికి రాహుల్‌ సిద్ధంగా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో, ఈ వయసులో...చిటారు కొమ్మన మిఠాయి పొట్లాన్ని ఎగిరి అందుకోవాలనుకోవడం అత్యాశే అవుతుంది. అన్నివైపుల నుంచీ ఆలోచించాక... రాష్ట్రపతి పదవినే తుది మజిలీగా ఎంచుకున్నారు ప్రణబ్‌. పరుగు ఆపడమూ ఓ కళే. ప్రణబ్‌ అందులోనూ నిష్ణాతులు.

ప్రధాని కాలేకపోయానన్న అసంతృప్తి ఆయన్ని వెంటాడుతోందా? అంటే, 'లేదులేదు. నాకెలాంటి అసంతృప్తీ లేదు. నేనేం పొడగరిని కాదు. అయినా, చాలా ఎత్తులే అందుకున్నాను. ఎంపీనయ్యాను. కేంద్రమంత్రినయ్యాను. ఇప్పుడు, రాష్ట్రపతి పదవి. బెంగాల్‌లోని ఓ మారుమూల ప్రాంతంలో పుట్టిన నాలాంటి మామూలు మనిషి .. ఇంతకుమించి ఏం కోరుకుంటాడు?' అంటారు ప్రణబ్‌. నిజమే, ఆయన వెనుక బలమైన రాజకీయ వారసత్వం లేదు. ఆస్తిపాస్తుల్లేవు. జనాకర్షణా లేదు. ఒక సాధారణ వ్యక్తి ఈ స్థాయికి చేరుకోవడం గొప్ప విషయమే. ప్రణబ్‌ లాయరు కావాలని కలలుకనేవారు. లెక్చరర్‌ కావాలనీ ఉండేది. దీంతో ఆ రెండు చదువులూ చదివారు. రెండు వృత్తుల్లోనూ కాలుపెట్టారు. కొంతకాలం పాత్రికేయుడిగానూ పనిచేశారు. లెక్చరరు ఉద్యోగం చేస్తున్న సమయంలో బెంగాల్‌ కాంగ్రెస్‌ నేత అజయ్‌ముఖర్జీ నేతృత్వంలో 'సేవ్‌ బెంగాల్‌' ఉద్యమం మొదలైంది. అప్పుడే, ప్రణబ్‌ మనసు రాజకీయాలవైపు మళ్లింది. ముఖర్జీకి మద్దతుగా నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆయన స్థాపించిన బంగ్లా కాంగ్రెస్‌లో ప్రధాన నాయకుడిగా ఎదిగారు. బంగ్లా కాంగ్రెస్‌, మార్క్సిస్టుల సంకీర్ణ ప్రభుత్వంలో కీలకపాత్ర పోషించారు. ఆయన సమర్థతకు బహుమతిగా పార్టీ రాజ్యసభకు పంపింది. కొంతకాలానికి అజయ్‌ ముఖర్జీ తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు. ప్రణబ్‌ తండ్రి కమదా కింకర్‌ కూడా కాంగ్రెస్‌వాదే. ఏఐసీసీ సభ్యుడిగానూ ఉన్నారు. తల్లిపేరు రాజ్యలక్ష్మి. బీర్బమ్‌ జిల్లాలోని మిరాటీ స్వగ్రామం. ఆరుగురు పిల్లల్లో ప్రణబ్‌ చివరివాడు. మిరాటీలో హైస్కూలు లేకపోవడంతో, ఏడు కిలోమీటర్లు నడిచి పొరుగూరికి వెళ్లేవాడు. వర్షాకాలంలో...పుస్తకాలూ యూనిఫామ్‌ ఓ గుడ్డలో చుట్టుకుని.. తడుస్తూ ఇంటికొచ్చిన రోజులున్నాయి. ఆ కష్టాలు ఆయనకు బాగా గుర్తున్నాయి. కాబట్టే, కేంద్రమంత్రి అయ్యాక సొంతూరి సమస్యల్ని చాలా వరకు పరిష్కరించారు. ఏడాదికి ఒకసారైనా స్వగ్రామానికి వెళ్తారు. దేవీ నవరాత్రులు పూర్వీకుల ఇంట్లోనే జరుపుకుంటారు. గ్రామంలోని పాఠశాల దగ్గర నిలబడి 'ప్రణబ్‌..' అని పిలిస్తే, చాలా తలలు మనవైపు తిరుగుతాయి. తమ వారసులూ ఆయనంతవాళ్లు కావాలని ఆపేరు పెట్టుకుంటారు గ్రామస్థులు.

పైపు పైపుకో చరిత్ర
ఒకప్పటి నలుపు-తెలుపు ఛాయాచిత్రాల్లో పైపులేని ప్రణబ్‌ముఖర్జీని చూడలేం. మధుమేహం కారణంగా, ఇరవై ఏళ్లక్రితం పైపును వదిలేయాల్సి వచ్చింది. అయినా మమకారం పోలేదు. ఆయన సొరుగులో ఇప్పటికీ ఒకటిరెండు పైపులైనా ఉంటాయి. వాటిలో ఒకటి ఇందిరాగాంధీ విదేశీ పర్యటనకు వెళ్లినప్పుడు తెచ్చినది.
సినిమాయణం
ప్రణబ్‌ ఇప్పటిదాకా రెండంటే రెండు సినిమాలే చూశారు. ఒకటి... 'రోమన్‌ హాలిడే', భార్య బలవంతం మీద వెళ్లాల్సి వచ్చింది. మరొకటి 'రంగ్‌ దే బసంతి', రక్షణశాఖ అనుమతి అవసరం కావడంతో, సెన్సార్‌ బోర్డు అధ్యక్షురాలు షర్మిలా ఠాగూర్‌ పట్టుబట్టి చూపించారు.
భోజనానికి...దాదా!
దాదా భోజనప్రియుడు. సంప్రదాయ బెంగాలీ వంటకాలంటే ప్రాణం. చిన్నప్పుడు ... ఉదయం లేవగానే 'అమ్మా బ్రేక్‌ఫాస్ట్‌ ఏమిటి?' అనడిగేవారట. బ్రేక్‌ఫాస్ట్‌ కాగానే 'మధ్యాహ్నానికి ఏం వండుతున్నారేమిటి?' అని వాకబు చేసేవారట. మధ్యాహ్న భోజనం తర్వాత చేయికడుక్కుంటూ రాత్రి భోజనం గురించి ఆరా తీసేవారట. వివిధ వంటకాల చరిత్రపై ఆయన సాధికారికంగా మాట్లాడగలరు.
జయజయతే...
ప్రణబ్‌ మహాభక్తుడు. కాళీ మాతను పూజిస్తారు. రోజూ ఉదయాన్నే ఓ గంట పూజ చేసికానీ బయటికి రారు. ఆ సమయంలో సందర్శకుల్ని అనుమతించరు. ఫోన్లో కూడా మాట్లాడరు - అది ప్రధానమంత్రి కాల్‌ అయినా సరే!
బెంగ్లీష్‌!
ప్రణబ్‌ ఆంగ్ల ఉచ్చారణ కాస్త తేడాగా ఉంటుంది. ఓసారి జయలలిత గురించి మాట్లాడుతూ 'జయలలిత కెనాట్‌ బి ...సేవ్డ్‌' అని పలకాల్సిన చోట 'కెనాట్‌ బి...షేవ్డ్‌' అన్నారు. అంతే, ఒకటే నవ్వులు! కెరీర్‌ తొలిరోజుల్లోనే ఇందిరాగాంధీ 'ఓ మంచి ట్యూటర్‌ను పెట్టుకుని ఇంగ్లిష్‌ ఉచ్చారణ మెరుగుపెట్టుకోవచ్చుగా ప్రణబ్‌!' అని సలహా ఇచ్చారు కూడా. 'ఎంత ప్రయత్నించినా గుండుసున్నాను చతురస్రం చేయగలమా మేడమ్‌!' అని గడుసుగా జవాబిచ్చారు దాదా.
రాకరాక వచ్చిన గెలుపు
ప్రణబ్‌కు ప్రత్యక్ష ఎన్నికలు కలిసిరాలేదు. పోటీచేసిన ప్రతిసారీ ఓడిపోయారు. ఓసారైతే ఇందిరాగాంధీ వద్దని చెప్పినా వినకుండా బరిలో దిగి, చిత్తుగా ఓడిపోయారు. 'నువ్వు గెలవవని అందరికీ తెలుసు, చివరికి మీ ఆవిడకి కూడా. ఓడిపోయి నాకు తలనొప్పి తెచ్చిపెట్టావు' అని చివాట్లేశారు ఇందిర. కాసేపటికే సంజయ్‌గాంధీ ఫోన్‌ చేసి, 'అమ్మ మీమీద చాలా కోపంగా ఉన్నారు. కానీ, ప్రణబ్‌ లేకుండా క్యాబినెట్‌ ఏమిటి... అంటున్నారు. మిమ్మల్ని వెంటనే బయల్దేరి రమ్మన్నారు' అని చెప్పి పెట్టేశారు. ప్రణబ్‌ను రిసీవ్‌ చేసుకోడానికి సంజయ్‌గాంధీ స్వయంగా ఎయిర్‌పోర్టుకు వెళ్లారు. చాన్నాళ్ల తర్వాత.. 2004 ఎన్నికల్లో జంగీపూర్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ప్రణబ్‌ గెలిచారు. 2009 ఎన్నికల్లో ఆ స్థానాన్ని నిలబెట్టుకున్నారు.

ఇందిర, రాజీవ్‌, పీవీ, సోనియా, మన్మోహన్‌ ... ప్రణబ్‌ రాజకీయ జీవితమంతా సలహాదారుగానో, వ్యూహరచయితగానో గడచిపోయింది. రాష్ట్రపతి హోదాలో సర్వస్వతంత్రంగా వ్యవహరించాల్సివస్తే.. రాజకీయ జీవితాన్ని ఇచ్చిన పార్టీతోనే విభేదించాల్సి వస్తే... ఆయనెలా స్పందిస్తారు? అందరు రాష్ట్రపతుల్లో ఒకరిగా మిగిలిపోతారా, తనదైన ముద్ర వేసుకుంటారా? ప్రణబ్‌ ఐదేళ్ల పదవీకాలమే ఈ ప్రశ్నకు జవాబు.

  • Courtesy with Eenadu Sunday magazine..
  • ==============================

Visit my website - > Dr.seshagirirao.com/